Wednesday, 28 December 2016

|| అబలల చేతి అక్షరాయుధం ||


జ్యోతిరావు తండ్రి గోవిందరావును భయపెట్టి కొడుకునీ, కోడలినీ ఇంటి నుంచి పంపించ డంలో కృతకృత్యులయ్యారు. ఆ సమయంలో సావిత్రి స్నేహితురాలు ఫాతిమా షేక్‌ ఆశ్రయం ఇచ్చారు. పాఠశాలలు ఆగలేదు. అలాగే దాడులూ ఆగలేదు. సావిత్రి పాఠశాలకు వెళ్తున్న సమయంలో పేడతో, రాళ్లతో చాటు నుంచి దాడిచేసేవారు. ఇది నిత్యకృత్యం కావడంతో సావిత్రీబాయి పాఠశాలకు వెళ్తున్నప్పుడు ఒక పాత చీర కట్టుకొని, మరొకటి వెంట తీసుకొని వెళ్లేవారు. కానీ వారి దాడులు తీవ్రమయ్యాయే తప్ప తగ్గలేదు.

‘‘మేము సజీవంగా సమాధుల్లో మగ్గుతున్న వాళ్లం. అక్షరం మాకు నిషిద్ధం. భగవంతుడు మా మొరనాలకించి బ్రిటిష్‌ వారిని పాలకులుగా పంపాడు. ఇప్పుడు మమ్మల్నెవరూ వే«ధించి, బాధించలేరు. ఉరితీసి చంప టానికీ, సజీవంగా పాతిపెట్టడానికీ సాహసించరు. మా ముందు తరాలకు కూడా భవిష్యత్తుపై భరోసా ఉన్నదిప్పుడు. మేమిప్పుడు ఒంటినిండా బట్ట కట్టగలుగుతున్నాం. స్వేచ్ఛగా, అర్థవంతంగా జీవిస్తున్నాం. ఆంక్షలూ, నిషే ధాలూ తొలగిపోయి బజారులూ, ఉద్యానవనాలూ మాకు తలుపులు తెరిచాయి.’’

1848లో ప్రారంభమైన ఒక బాలికల పాఠశాలలో చదివిన మాతంగ కులానికి చెందిన  విద్యార్థిని రాసిన ఉత్తరమిది. సామాజిక విప్లవ పితామహు డుగా పేర్గాంచిన జ్యోతిబా పూలే, ఆయన సతీమణి సావిత్రీబాయి çఫూలే నిర్వహించిన పాఠశాలల ప్రత్యక్ష ఫలితమిది. సామాజిక అసమానతలను తలకిందులు చేసి మహర్, మాతంగ కులాల్లోని యువతీ యువకుల్లో చైత న్యాన్ని నింపిన ఒక ఉద్యమ సందర్భమది. ఆ బాలిక పేర్కొన్నట్టే అంటరాని కులాలకు అందివచ్చిన భద్రతకు సంబంధించిన ఒక ఘటన సావిత్రీబాయి ఫూలే నాయకత్వంలో జరిగింది. ఈ వివరాలను సావిత్రీబాయి, జ్యోతీరావు ఫూలేకు రాసిన లేఖలో తెలియజేశారు. అనారోగ్యంతో సావిత్రీబాయి తల్లి గారి ఊరైన సతారా జిల్లా నయ్‌గావ్‌లో ఉన్నప్పుడు అది జరిగింది. ‘‘మా గ్రామంలో గణేష్‌ అనే బ్రాహ్మణ యువకుడు చుట్టుపక్కల గ్రామాల్లో జాతకాలు చెప్పేవాడు. మహర్‌ కులానికి చెందిన షార్జా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. వాళ్ల ప్రేమ వ్యవహారం బయటపడేనాటికే ఆ అమ్మాయి ఆరునెలల గర్భవతి. ఇది తెలుసుకున్న గ్రామస్తులు వాళ్లిద్దరినీ చంపడానికి నిర్ణయించుకున్నారు. ఆ విషయం నా చెవినపడగానే అక్కడికి పరుగెత్తాను. వాళ్లను హత్యచేస్తే బ్రిటిష్‌ ప్రభుత్వపు ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించాను. దాంతో బెదిరిపోయిన గ్రామపెద్దలు హత్యాప్రయత్నాన్ని విరమించుకున్నారు. వాళ్లిద్దరినీ గ్రామం నుంచి వెలేశారు. నేను కలుగజేసు కోకపోతే వారి ప్రాణాలు దక్కేవి కావని నా పాదాలపై పడి కన్నీళ్లు పెట్టు కున్నారు. వారికి ఆశ్రయమిచ్చి, ఏదైనా ఉపాధి కల్పించండి!’’

రెండు ఉత్తరాలు. ఒకటి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. రెండవది ధిక్కార స్వరం. మాతంగ బాలికకు ఆత్మవిశ్వాసం కలగడానికి సావిత్రీబాయి చూపిన పోరాటపటిమే కారణం. జ్యోతిబా, సావిత్రీబాయి ఇరువురూ సామాజిక మార్పుకోసం కలసికట్టుగా చేసిన పోరాటం ఆనాడు మహారాష్ట్రలోని పూనా ప్రాంతంలో ఒక చరిత్ర.

|| ఉద్యమమే ఊపిరిగా ||

అంటరాని కులాలను దుర్మార్గంగా హింసించిన పీష్వాల పాలన 1818 లోనే అంతమైంది. సుమారు అయిదు వందల మంది మహర్‌ సైనికులు, వేలాది మందితో ఉన్న పీష్వాల సైన్యాన్ని తుదముట్టించి బ్రిటిష్‌ సామ్రాజ్య స్థాపనకు పునాదులు వేశారు. అప్పటివరకు అంతులేని కుల వివక్ష, అణచివేతని అనుభవించిన అంటరాని కులాలు బ్రిటిష్‌ వారి రాకతో ఊపిరి పీల్చుకు న్నాయి. వారు ప్రారంభించిన ఇంగ్లిష్‌ విద్య సావిత్రీబాయి లాంటి వాళ్లను చైతన్యపరిచింది. అయినప్పటికీ కొన్ని దుర్భర పరిస్థితులు అప్పటికి మిగిలే ఉన్నాయి. ఆ నేపథ్యంలో సావిత్రీబాయి కృషి ఎలాంటిదో అర్థం చేసుకోవా లంటే నాటి సామాజిక స్థితిగతులను గమనించాలి.

ఈస్టిండియా కంపెనీ రైల్వే, తపాల, విద్యాశాఖలను ప్రారంభించింది. అయితే భారత సమాజం కులాలుగా విడిపోయి ఉంది. మహిళల పరిస్థితి మరింత దయనీయం. శూద్రులతో సమంగా, ఇంకా చెప్పాలంటే వారికన్నా హీనంగా స్త్రీలను చూసేవారు. ఆధిపత్య కులాలు, బ్రాహ్మణ కులాల్లో పురు షుల దాష్టీకం ఎక్కువగా ఉండేది. బాల్య వివాహం, సతీసహగమనం, పున ర్వివాహాల వల్ల చాలామంది యుక్తవయసులోనే వితంతువులయ్యేవారు. వీరిని పురుషులు కేవలం పనిముట్లుగా భావించేవాళ్లు. మగవారి పశుత్వానికి బలై, గర్భవతులైతే ఇక వారికి ఆత్మహత్యలే శరణ్యం. వితంతువులకు శిరోముండనం చేసేవాళ్లు. అప్పుడే దహనసంస్కారానికి అర్హమైన పవిత్రత సిద్ధిస్తుందని భావించేవారు. రెండవది భర్త చనిపోతే ఆస్తులు పంచవలసి వస్తుందని మహిళలను ఇంటినుంచి గెంటివేసేవాళ్లు. స్త్రీల పట్ల దుర్మార్గమైన పద్ధతులు అవలంబిస్తూనే సమస్త నష్టాలకు మళ్లీ మహిళలే మూలమనే దుర భిప్రాయాన్ని ప్రచారం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మహాత్మా జోతీరావు, సావిత్రీబాయి ఉద్యమం పురుడుపోసుకున్నది.

