|| విదేశీ ప్రత్యక్ష మాయజాలం ||
నయా ఉదారవాద ఆర్థిక విధానాలు సంస్కరణలనే ముసుగు వేసుకొని దేశసంపదను బాహాటంగా కొల్లగొట్టడం మొదలుపెట్టి పాతిక సంవత్సరాలు పూర్తయిన ఈ సందర్భంలో ఆ విధానాల నిజస్వరూపం నగంగా బయట పడుతోంది. కొన్ని రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు లు ససేమిరా ఆహ్వానించరాదని ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అప్పట్లో వాదించగా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అవే పెట్టుబడులు అద్భుత మంత్రదండాల్లాగా కనబడుతుండడం యాదృచ్ఛికమేమీ కాదు!! ఆడేదెవరైనా ఆడించేవారు ఒక్కరే అని మరొక్కసారి రుజువవుతున్న సందర్భం ఇది. పైకి స్వదేశీ ముసుగు వేసుకున్న కాషాయదళం అధికారంలోకి రాగానే విదేశీ సామ్రాజ్యవాద శక్తులకు రక్షణ రంగంతో సహా అనేక కీలక రంగాలను దాసోహం చేయడం వారి సామ్రాజ్యవాద ఊడిగపు చరిత్ర కొనసాగింపే సుమా! మతమౌఢ్యపు మత్తుతో ఓలలా డుతూ, శాస్త్రీయత, హేమబద్ధతలను కాలరాస్తూ, ఒక పక్క బుద్ధిజీవులను భౌతికంగా సైతం నిర్మూలిస్తూ, మరో పక్క పాశ్చాత్య సాంకేతికత మన దేశానికి అవసరమని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నిస్సిగ్గుగా ఆహ్వానించడం బిజెపివారికే చెల్లింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అవసరమైతే యుద్ధ విమానాలను సరఫరా చేస్తామని విర్రవీగిన అమెరికాకు 'మాకు కేవలం ముడి అల్యూమినియం పంపించండి చాలు' అని చెప్పిన స్టాలిన్ ధీరోదాత్తత ఎక్కడీ? ప్రపంచంలోనే అత్యధిక ముడి అల్యూమినియం నిల్వలున్న దేశాల్లో ఒకటైన భారతదేశానికి ఆయుధ కర్మాగారాలను విదేశాల నుంచి ఆహ్వానిస్తున్న మోడీ నిర్లజ్జ లొంగుబాటు ఎక్కడీ? నిజానికి ముడిపదార్థాల పట్టుగొమ్మ అయిన భారతావని నుంచి వాటిని కొల్లగొట్టుకు పోయిన, పోతున్న సామ్రాజ్యవాదుల కన్నా మా వనరులు కొల్లగొట్టండి మహాప్రభు అంటూ ప్రాధేయపడుతున్న భారత పాలకవర్గం ప్రతినిధులు ఏ మాత్రం తక్కువ ద్రోహులు కాదు.
జాతీయోత్పత్తి వృద్ధిరేటు, తలసరి ఆదాయం వంటి గణాంక మాయజాల మత్తులో గత పాతికేళ్లుగా నిరుపేదల సంఖ్య పెరుగుతూనే ఉందన్నది వాస్తవం. మరుగున పడుతున్నా ఈ పరిణామం ఆయా విధానాల వైఫల్యం కాదా!! ఒక పక్క ఆగర్భ శ్రీమంతుల జాబితాలో భారతీయులు పెరుగుతూ ఉండటంతో పాటు మానవాభివృద్ధి సూచీలలో మనదేశం అనేక ఆఫ్రికా దేశాల కన్నా వెనుకబడి ఉండడం చేదు నిజం కాదా!! కేవలం కోట్లకు పడగలెత్తినవారే ఎన్నికల్లో పోటీ చేయగలిగే పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు ప్రజలకు ప్రాతినిధ్యం వహించకుండా బడాబాబుల కొమ్ముకాయడం, సామాన్యుల నడ్డివిరిచే విధానాల వాహకులుగా మారి ఉన్నత వర్గాల ఊడిగంలో ఓలలాడటం రాజకీయార్థిక దివాళాతనం కాదా!!