|| స్త్రీవిద్యకు అంకురార్పణ ||

సావిత్రీబాయి 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నయా గావ్‌లో జన్మించారు. ఖండోజి నేవనే పాటిల్, లక్ష్మీబాయి మొదటి సంతానం సావిత్రి. ఆమెకు సిద్ధూజీ, సఖారామ్, శ్రీపతి అనే ముగ్గురు తమ్ముళ్లు. పూనాకు చెందిన జ్యోతీరావుతో సావిత్రీబాయికి తొమ్మిదో ఏట పెళ్లి కుది రింది. అప్పుడు ఫూలేకు 13 ఏళ్లు. తల్లి చిన్నప్పుడే మరణించింది. దూరపు బంధువు సుగుణాబాయి ఫూలేను పెంచింది. ఆమె ఒక క్రైస్తవ ఫాదర్‌ ఇంట్లో పనిచేసేది. సుగుణాబాయి వద్ద పెరగడం వల్ల ఫూలేకు ఇంగ్లీషు భాష పట్ల మక్కువ ఏర్పడింది. క్రైస్తవంలో ఉండే మానవీయ విలువలు ప్రభావితం చేశాయి. నిజానికి సుగుణాబాయి చొరవతోనే సావిత్రి, జ్యోతిరావుల వివా హం జరిగింది. సుగుణాబాయికి జ్యోతిరావుకు ఇంగ్లిష్‌ చదువు చెప్పించాలని ఉండేది. కానీ ఫూలే తండ్రి గోవిందరావు ఒక బ్రాహ్మణ పూజారి మాటతో కొడుకుచేత చదువుకు స్వస్తి పలికించి వ్యవసాయంలో పెట్టాడు. దానితో కలత  చెందిన సుగుణాబాయి లెగ్గిట్‌ అనే ఇంగ్లిష్‌ ఆఫీసరు, గఫార్‌ బేగ్‌ అనే ముస్లిం విద్యావంతుని ద్వారా ఫూలే తండ్రిని ఒప్పించగలిగారు. దానితో జ్యోతిబాకు తిరిగి చదువు కొనసాగించే అవకాశం కలిగింది. 1843లో సుగు ణాబాయి చొరవతో ఫూలే మిషన్‌ స్కూల్‌లో చేరి చదువు మొదలుపెట్టారు. ఒకవైపు చదువు సాగిస్తూనే, రెండోవైపు తన పొలంలోని మామిడి చెట్ల నీడలో మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారు. అందులో సుగుణాబాయి, సావి త్రీబాయితో సహా ఇంకొందరు విద్యార్థులు చేరారు.

మగవారికీ, ఆధిపత్య కులాలకూ సైతం అప్పుడప్పుడే చదువు అందు తున్నది.  స్త్రీలకైతే అది గగనకుసుమమే. అయినా పురుషుల కన్నా స్త్రీ విద్య అవసరం ఎక్కువని గుర్తించినందువల్లనే చెట్ల కింద విద్యాబుద్ధులు నేర్పేం దుకు జ్యోతిబా సిద్ధమయ్యారు. తరువాత పూర్తిస్థాయిలో పాఠశాలను నడపా లని నిర్ణయించుకున్నారు. అయితే బ్రిటిష్‌ ప్రభుత్వం అప్పటికే (1832)  బాలికల కోసం పూనాలోని బుధవార్‌ పేట్‌లో పాఠశాలను ప్రారంభించింది. కానీ అందులో చేరాలంటే కలెక్టర్‌ అనుమతి కావాలి. ఇది ఫూలేకు నచ్చలేదు. అందుకే 1848 జనవరి 14న అదే వాడలో తాత్యాసాహెబ్‌ బీడే అనే బ్రాహ్మ ణుని ఇంటిలో బాలికల పాఠశాలను ఫూలే ప్రారంభించారు. సావిత్రీబా యితో సహా ఫూలే ఇంటింటికీ తిరిగి, అమ్మాయిలను పాఠశాలల్లో చేర్పిం చాలని ప్రచారం చేసేవారు. అన్నపూర్ణా జోషి, సుమతీ ముఖాషీ, దుర్గా దేశ్‌ ముఖ్, మాధవి దత్తే, సోనూ పవార్, జాన్‌ కరెడిలే అనే ఆరుగురు అమ్మా యిలు ఈ పాఠశాలలో అడుగుపెట్టారు. ఈ తొలి బృందానికి మొదటి ఉపా ధ్యాయిని సావిత్రీబాయి ఫూలే. ఆ తరువాత 1851 సెప్టెంబర్‌ 1న రాస్తా పేటలో ఫూలే దంపతులు మరో పాఠశాలను తెరిచారు. దీనితో పాఠశాలల్లో చేరే అమ్మాయిల సంఖ్య పెరుగుతూ వచ్చింది. పాఠశాలల సంఖ్య కూడా 18కి పెరిగింది. ఇందులో కొన్ని పాఠశాలలను అంటరాని కులాలైన మహర్, మాతంగ్‌ కులాల పిల్లల కోసమే నిర్వహించడం విశేషం.

|| ప్రతిఘటనలను అధిగమించి ||

ఈ పాఠశాలల మీద దుష్ప్రచారంతో పాటు, ఫూలే దంపతులపై దాడులు మొదలయ్యాయి. అప్పుడు సావిత్రిబాయికి 17 ఏళ్లు. ఛాందసులు కొందరు ఈ పాఠశాలల నిర్వహణను ఆపడానికి భౌతికంగా ఆమె మీద దాడులకు సిద్ధపడ్డారు. జ్యోతిరావు తండ్రి గోవిందరావును భయపెట్టి కొడుకునీ, కోడలినీ ఇంటి నుంచి పంపించడంలో కృతకృత్యులయ్యారు. ఆ సమయంలో సావిత్రి స్నేహితురాలు ఫాతిమా షేక్‌ ఆశ్రయం ఇచ్చారు. పాఠశాలలు ఆగ లేదు. అలాగే దాడులూ ఆగలేదు. సావిత్రి పాఠశాలకు వెళ్తున్న సమయంలో పేడతో, రాళ్లతో చాటు నుంచి దాడిచేసేవారు. ఇది నిత్యకృత్యం కావడంతో సావిత్రీబాయి పాఠశాలకు వెళ్తున్నప్పుడు ఒక పాత చీర కట్టుకొని, మరొకటి వెంట తీసుకొని వెళ్లేవారు. కానీ వారి దాడులు రోజు రోజుకు తీవ్రమయ్యాయే తప్ప తగ్గలేదు. కొంతమంది గూండాలు ఒక యువకుడిని రెచ్చగొట్టి సావిత్రీ బాయి మీదకు ఉసిగొల్పారు.

ఆ యువకుడు దుర్భాషలాడుతూ,  అంటరాని కులాలకు చదువు చెప్పావంటే నీ అంతుచూస్తానని సావిత్రీబాయిపై చేయి చేసుకోబోయాడు. ఆ పరిస్థితిని ముందే గమనించిన సావిత్రీబాయి వెంటనే తేరుకొని చెంపమీద చెడామడా వాయించింది. ఆ పరిణామానికి భయపడిన ఆ యువకుడు సిగ్గుతో అక్కడి నుంచి పారిపోయాడు. దానితో మరెప్పుడూ, మరెవ్వరూ ఆమె మీద దాడికి సాహసించలేదు. ఆ సంఘటనతో సావిత్రీ బాయి మీద ప్రజలకు విశ్వాసం పెరిగింది. కాశీబాయి అనే వితంతువు గర్భవతై ఆత్మహత్యకు ప్రయత్నించింది. జ్యోతిబా వారించి, మూడు నెలల తరువాత ప్రసవించిన ఆమె కుమారుడిని దత్తత తీసుకున్నాడు. ఆ తరువాత ఇటువంటి పిల్లల కోసం బాల రక్షణ సదనాన్ని ప్రారంభించారు. వితంతువు లుగానీ, ఇతరులుగానీ పిల్లలను కని, పెంచలేని పరిస్థితి వస్తే ఈ సదనం ఆశ్రయం ఇచ్చేది.

1890 నవంబర్‌ 28న జ్యోతిబా మరణం సావిత్రీబాయిని కుంగదీసింది. అయినప్పటికీ వారు ప్రారంభించిన సత్యశోధక్‌ సమాజ్‌ బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. ఒక వైపు విద్య, సామాజిక కార్యక్రమాల నిర్వహణతో పాటు 1897లో ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలో రాత్రింబవళ్లు రోగుల సేవలో సావిత్రీబాయి నిమగ్నమయ్యారు. అదే సమయంలో ఆమె అనారోగ్యానికి గురైంది. చివరకు 1897 మార్చి, 10 వ తేదీన తుదిశ్వాస విడిచారు. నేటికి నూటఇరవై ఏళ్ల క్రితమే బాలికల విద్య కోసం, అంటరాని కులాల అభ్యున్నతి కోసం, స్త్రీల హక్కుల కోసం అంతులేని పోరాటం చేసిన సావిత్రీబాయి నేటికీ, ఏనాటికీ మహిళా పోరాటాలకు స్ఫూర్తిదాయకమే. -మల్లెపల్లి లక్ష్మయ్య (సాక్షి)
(జనవరి 3, సావిత్రీబాయి ఫూలే జయంతి)

Thursday, 22 December 2016

|| అవినీతి పంకిలం - బిజెపి కమలం ||



ఇప్పటి వరకు బిజెపికి చెందిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులకే అవినీతి మకిలి అంటగా తాజాగా సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ ముడుపుల రొంపిలో చిక్కుకొని విధానాల్లోనే కాదు అవినీతిలోనూ కాంగ్రెస్‌ అడుగుజాడల్లో నడుస్తున్నామని పక్కాగా నిరూపించారు. 

|| చదవాలి...బాగా చదవాలి చదువు ||



‘పుస్తకాలు లేకుండా నేను జీవించజాలను’ అంటాడు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన మేధావి థామస్‌ జెఫర్సన్‌. ఒకప్పటితో పోల్చి చూస్తే పరిమాణంలో ఇప్పుడు ఎక్కువ పుస్తకాలు వస్తున్నా, అవి సమాజంపై చూపే ప్రభావం అంతంతే! దేశంలో, తెలుగునాట పేరు ప్రతిష్ఠలు గలిగిన కవులు, రచయితలు, స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్తలు, రాజకీయ నాయకులు.. ఇలా అప్పట్లో అందరూ గొప్ప చదువరులు. నేటి తరం ఆంగ్ల భాష మోజుతో తల్లి భాష తెలుగునే ఖాతరు చేయడం లేదు.

Wednesday, 21 December 2016

|| నగదురహితం అర్థరహితం ||



నగదు రహితం అనే నినాదంతో కోట్లాది మంది కడుపు కొట్టి, వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన కొద్దిమందికి కళ్లు చెదిరే లాభాల పంట ఎట్లా పంచి పెట్టబోతున్నారో అర్థం చేసుకొంటే ఎవరి గుండె అయినా చెరువు కాక తప్పదు. అయితే ఒక్కటే ఉపశమనం - నగదు రహితం అనేది ఒక నినాదంగా మాత్రమే పనికి వస్తుంది తప్ప మన దేశంలో ఆచరణ అసాధ్యం.

Monday, 19 December 2016

# ఈ ‘‘అమ్మ’’, ఎవరి అమ్మ? #


అమ్మ! అమ్మ! అమ్మ!తమిళ శ్రామిక ప్రజల్లో ఎక్కువ మంది, తమని పాలించే పాలకురాలినే తమ ‘‘అమ్మ’’గా నమ్మారు! - ఎందుకు?

తమకు ఉద్యోగాలు ఏర్పరిచి, తమ కష్టార్జితంతోనే తాము జీవించే ఏర్పాట్లు ఆ పాలకురాలు చేసిందనా? - అలాంటిదేమీ జరగలేదు. ఒకవేళ అలా జరిగినా, అది ఆ వ్యక్తి గొప్పదనం అవదు.