విజరు మాల్యా వంటి అపరాధులు అతి సులభంగా దేశం దాటి వెళ్లిపోయి సర్వసుఖాలూ అనుభవిస్తూండటం ఒక సామాన్య వ్యవసాయ రుణం తీసుకుని నిజాయితీగా వ్యవహరించే సగటు భారతీయ రైతుపై జరుగుతున్న క్రూర పరిహాసం కాదా!! విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల ధరల నుంచి ఎప్పుడు, ఎక్కడ, ఏ పంట వెయ్యాలో నిర్ణయించే అధికారం వరకూ గుత్తగా సొంతం చేసు కున్న బహుళజాతి కంపెనీలు భారత వ్యవసాయరంగాన్ని ఒంటిచేత్తో శాసిస్తూ మన ఆహార భద్రతకే తీవ్ర ప్రమాదంగా పరిణమించడం సిగ్గుచేటు కాదా!!
జిజ్ఞాస, పరిశోధన, అన్వయ శోధన వంటి మూల వ్యవస్థలోనే నిర్వీర్యం చేసి, శాస్త్రీయ అవగాహనను చిదిమివేసి, అతి పెద్ద సంఖ్యలో విదేశీ శక్తులకు చౌక కూలీలను అందించడమే ఏకైక ధ్యేయంగా విద్యారంగాన్ని భ్రష్టుపట్టించి కొన్ని తరాలపాటు వెన్నెముక లేని విద్యార్థులను ఉత్పత్తి చేయడం తిరోగమనం కాదా!!
ఇలా ఏ రంగం తీసుకున్నా సంక్షోభానికి అతిచేరువలో ఉన్న పరిస్థితి ఆయా విధానాల దుష్టపరిణామమే కదా!! ఎక్కువగా జరిగిన, జరుగుతున్న చెడుకు సైడ్ ఎఫెక్ట్లా మంచి కూడా ఉండడం విలోమ వైచిత్రి. ఇలాంటి తలకిందులు విధానాల కొనసాగింపుగా ఇప్పుడు రక్షణ, విమానయాన, ఔషధ, వ్యవసాయోత్పత్తుల వాణిజ్యం వంటి కీలక రంగాలతో పాటు మరికొన్ని ఇతర రంగాలకు ఇంచుమించు వంద శాతం ప్రత్యక్షపెట్టుబడులను ఆహ్వానిస్తూ విదేశీ శక్తులకు బార్లా తెరవడం ఆశ్చర్యకరమేమీ కాదు కానీ తప్పకుండా ప్రమాదకరం. ఈ సందర్భంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిజస్వరూపం నిగ్గుతేల్చాల్సిన అవసరం కూడా ఉంది.
ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉద్యోగ కల్పనకు ఉపయోగపడతాయనే ఒక దుష్ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని స్వయానా స్వయం సేవకుడైన గురుమూర్తి వంటి వారే సెలవిచ్చారు. 1991 నించి 2013 వరకు కార్పొరేట్ రంగం కొత్తగా 28 లక్షల ఉద్యోగాలు కల్పించింది. అయితే కేవలం సాఫ్ట్వేర్ రంగమే ఈ కాలంతో 35 లక్షల ఉద్యోగాలు కల్పించింది. దానర్థం ఏమిటంటే ఇంచుమించు ఏడు లక్షల ఉద్యోగాలు ఉత్పత్తి ఆధారిత వ్యవస్థీకృత రంగం నించి మాయమయ్యాయన్న మాట. అంటే ఉపాధి కల్పన అభూత కల్పన కాక మరేమిటి?