|| మతోన్మాదంపై పోరుకు మార్క్స్‌ నాస్తిక సిద్ధాంతాయుధం ||




             ప్రపంచాన్ని మార్చే సూత్రాలు కనిపెట్టిన కార్ల్‌మార్క్స్‌ ఆర్థిక సిద్ధాంతాల మీద జరిగినంత చర్చ ఆయన తాత్విక భావాల మీద జరగలేదు. కార్ల్‌మార్క్స్‌ ప్రధానంగా తాత్వికుడు, హేతువాది, నాస్తికుడు, ఆచరణశీలి, అధ్యయన కర్త, ధైర్యశాలి, పోరాటయోధుడు, విశ్లేషణకర్త, బహుముఖ ప్రజ్ఞావంతుడు. ఆయనలోని కొన్ని కోణాలే ఇప్పటి వరకు చర్చలో ఉన్నాయి. నిజానికి ప్రధానంగా ఆచరించవలసింది ఆయన తాత్వికవాదం. అసలు తాత్వికుడంటే ప్రపంచాన్ని భౌతిక మూలాల నుంచి అధ్యయనం చేసినవాడు. మనిషికి-ప్రపంచానికి, మనిషికి-ప్రకృతికి, మనిషికి-కాలానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని అధ్యయనం చేసినవాడే తత్వవేత్త. మార్క్స్‌ 1818 మే 5న ట్రీర్‌ నగరంలో పుట్టాడు. తండ్రి న్యాయవాది. మార్క్స్‌ కుటుంబం యూదులకు సంబంధించింది. సహజంగా యూదులు రోమన్‌ కేథలిక్‌లుగా ఉంటారు. అయితే మార్క్స్‌ తండ్రి 1824లోనే ప్రొటెస్టెంట్‌ మతాన్ని స్వీకరించాడు. ఆ రోజుల్లో మార్క్స్‌ది సంపన్నమైన కుటుంబం. మార్క్స్‌ ట్రీర్‌ నగరంలో ఉన్నత విద్యను పూర్తిచేసిన తర్వాత బోన్‌ విశ్వవిద్యాలయంలో, తర్వాత బెర్లిన్‌ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని, చరిత్రను, తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. అయితే ఆయన తత్వశాస్త్ర విభాగంలో 1841లో ఎపిక్యూరస్‌ తత్వశాస్త్రంపై పరిశోధన చేసి ఆ లోతైన పరిశోధనా పత్రాన్ని బెర్లిన్‌ విశ్వవిద్యాలయానికి సమర్పించాడు. ఆ పరిశోధనకుగాను ఆయన డాక్టరేట్‌ పట్టం పొందాడు. అప్పటికి ప్రపంచం మొత్తంలో హెగెల్‌ గతితర్క తత్వశాస్త్రం మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. హెగెల్‌ బెర్లిన్‌లో 1818 నుంచి నివాసమున్నాడు. 1831లో అక్కడే చనిపోయాడు. హెగెల్‌ చనిపోయిన పదేళ్ళకు కార్ల్‌మార్క్స్‌ డాక్టర్‌ పట్టా పొందాడు. ఎపిక్యూరస్‌ ప్రపంచ నాస్తికుల్లో ప్రసిద్ధి చెందినవాడు. భారతదేశంలో చార్వాకులు తెచ్చిన సిద్ధాంతాన్నే ఎపిక్యూరస్‌ గ్రీస్‌కు తెచ్చాడు. ప్లేటో స్థాపించిన అకాడమీ, అరిస్టాటిల్‌ లైసియమ్‌, ఇంకా ఏంటిస్తేనీస్‌ మొదలైన గ్రీకు తత్వవేత్తల విద్యాలయాలు ఏథెన్సులో ఒక ప్రక్కన నడుస్తుండగా, మరోవైపు అదే నగరంలో వేరొక విద్యాలయాన్ని స్థాపించి, ఎందరో శిష్యులకు తన తాత్విక ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ నిరాడంబర జీవితం గడిపిన మహాతత్వవేత్త ఎపిక్యూరస్‌. ఎపిక్యూరస్‌ క్రీస్తుపూర్వం 341లో సేమాస్‌ అనే గ్రీకు ద్వీపంలో జన్మించాడు. ఏథెన్సులో తన 35వ ఏట తన ఇంటి వెలుపల ఎపిక్యూరస్‌ జ్ఞాన వనం (ది గార్డెన్‌ ఆఫ్‌ ఎపిక్యూరస్‌) అనే పేర విద్యాలయం స్థాపించాడు. అక్కడ 36 ఏళ్లపాటు నివసించి 270లో మరణించాడు. ఎపిక్యూరస్‌ భారతదేశంలో చార్వాకుల వలెనే ఇలా బోధించాడు: మరణానంతరం ఏ నరకలోకానికి వెళతామో, అక్కడ ఏ బాధలు అనుభవిస్తామో అనే భయం తగదు. ఎందుకంటే మరణం తర్వాత ఆత్మ అనేది ఉండదు. దేహంతో పాటే ఆత్మ నశిస్తుంది. మనిషి చనిపోయాక ఏమీ మిగలదు. మరణం శాశ్వత నిద్రతో సమానం. ఏమీ తెలియదు. ఏ అనుభూతీ తగలదు. అయినప్పుడు మరణానికి ఎందుకు భయపడాలి? జీవితం ఎంత సహజమో, మరణం అంతే సహజం. ఎపిక్యూరస్‌ సిద్ధాంతాలకు, భారతీయ భౌతికవాదులైన చార్వాకుల సిద్ధాంతాలకు సామ్యం చిక్కగా ఉంది. ఆ సామ్యాన్ని చూద్దాం. 'లోకాయతా పదేంత్వేవం నాస్తి దేవో ననిర్వృతిః ధర్మధర్మౌన విద్వేతే న ఫలం పుణ్య పాపయోః' (సర్వజ్ఞుడు అనుకుంటున్న దేవుడు లేడు. మోక్షము లేదు. ధర్మా ధర్మములగాని, పుణ్యపాపములు గాని లేవు. కావున వీటి వలన వచ్చు స్వర్గ నరకాది రూప ఫలములు లేవని లోకాయతులైన నాస్తికులు చెబుతున్నారు.) 'ఏతావానేవ లోకోయం యావానింద్రియగోచరః భద్రే వృకపదం పశ్చయద్వదంతి బహుశ్రుతాః||' (ఈ లోకము పంచేద్రియములకు ఎంత గోచరమగుచున్నదో అంత మాత్రమే ఉన్నది. పంచేంద్రియములు వ్యక్తీకరించు వస్తు జాతమునకు భిన్నమైనది లేదు). 'త తశ్చజీవనోపాయో బ్రాహ్మణైర్విహిత స్త్విహ మృకానాం ప్రేత కార్యాణి నత్యన్య ద్విద్యతేక్యచిత్‌' (మనుషులు మరణించిన తర్వాత శ్రాద్ధము మొదలైన కర్మలను బ్రాహ్మణులు తమ జీవనోపాధి కోసం సృష్టించారు అని చార్వాకులు వక్కాణించారు). ఎపిక్యూరస్‌ సిద్ధాంతాలు, చార్వాకుల సిద్ధాంతాలు ఒకే రకంగా ఉంటాయి. కార్ల్‌మార్క్స్‌ ఎపిక్యూరస్‌ సిద్ధాంతాలతో మొదట ప్రభావితమయ్యారు కాబట్టే ఎంగ్‌ హెగిలియన్‌ గ్రూప్‌లో ఆయన చేరినప్పటికీ కూడా హెగెల్‌ భావవాద గతితర్కంతో మార్క్సు తృప్తిపడలేకపోయాడు. అందుకే వాళ్ళు హెగిలియన్‌ భావవాదాన్ని అంగీకరించ టానికి మదనపడ్డారు. ఈ సందర్భంగా ఎపిక్యూరస్‌కు దగ్గరగా ఉండే ఫ్యూయర్‌ బాఖ్‌ భౌతికవాదానికి దగ్గరయ్యాడు. ముందు మార్క్స్‌తో పాటు ఆయనతో కలిసివచ్చే ఎంగ్‌ హెగెలియన్‌లు ఎంతో తాత్విక ఘర్షణకు గురయ్యారు. ఈ ఘర్షణలో ఉన్న యువ హెగెలియన్‌ వాదులకు ఫ్యూయర్‌బాక్‌ 1804-72లో రచించిన 'క్రైస్తవ మతసారం' అనే గ్రంథం భౌతిక వాద దృక్పథాన్ని రూపొందించింది. ఈ గ్రంథం యంగ్‌ హెగెలియన్లలో కలిగించిన చైతన్యం చరిత్ర గతిని మార్చింది. 'క్రైస్తవ మతసారం' అనే గ్రంథం ఒక్క దెబ్బతో ఈ వైరుధ్యాన్ని బద్దలు చేసింది. ఎలాంటి డొంకతిరుగుడూ లేకుండా ఈ గ్రంథం భౌతికవాదాన్ని తిరిగి సింహాసనంపై ప్రతిష్టించింది. తత్త్వశాస్త్రంతో ప్రమేయం లేకుండా ప్రకృతి స్వతంత్రంగానే అస్తిత్వంతో ఉంటుంది. అది పునాది. ఆ పునాదిపైననే ప్రకృతిలో ఉద్భవించిన మనం మానవులం పెరిగాం. ప్రకృతికీ, మానవునికీ బాహ్యంగా ఏదీలేదు. మన ఊహాలోకంలో మతపరమైన అద్భుతాల ద్వారా సృష్టించుకున్న ఉన్నతస్థాయి జీవులు మన సారాంశపు ఆశ్చర్యకరమైన ప్రతిబింబాలు మాత్రమే. దీంతో భ్రమ కాస్తా బద్దలైంది. 'వ్యవస్థ' ముక్కచెక్కలై పక్కకు విసిరేయబడింది. మనం ఊహాలోకంలో మాత్రమే ఉన్నదని భావించిన వైరుధ్యం కాస్తా కరిగిపోయింది. ఫ్యూయర్‌బాఖ్‌ భౌతికవాదం తత్త్వశాస్త్రంలో పెద్ద సంచలనాన్ని కలిగించింది. ఫ్యూయర్‌బాఖ్‌ భౌతికవాద ఉద్యమం హెగెలియన్‌ వ్యవస్థను దగ్గర దగ్గర భేదించింది. ఆలోచనకు, అస్తిత్వానికి గల సంబంధాన్ని, ప్రకృతికి, భావానికి గల సంబంధాన్ని స్పష్టం చేయగలిగింది. హ్యౌమ్‌, కాంట్‌లు ప్రతిపాదించిన భావవాద ధోరణులను, హెగెల్‌ వ్యక్తీకరించిన భావవాద దృక్కోణాలను ఫ్యూయర్‌బాఖ్‌ తన భౌతికవాదం ద్వారా చిత్తుగా ఖండించి స్పష్టమైన భౌతిక దృక్పథాన్ని రూపొందించగలిగాడు. పదార్థం మనస్సు నుంచి జనించలేదు. దానికి వ్యతిరేకంగా మనస్సే పదార్థం యొక్క అత్యున్నత సృష్టి అని వ్యాఖ్యానించారు. భావవాదం ఏ విధంగా అనేక దశలలో పరిణామం చెందుతూ వచ్చిందో భౌతికవాదం కూడా అనేక దశలలో అనేక రూపాలలో పరిణామం చెందుతూ వచ్చింది. అది ప్రకృతి శాస్త్ర రంగాలలో యుగ ప్రాధాన్యత కలిగి ఆవిష్కరణ జరిగినప్పుడల్లా దాని రూపాన్ని అది మార్చుకోవలసి వచ్చింది. మార్క్స్‌, ఎంగేల్స్‌ 1848లో కలిసిన తర్వాత వాళ్ళు హెగెల్‌ గతితార్కిక వాదాన్ని, ఫ్యూయర్‌బాఖ్‌ భౌతికవాదాన్ని సమన్వయించి గతితార్కిక భౌతికవాద సిద్ధాంతాలను ప్రపంచానికి చాటారు. అయితే వారు ఎప్పుడూ కూడా గతాన్ని, దేవుణ్ణి అంగీకరించలేదు. మానవుడు మతం నుంచి బయట పడకుండా తాత్వికుడు కాలేడని వారు ప్రగాఢంగా నమ్మారు. ఈనాటి పెట్టుబడిదారీ విధానాన్నీ, ఆ ఉత్పత్తి విధానాన్నీ, ఆ ఉత్పత్తి విధానం సృష్టించిన బూర్జువా సమాజాన్నీ పాలించే నియమాన్ని కూడా మార్క్స్‌ ఆవిష్కరించాడు. దీన్ని పరిష్కరించడానికి బూర్జువా ఆర్థికవేత్తలూ, సోషలిస్టు విమర్శకులూ ఇంతకుముందు చేసిన పరిశోధనలన్నీ చీకటిలో తడుములాటగా ఉన్నాయో ఆ సమస్య మీద అదనపు విలువ ఆవిష్కరణ హఠాత్తుగా కాంతిని ప్రసరించింది. అలాంటి ఆవిష్కరణలు రెండు ఒక జీవితకాలానికి సరిపడతాయి. మార్క్సు పరిశోధనలను పైపైన చేయలేదు. ప్రతి రంగంలోనూ, గణితశాస్త్ర రంగంలో కూడా ఆయన స్వతంత్ర ఆవిష్కరణలు చేశాడు. శాస్త్రజ్ఞుడుగా ఆయన అలాంటివాడు. కానీ ఇది ఆయన వ్యక్తిత్వంలో సగం కూడా కాదు. మార్క్సు అభిప్రాయంలో శాస్త్ర విజ్ఞానం చారిత్రకంగా క్రియాశీలమైన విప్లవ శక్తి. విద్యుచ్ఛక్తి రంగంలో జరిగిన ఆవిష్కరణల అభివృద్ధినీ, మార్సేల్‌ డెప్రే చేసిన ఆవిష్కరణలనూ ఆయన శ్రద్ధగా గమనించాడు. మార్క్సు తన నాస్తికవాద సిద్ధాంతం మీద తన తాత్విక సౌధాన్ని నిర్మించాడు. మనిషికి దుఃఖం పోవాలని బుద్ధుడంటే, దోపిడీ పోవాలని మార్క్స్‌ అన్నాడు. మార్క్సిస్టులకు, అంబేద్కరైట్లకు మార్క్స్‌ జీవితం, సిద్ధాంతాల అవగాహన, ఆచరణ చాలా అవసరం. ఎందుకంటే ఈనాడు హిందూ మతోన్మాదం విస్తరించింది. హిందూమతం పునాదులను కూల్చాలంటే కేవలం మార్క్స్‌ చెప్పిన ఆర్థికవాద సిద్ధాంతాలను అవగాహన చేసుకుంటే చాలదు. మతం విశ్వాసంతో కూడుకున్నది. విశ్వాసం బుద్ధిని వికసించనివ్వదు. హిందూ మతతత్వం 'కర్మ'ను బోధిస్తుంది. భౌతికవాద, నాస్తికవాద, హేతువాద సిద్ధాంతాల జోలికి పోనివ్వదు. ఒకడు మార్క్సిస్టుగా జీవిస్తూ దేవుణ్ణి నమ్మడం, గుళ్ళకు, గోపురాలకు వెళ్ళటం మా ఆవిడ కోసం వెళ్ళాననడం వల్ల సిద్ధాంత ఆచరణలో తేడా వస్తుంది. కార్మికలోకం ఆర్థిక పోరాటాల ద్వారా సాధించిన ధనాన్ని మతానికి ఖర్చుపెట్టడం అశాస్త్రీయం. కార్మికులు నాస్తికవాదులుగా మారితే దేవుడు లేడు. మన శ్రమను దేవుని పేరు మీద దోచుకుంటున్నారని తెలుసుకోగలుగుతారు. హేతువాద దృక్పథం ద్వారానే మార్క్సు ఎప్పటికప్పుడు శాస్త్రీయ జ్ఞానాన్ని స్వీకరిస్తూ వచ్చాడు. మార్క్సిజంలాగే మార్క్సిస్టులకు, అంబేద్కరైట్లకు నిరంతర అధ్యయనం అవసరం. మార్క్స్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సామ్రాజ్యవాద భావజాలాలపై యుద్ధం చేశాడు. మన పిల్లలను సామ్రాజ్యవాద బంటులుగా పెంచుతూ మనం మార్క్సు సిద్ధాంతాలు వల్లిస్తే పరిణామం త్వరితం కాదు. మార్క్సు జీవితంలో ప్రధాన అంశం సిద్ధాంతాల బోధనే కాదు ఆచరణ. ఆచరించని ఏ సిద్ధాంతమైనా ఓడిపోతుంది. ఈనాడు నరేంద్రమోడీ ప్రభుత్వం మతఛాందసవాదాన్ని, వర్ణ, కుల ఆధిపత్య వాదాన్ని, హిందూ మతవాద శక్తులన్నింటినీ ఏకం చేసి నడిపిస్తోంది. మామూలుగా హిందూ మతవాద శక్తులు చీలికలు పేలికలుగా ఉంటాయి. తమకు రాజ్యం వచ్చినప్పుడే ఒక గొడుగు కిందకు వస్తాయి. అద్వైతులు, ద్వైతులు, విశిష్టాద్వైతులు, శైవులు, అన్ని తరగతులవారు ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌ల ఆధ్వర్యంలో ఒకటవుతున్న దశలో మార్క్సువాదులు, అంబేద్కర్‌, హేతువాద, నాస్తిక, లౌకికవాదులు ఏకం కాకతప్పదు. ఐక్యత ఒక శక్తి అనే వాదాలుంటాయి. ప్రధాన సూత్రం ఈ సృష్టికి మూలం దేవుడు కాదు, సృష్టి పరిణామ క్రమంలో ఉంది అని అంగీకరించటమే. నాస్తికత్వం కూడా ఆచరణలో మతవాద కుటుంబవాద ధోరణుల్లోకి వెళ్ళడం. అంబేద్కర్‌వాదం కూడా ఆచరణలో కులవాద ధోరణుల్లోకి వెళ్ళడం, మార్క్సువాదం నాస్తికత్వాన్ని అంగీకరిస్తే ప్రజాశ్రేణులు సమీకరణ కావు అనుకోవడం నుంచి బయటపడి మార్క్సు - అంబేద్కర్‌ మార్గంలో సిద్ధాంతం, ఆచరణలను సమన్వయించుకొని ఒక మహోజ్వల సాంస్కృతిక, తాత్విక ఉద్యమ ప్రభంజనాన్ని సృజిద్దాం. ఎపిక్యూరస్‌ మీద పరిశోధన చేసిన పరిశోధకుడు, నాస్తికుడు, హేతువాది, సిద్ధాంతకర్త, ఆచరణశీలి మార్క్స్‌. ఆయనను ఆరాధించడమే కాక ఆయనను అనుసరించడం మన కర్తవ్యం. మన వాదం అనేది నాస్తికవాద పునాదుల మీదే ప్రతిఫలిస్తుంది, ప్రజ్వలిస్తుంది. ప్రపంచాన్ని మార్చే సూత్రాలదే విజయం. నియంతలు అన్ని చారిత్రక సందర్భాల్లోనూ ఓటమి పొందారు. ప్రజల ఆచరణ ఒక సముజ్వల శక్తి. ఆ దిశగా పయనిద్దాం..    - డాక్టర్‌ కత్తి పద్మారావు

Sunday, 11 December 2016

|| మోడీ అవతారం - 'కర్మ' మంత్రం ||



             ప్రధాని నరేంద్రమోడీ విశ్వహిందూ పరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, సామ్రాజ్యవాద ద్రవ్య సంస్థలు, బహుళ జాతి సంస్థలు రూపొందించిన ఒక వ్యక్తిత్వంగా మనకు కనిపిస్తున్నారు. ఇది మన కర్మ అని కరుడు గట్టిన హిందూత్వ మతభావాలు చెబుతున్నా యి. మనకు ప్రాప్తించిన కర్మను మనం పొందకతప్ప దంటున్నాయి. అందుకే భగవద్గీత 'కర్మణ్యేవాధికారస్తే మా పలేషు కదాచన| మా కర్మఫల హేతుర్భూ ర్మాతే సజ్గో స్త్వకర్మణి' (నీకు కర్మ జేయుటయందు అధికారము కలదు. దాని ఫలమునందు కాదు.

|| అసమర్థుడు మోడీనామధేయుడు ||



           'లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె బ్రాణంబులున్‌/ఠావుల్‌ దప్పె మూర్ఛవచ్చె తనువున్‌ డస్సెన్‌ శ్రమం బయ్యెడిన్‌' అంటూ మొసలి పట్టుకు గురైన గజరాజులా విలవిల్లాడుతున్నాడు సగటు భారతీయుడు. 'అందమైన వస్తు సముదాయం అంతా/ఎక్కడో ఒక్కడే వచ్చి/ఎత్తుకు పోతూ ఉంటే చూచి, 'అన్యాయం, అన్యాయం?' అని మేమంటే-'అనుభవించాలి మీ కర్మం' అంటాడు/పొద్దు పొడిచి పొద్దు గడిచేదాకా/ఎద్దుల్లాగు పనిచేసే మమ్మల్ని/మొద్దుల్నీ, మొరటుల్నీ చేసి/ముద్దకి కూడా దూరం చేశాడు'' అని మహాకవి శ్రీశ్రీ 'వాడు' కవితలో చెప్పినట్టుగా...