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుల్లో కన్నా బ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్టుల్లోకి ఎక్కువ ప్రవహించడం పచ్చినిజం. అంటే కొత్తగా మొదలెట్టే వ్యాపారాల కన్నా ఇప్పటికే మనుగడలో ఉన్న వ్యాపారాలలో వాటా కనుక్కోవడానికి ఈ పెట్టుబడులు మొగ్గు చూపుతున్నాయి. దేశీయ పెట్టుబడిదారుల దళారీకోరుతనం అందుకు సహాయ సహకారాలు అందిస్తోంది. తద్వారా యాజమాన్య మార్పు తప్ప కొత్తగా ఈ దేశానికి ఒరిగిందేమీ లేదు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానం గమనించి మనం కూడా అది నేర్చుకుంటూ క్రమంగా స్వావలంబన వైపు పరుగులు పెడతామని పాతికేళ్లుగా చెబుతూ వచ్చిన రంగుల కల అంతరిక్ష పరిశోధన, సాఫ్ట్వేర్, ఫార్మా వంటి రంగాల్లో తప్ప ఏ ఇతర రంగంలోనూ నిజమవుతున్న దాఖలాలు లేవు. ఇప్పటిదాకా సాధించిన సాంకేతిక పురోగతి కూడా ఇప్పుడు విదేశీ శక్తులకు ధారాదత్తం చెయ్యబూనడం మరో మోసం. లక్షల మంది ఇంజనీర్లను ప్రతి సంవత్సరం తయారు చేస్తున్న మనం అన్వేషణల్లో, ఆవిష్కరణల్లో మాత్రం ఎంత వెనకబడి ఉంటున్నామో గమనిస్తే ఈ వాదనల్లోని డొల్లతనం బయటపడుతుంది.
విదేశీ పెట్టుబడి మన ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశిస్తే ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుందన్న అపోహ కూడా సరైనది కాదు. ఎందుకంటే మనదేశంలోకి ప్రవహించే పెట్టుబడుల్లో కనీసం సగం మొత్తం రాయల్టీల రూపంలో, డివిడెండ్ల రూపంలో, కన్సల్టెన్సీ ఫీజుల రూపంలో బయటికి తరలించబడుతోందన్నది వాస్తవం కాబట్టి. అలాగే సేవారంగంలోకి ప్రవేశిస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేవలం భారతీయ నిపుణుల శ్రమను దోచుకుంటూ లాభాలు కొల్లగొడుతున్నారనేది స్పష్టం కాబట్టి. అలాగే బ్యాంకింగ్, బీమా రంగాల్లో విదేశీ కంపెనీలు తెచ్చే పెట్టుబడి అత్యంత స్వల్పం. కానీ మన ప్రజల దగ్గర డబ్బు సేకరించి దానితో వ్యాపారం చెయ్యడం వాటి లక్షణం కాబట్టి.
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, దేశీయ ఉత్పత్తి రంగానికి ఊతమివ్వడం, విద్యావ్యవస్థను శాస్త్రీయంగా సంస్కరించడం, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం, కొనుగోలు శక్తి పెరిగేలా చర్యలు తీసుకోవడం వంటి ముఖ్య చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు వీటికి మాత్రం అద్భుతమైన పేర్లు పెట్టి అంతర్లీనంగా సదుపాయాలు, నిధులు, వనరులు, దేశసంపద అయిన ముడిపదార్థాలు మాత్రం బడా కార్పొరేట్ శక్తులకు, విదేశీ బహుళజాతి గుత్తసంస్థలకు ధారాదత్తం చేయడం కేవలం కపటనాటకమే!!
విదేశీ పెట్టుబడులు మాత్రమే ఆహ్వానిస్తున్న ప్రభుత్వాలు ఎంతో ముఖ్యమైన ఒక నిర్ణయానికి ప్రజాభిప్రాయాన్ని కోరిన బ్రిటన్ నుంచి అటువంటి ప్రజాస్వామ్యిక విలువలు కూడా ఆహ్వానించి అవాహన చేసుకుంటే మంచిది. అయినా ఆశావాదం మంచిదే కానీ మిధ్యావాదం నిరుపయోగం.
- ప్రొఫెసర్ రాంపల్లి శశికుమార్

No comments:
Post a Comment