Thursday, 8 December 2016

|| స్వాతంత్య్రోద్యమం - ఆర్ యస్ యస్ ||




''స్వాతంత్య్రోద్యమంలో ఆరెస్సెస్‌ పాత్ర అద్భుతంగా వివరించ బడింది'' అనే వ్యాసాన్ని ఇటీవల చదవటం తటస్థించింది. అది చదివిన తర్వాత స్వతంత్ర పోరాటంలో ఆరెస్సెస్‌ పాత్ర ఏమీ లేదనే విషయాన్ని పాఠకులకు వివరించాలనే ఉద్దేశంతో ఈ వ్యాసం రాస్తున్నాను. ముందు గా సంఘపరివారం ప్రచురణల్లోని పరస్పర విరుద్ధ అంశాలను పరిశీలిద్దాం. పైన పేర్కొన్న వ్యాసంలో ఆరెస్సెస్‌ స్థాపన తర్వాత డాక్టర్‌ హెగ్డేవార్‌, సంఘ స్వయం సేవకులతో ''మీరు సంఘ శాఖకు ఒక గంట కాలాన్ని కేటాయించిన తర్వాత మిగిలిన కాలాన్ని ఏ రాజకీయ పార్టీ పనికైనా కేటాయించితే ప్రమాద మేమీ లేదు'' అన్నాడని పేర్కొనబడింది.

|| ప్రధాని ఫకీరు - జనం అమీర్లు ||




నల్లధనమో అక్రమధనమో స్వాధీనం చేసుకుని ప్రజల పరం చేయమని ఎప్పటినుంచో సమాజం నుంచి వినిపిస్తున్న న్యాయమైన డిమాండ్‌ ఇంతగా అపహాస్యం పాలవుతుందని ఊహించలేదు. నల్లధనం ఎక్కడిదక్కడే- తెల్లడబ్బే బ్యాంకుల్లో బందీ అయింది. గాలి జనార్దనరెడ్డి రాజును అపహసించే విదూషకుడు. కట్టలుకట్టలు దొరుకుతున్న రెండువేల నోట్లు క్యూలో కూలబడిపోయినవారికి నివాళి.

Wednesday, 7 December 2016

|| పచ్చని సీమలో కార్చిచ్చు- షేల్‌ గ్యాస్‌ ||



         అభివృద్ధి పేరిట మరో విధ్వంసానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. పచ్చని పొలాలతో కళకళలాడే ఉభయగోదావరి జిల్లాలను కాలుష్య కాసారంగా మార్చనున్నాయి. కృష్ణా-గోదావరి బేసిన్‌లో షేల్‌ గ్యాస్‌ వెలికితీతకు బావులు తవ్వాలని ఒఎన్‌జిసి నిర్ణయించింది. తొలుత ఒఎన్‌జిసిని ప్రవేశం చేయించి ఆ తర్వాత కార్పొరేట్‌ సంస్థలకు అధికారాన్ని కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహరచన చేశాయి.

Monday, 5 December 2016

|| హేతువాదిగా అంబేద్కర్‌ ||




                       డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ గొప్ప హేతువాది. గొప్ప మానవతావాది. మహోన్నత సామాజిక విప్లవకారుడు. సాంస్కృతిక విప్లవ యోధుడు. భారతదేశ పునర్నిర్మాణకర్త. గొప్ప చదువరి. మహోజ్వల పోరాట యోధుడు. లోతైన ఆలోచనాపరుడు. ప్రపంచ మేధావుల్లో మొదటి వరుసలో నిలబడినవాడు. నీతి, నిజాయితీ, నిష్కపటత్వం, నిర్మలత్వం, నిక్కచ్చితనం, ముక్కుసూటితనం, సున్నితత్వం ఆయన వ్యక్తిత్వంలోని బహుపార్శ్వాలు. స్నేహం, ప్రేమ, కరుణ, ఆత్మీయత, అనునయం ఆయన సుగుణాలు.

|| డెల్టా గుండెల్లో గునపం ||



* 70వేల గ్యాస్ బావులు తవ్వేందుకు కార్పొరేట్ సంస్థల పథకం 
* ‘హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్’ విధానంలో కేజీ బేసిన్‌లో గ్యాస్, చమురు వెలికితీత
* పశ్చిమగోదావరి, కృష్ణాలో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం    ఏడు లక్షల ఎకరాలు సాగుకు దూరం
* ఇంకా లక్షలాది ఎకరాలపై తీవ్ర ప్రభావం    వాయు, జల, భూకాలుష్యం తీవ్రమయ్యే ప్రమాదం
* జనజీవనంపై విషమ ప్రభావం అంటున్న పరిశోధనలు    అమెరికా, పలు దేశాల్లో హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌పై నిషేధం
* ఇక్కడ అదే ముద్దంటోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
* ప్రాజెక్టు చేపట్టే గ్రామాలకు కనీస సమాచారం లేదు   
* భీమవరంలో రేపు ప్రజాభిప్రాయ సేకరణ

Friday, 2 December 2016

|| జాతీయోద్యమంలో ఆర్‌యస్‌యస్‌ ||




            బ్రిటీష్‌వారు భారతదేశం వదిలి వెళ్ళాలని, దేశానికి స్వాతంత్య్రం కావాలని జరుగు తున్న పోరాటాలు తీవ్రం కావటంతో 1920వ దశాబ్దంలో జాతీయోద్యమం ఉధృతరూపం దాల్చింది. భారత జాతీయ కాంగ్రెస్‌తో పాటు కమ్యూనిస్టుపార్టీ, వివిధ తీవ్రవాద సంస్థలు, ఇతర శక్తులన్నీ జాతీయ స్వాతంత్య్రం కోసం పనిచేస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో 1925లో ఆర్‌యస్‌యస్‌ ఏర్పడింది. వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు స్వాతంత్య్రం కోసం సాగుతున్న పోరాటంలో భాగ స్వాములవుతుండగా, ఆర్‌యస్‌యస్‌ మాత్రమే జాతీయోద్య మం లో భాగస్వామి కాలేదు. నేడు భారత జాతీయత, దేశభక్తిని గురించి ఇల్లెక్కి అరుస్తున్న ఆర్‌యస్‌యస్‌ నాడు మిగతా రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు జాతీయోద్యమంలో భాగస్వాములైతే తాను ఎందుకని జాతీయోద్యమంలో పాల్గొనలేదు? జాతీయతను గురిం చి ఆర్‌యస్‌యస్‌కున్న భిన్నాభిప్రాయాలే అందుకు కారణం.

|| ఆర్‌యస్‌యస్‌ జాతీయత ||

ఒకే భూభాగంలో కలిసి జీవించటం, ఒకే ఆర్థికవ్యవస్థ, ఒకే భాష మాట్లాడటం, ఒకే సంస్కృతి, తదితరాలున్న ప్రజలను ఒకే జాతిగా ఆధునిక సమాజం గుర్తించింది. ఇందులో మతాలు, కులాలు, ఇతర వైవిధ్యాలున్న ప్రజలు కూడా ఉంటారు. భారత దేశం వివిధ జాతుల సమూహంగా ఉన్నది. దేశంలో తెలుగు, తమిళ, ఒరియా, కన్నడ, పంజాబీ, మరాఠీ, తదితర జాతుల ప్రజలున్నారు. ప్రతి జాతి లోనూ వివిధ మతాలకు చెందినవారున్నారు. ఆర్‌యస్‌యస్‌ ఇందుకు భిన్నంగా మతం ప్రాతిపదికగా జాతిని గుర్తిస్తుంది. ఒక మతానికి చెందినవారు మాత్రమే ఒక జాతిగా ఉంటారని, ఇతర మతాలకు చెందినవారు ఆ జాతిలో భాగం కారని ఆర్‌యస్‌యస్‌ చెబుతుంది. ఆర్‌యస్‌యస్‌ నిర్వచనం ప్రకారం హిందూ మతాన్ని అనుసరించే ప్రజలంతా ఒక జాతిగా ఉంటారు. భారతదేశంలో వివిధ జాతులకు చెందిన ప్రజలున్నారని ఆర్‌యస్‌యస్‌ గుర్తించదు. భారతీయులను హిందువులు, హిందూయేతరులుగా మాత్రమే గుర్తిస్తుంది. మన పక్కన, మన దేశంలో, మన రాష్ట్రంలో నివసిస్తున్న ముస్లిములు, క్రైస్తవులు వేరే జాతికి చెందిన వారని చెబుతుంది. హిందువులకు, వారికీ ఎటువంటి జాతీయ సంబంధం లేదని ఆర్‌యస్‌యస్‌ భావిస్తుంది. భారతీయులంటే హిందువులే. ముస్లిములు, క్రిస్టియన్లు ఈ దేశానికి చెందినవారు కాదు. వారు దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, హిందూ రాజులను ఓడించి, మన దేశంపై ఆధిపత్యం చెలాయించారు. హిందువులను అనేక బాధలకు గురిచేశారు. మన దేశాన్ని దోచుకున్నారు. కాబట్టి ముస్లిములు, క్రైస్తవులు హిందువులకు శత్రువులు. మన శత్రువులు మన జాతిలో భాగం కారు. మన శత్రువులను మన జాతి నుంచి వేరుచేయాలి. మన జాతికి చెందిన ప్రజలను కాపాడుకొంటూ, మన శత్రువులను నాశనం చేయటం మన జాతి కర్తవ్యం. కాబట్టి దేశాన్ని ఉద్ధరించటం అంటే హిందువులను ఉద్ధరించటమే. ఈ అవగాహనతో ఆర్‌యస్‌యస్‌ ముస్లిములు, క్రైస్తవులను శత్రువులుగా చూస్తున్నది. కాబట్టి హిందువులు, హిందూ దేశం అభివృద్ధి కావాలంటే ముస్లిములను, క్రైస్తవులను అణచివేయాలని, హిందువులను ఐక్యం చేయాలని ఆర్‌యస్‌యస్‌ చెబుతున్నది.

|| జాతీయైక్యత-హిందూ ఐక్యత ||

ఈ అవగాహనతో పనిచేస్తున్న ఆర్‌యస్‌యస్‌కు భారతదేశ స్వాతంత్య్రం కోసం జరుగుతున్న పోరాటం పెనుశాపంగా పరిణమించింది. భారత జాతీయోద్యమంలో మతాలు, కులాలతో నిమిత్తం లేకుండా ప్రజలందరూ పాల్గొన్నారు. బ్రిటిష్‌వారిని దేశం నుంచి తరిమివేయాలని, దేశానికి స్వాతంత్య్రం సాధించాలన్న జాతీయోద్యమం బ్రిటీష్‌ పాలనతోనే ప్రారంభమైంది. బ్రిటీష్‌వారు దేశాన్ని ఆక్రమించుకొని, పరిపాలించటం ప్రారంభించినప్పటి నుంచి వారిని దేశం నుంచి తరిమివేయటం కోసం వివిధ రూపాలలో పోరాటాలు ప్రారంభమయ్యాయి. 1857లో ప్రథమ స్వాతంత్య్ర పోరాటం, తర్వాత భారత జాతీయ కాంగ్రెస్‌ ఏర్పాటు, జాతీయ విప్లవకారుల పోరాటాలు, కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన తర్వాత స్వాతంత్య్రం కోసం శ్రామిక ప్రజలను సమీకరించటం, తదితర పోరాటాలు క్రమంగా సంఘటిత రూపం ధరించాయి. భారత జాతీయ కాంగ్రెస్‌కు మహాత్మాగాంధీ నాయకత్వం వహించటం, అంబేద్కర్‌ రాజకీయరంగంలోకి వచ్చి దళితుల హక్కుల కోసం పోరాటాన్ని ప్రారంభించటం, అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రచారం, తది తరాల వలన సమాజంలో కుల, మతభావాలు బలహీనపడ్డాయి. వంద సంవత్స రాలకు పైగా జరిగిన జాతీయోద్యమం వలన దేశంలో అభివృద్ధి నిరోధక భావాలు బలహీనపడి, అభ్యుదయ భావాలు వేళ్ళూనుకున్నాయి. దీన్ని దేశానికి ఎదురవుతున్న ప్రమాదంగా ఆర్‌యస్‌యస్‌ భావించింది. కుల, మత భావాలు బలహీనపడటానికి, వివిధ మతాల ప్రజల మధ్య పెరుగుతున్న ఐక్యతకు వ్యతిరేకంగా హిందువులను ఐక్యం చేయటం లక్ష్యంగా ఆర్‌యస్‌యస్‌ తన కార్యకలాపాలను ప్రారంభించింది.

|| సామ్రాజ్యవాదానికి సహజమిత్రుడు ఆర్‌యస్‌యస్‌ ||

హిందువులను ఐక్యం చేసేందుకు పూనుకున్న ఆర్‌యస్‌యస్‌కు దేశంలోని వివిధ మతాలు, కులాల ప్రజల మధ్య పెరుగుతున్న ఐక్యత, అందుకు దోహదం చేస్తున్న జాతీయోద్యమం ఆటంకంగా పరిణమించింది. దేశాన్ని దోపిడీచేస్తూ, ప్రజలపై నిర్బంధాన్ని అమలు చేస్తున్న బ్రిటీష్‌ ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం పెరుగుతున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం బలపడిన మేరకు ప్రజల మధ్య ఐక్యత కూడా బలపడుతున్నది. ప్రజల మధ్య పెరుగుతున్న సామ్రాజ్యవాద వ్యతిరేకత, వివిధ మతాల ప్రజల మధ్య ఐక్యత విచ్ఛిన్నమైతేనే హిందువులను ఐక్యం చేయటం సాధ్యమవుతుందని ఆర్‌యస్‌యస్‌ భావించింది. ఆనాడు జాతీయోద్యమంలో పాల్గొంటున్నవారి ఆలోచనలకు భిన్నమైన ఆలోచన ఇది. ప్రజల మధ్య ఐక్యతను పెంచి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం మరింతగా బలపరచి, సామ్రాజ్యవాదులను దేశం నుంచి తరిమేలని, అంతిమంగా దేశానికి స్వాతంత్య్రం సాధించాలని స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నవారు భావించారు. ముస్లిములను శత్రువులుగా చూపిస్తూ, విద్వేషాన్ని రెచ్చగొట్టి, ప్రజల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేస్తే హిందువులను ఏకంచేసే అవకాశాలు పెరుగుతాయని ఆర్‌యస్‌యస్‌ భావించింది. ఇది జరిగితే భారత జాతీయోద్యమం బలహీనపడి, బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు శక్తివంతులవు తారు. మొదటి మార్గం దేశానికి స్వాతంత్య్రం సాధించటానికి దోహదం చేస్తుంది. రెండవ మార్గం భారతీయుల దాస్యాన్ని పొడిగించటానికి దోహదం చేస్తుంది. నిజమైన దేశభక్తులెవరైనా ఏ మార్గంలో సాగాలని కోరుకుంటారు? దేశ స్వాతంత్య్ర సాధనకు ప్రథమ ప్రాధాన్యతనిస్తారు. కానీ దేశభక్తికి చిరునామా తామేనని చెబుతున్న ఆర్‌యస్‌యస్‌ రెండవ మార్గాన్ని ఎంచుకున్నది. ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టటం ద్వారా హిందువులు, ముస్లిముల మధ్య విభేదాలను పెంచుతూ, దేశ ప్రజల మధ్య పెరుగుతున్న ఐక్యతను విచ్ఛిన్నం చేయటం ద్వారా స్వాతంత్య్ర సాధన లక్ష్యానికి విఘాతం కలిగించటానికి పూనుకున్నది. జాతీయోద్యమ కాలంలో బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు వ్యవహరించిన తీరుకు, ఆర్‌యస్‌యస్‌ వ్యవహరించిన తీరుకు వైరుధ్యం లేదు. దేశంలో తీవ్రమౌతున్న జాతీయోద్యమం బ్రిటీష్‌ పాలనకు ప్రమాద ఘంటికలు మోగించింది. భారతదేశంలో తమ పరిపాలనను కొనసాగించాలంటే దేశంలోని వివిధ మతాలు, కులాలకు చెందిన ప్రజల మధ్య పెరుగుతున్న ఐక్యతను విచ్ఛిన్నం చేయటం బ్రిటీష్‌ పాలకులకు అవసరం అయింది. అందువల్ల ఆంగ్లేయులు భారతీయులను మతాలు, కులాల పేరుతో చీల్చి ఉంచటం ద్వారా తమ పరిపాలనకు ఎదురౌతున్న ప్రమాదాన్నుంచి బయటపడటానికి ప్రయత్నిం చారు. తన లక్ష్య సాధనకు ఆర్‌యస్‌యస్‌ కూడా అవే విధానాలను అనుసరించింది. హిందువులు, ముస్లిముల మధ్య ఘర్షణలను పెంచటానికి పూనుకోవటంతో దేశంలో మతోద్రిక్తతలు తీవ్రమయ్యాయి. హిందువులు, ముస్లిముల మధ్య వైరుధ్యాలు పెరిగిన ప్రాంతాలలో జాతీయోద్యమం బలహీనపడింది.

|| చాతుర్వర్ణ వ్యవస్థను పునరుద్ధరణే సంఘ్ నేటి లక్ష్యం ||

ముస్లిములు, క్రిస్టియన్లను శత్రువులుగా చూపుతూ హిందువులను ఐక్యం చేయటానికి ఆర్‌యస్‌యస్‌ ప్రయత్నిస్తోంది. నిచ్చెనమెట్ల లాంటి కులవ్యవస్థలో ఉన్న హిందువులను ఐక్యం చేయటానికి ఆర్‌యస్‌యస్‌ ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నది? ఆర్‌యస్‌యస్‌ దృష్టిలో హిందువులను ఐక్యం చేయడమంటే హిందువులందరినీ సమానమైన పౌరులుగా చూడటం కాదు. మనుస్మృతికి అనుగుణంగా చాతుర్వర్ణ వ్యవస్థను మరింత బలపరచటం, పటిష్టంగా అమలు జరపటమే హిందువులను ఐక్యం చేయటంగా ఆర్‌యస్‌యస్‌ భావిస్తున్నది. ఆర్‌యస్‌యస్‌ చెబుతున్న హిందువుల ఐక్యతకు అర్థం అదే. కాలం చెల్లిన అసమా నతలను పునరుద్ధరించి, మరింత పటిష్టంగా అమలు జరపటమే వారి లక్ష్యం. అయితే అభివృద్ధి క్రమంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. 
ఈ మార్పులను ప్రతిఘటించటం, చాతుర్వర్ణ వ్యవస్థ పునరుద్ధరణ లక్ష్యంగా ఆర్‌యస్‌యస్‌ పనిచేస్తున్నది. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఆర్‌యస్‌యస్‌ రాజకీయ విభాగం బిజెపి ఆ లక్ష్యాలను అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నది. ఆవు మాంసం తింటున్నారనే పేరుతో ముస్లిములు, దళితులపై దాడులు చేస్తున్నారు. ఆవు మాంసం ఇంట్లో ఉంచుకున్నాడనే పేరుతో యుపిలో వారు హత్య చేసిన మహమ్మద్‌ అఖ్లాక్‌ ఇంటిలో ఆవు మాంసం లేదు. హిందూత్వ శక్తుల దాడిలో గాయా లపాలైన ఉనా దళితులు ఆవులను చంపలేదు. ముస్లిముల దాడులకు తట్టుకోలేక యుపిలోని ఖైరానా నుంచి హిందువులు వలసలు పోతున్నారన్నది కూడా పూర్తిగా అవాస్తవం. వాస్తవాలతో నిమిత్తం లేకుండా తమ లక్ష్య సాధన కోసం అసత్యాలను ప్రచారం చేయటం, కార్పొరేట్‌ మీడియా సహకారంతో వాటిని నిజమని ప్రజల చేత నమ్మింపజేయటం, తాము శత్రువులుగా భావిస్తున్నవారిపై దాడులు, హత్యలు చేయటాన్ని నేడు ఆర్‌యస్‌యస్‌ కొనసాగిస్తున్నది. అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తున్నది.జాతీయోద్యమ కాలంలో మాదిరిగానే నేడు కూడా ప్రజల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయటమే ఆర్‌యస్‌యస్‌ లక్ష్యం. ఆనాడు సామ్రాజ్యవాదుల ప్రయోజనాలను నెరవేర్చిన ఆర్‌యస్‌యస్‌ నేడు కూడా సామ్రా జ్యవాదుల, కార్పొరేట్ల సేవలో తరిస్తున్నది. ఆర్‌యస్‌యస్‌ భావజాలం ముందుకుపోవటం అంటే అమెరికన్‌ సామ్రాజ్యవాదులకు మన దేశ ప్రయోజనాలను మరింతగా తాకట్టు పెట్టటానికి, కార్పొరేట్లు, బహుళజాతి సంస్థలకు మన దేశ సంపదను కట్టబెట్టటానికి, కార్మికవర్గం, శ్రామిక ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేయటానికి దారితీస్తుంది. అభ్యుదయశక్తులు ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రచారం చేస్తూ, ప్రజలను చైతన్యవంతం చేయటం ద్వారానే ఆర్‌యస్‌యస్‌ విధానాలను తిప్పికొట్టటం సాధ్యమవుతుంది.    - ఎ కోటిరెడ్డి

|| దేశభక్తి - జాతీయగీతం ||



            ఒక దేశ పౌరులుగా ప్రజలకు తమ దేశం పట్ల భక్తీ, గౌరవ భావాలు సామాజికంగా అలవడతాయి. వీటిని ప్రత్యేకంగా భౌతిక రూపాల్లో ప్రదర్శించుకునే ఆసక్తి లేకపోయినా గుండెల నిండా దేశభక్తి గూడుకట్టుకొనివుంటుంది. శ్రీరాముడి పట్ల తనకున్న ప్రభుభక్తిని పొట్ట చీల్చి శ్రీరామహృదయాన్ని చూపిన ఆంజనేయుడిలా ప్రజలు కూడా తమ దేశభక్తిని 'గీతాలాపన'తో చాటుకోండని కొలమానాలు నిర్దేశించడానికి ఇదేమీ ఇతిహాసం కాదు. రాజ్యభక్తిని బహిరంగంగా ప్రదర్శించుకునేందుకు మూఢత్వ శకం అంతకంటే కాదు.

Thursday, 1 December 2016

|| కాస్ట్రో- విప్లవ మేష్ట్రో ||



కాస్ర్టో అనంతరం క్యూబా ఏమవుతుందని జోస్యాలు చెప్పేవారు ముందు ట్రంప్‌ హయాంలో అమెరికా అధ:పతనం అంచనాలను కప్పిపుచ్చి వంచిస్తున్నారు. 

మృత్యువంటే భయం లేని మనిషి పాడుతున్న పాట ఇది.. అంటూ మొదలవుతుంది ఘంటసాల గీతం -బహుదూరపు బాటసారి.. ఈ రోజు సభ్య ప్రపంచం మొత్తం నివాళులర్పిస్తున్న ఆ మనిషి ఒకసారి కాదు- 638 సార్లు మృత్యువును ఆ మృత్యుదూతలనూ దైత్యులనూ కూడా ధిక్కరించాడు. వెక్కిరించాడు. మృత్యుంజయుడనే మాటను కూడా దాటేశాడు.

|| నోట్ల రద్దులో చట్ట రాహిత్యం ||



                         ఈ నెల 8వ తేదీ రాత్రి 8 గంటలకు ఈ అర్ధరాత్రి నుంచి 500, 1000 రూపా యల నోట్లు చట్ట సమ్మతాన్ని కోల్పో తాయి. ఇది ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎవ్వరూ చేయని సాహసోపేత చర్య (ఇది మరొక పెద్ద అబద్ధం) అని ప్రధాని టీవీలలో వాగ్బాణాలను వదిలారు. ఆ నోట్ల మీద భార తీయ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నరు చేసిన వాగ్దానాన్ని వంకలో కలిపారు. నోట్ల చట్ట సమ్మతాన్ని చట్టవిరుద్ధం చేయడం చట్ట సమ్మతమేనా? ఒక డెనామినేషన్‌ (విలువ) నోట్లను మొత్తంగా రద్దు చేసే అధికారం ప్రభుత్వానికుందా?

|| ఆర్థిక శాఖ ఆదేశం ||

ఆర్థిక మంత్రిత్వ శాఖ 2016 నవంబర్‌ 8 తేదీన ఎస్‌ఒ 3408(ఇ) ప్రకటన ద్వారా అమలులోనున్న రూ.500, రూ.1,000 డెనామినేషన్‌ సిరీస్‌ (ఇది తప్పుడు పదబంధం) బ్యాంకు నోట్లు చట్టసమ్మతాన్ని కోల్పోతాయని ప్రకటించింది. 'రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం, 1934'లోని 26(2) అధికరణ ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి ఈ ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నది. డెనామినేషన్‌ సిరీస్‌ అన్న పదప్రయోగంలో పప్పులో కాలేసింది. ఈ ప్రకటనలోని క్రమ సంఖ్య లేని మొదటి పేరా అసమగ్రంగా ఉంది. అంతేగాక ఇందులోని అంశాలను కాలక్రమేణా పలుమార్లు పత్రికా ముఖంగా సవరించారు. ప్రభుత్వ ప్రజా ప్రయోజనావ గాహన, చట్ట నిబద్ధత, అమలు అనుమానాస్పదమయ్యాయి.

|| రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం, 1934 ||

ఈ చట్టంలోని కొన్ని సంబంధిత అధికరణలను పరిశీలిద్దాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ద్రవ్య నిర్వహణను స్వాధీనపరుచుకోవడానికి, ఈ చట్ట నిబంధనల ప్రకారం బ్యాంకింగ్‌ వ్యాపారాన్ని కొనసాగించడానికి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ అన్న పేరుతో ఒక బ్యాంకు ఏర్పాటుచేయబడు తుం ద ని అధికరణ 3(1) తెలుపుతోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ సెంట్రల్‌ బోర్డ్‌లో గవర్నర్‌, నలుగురికి మించని డిప్యూటీ గవర్నర్లు, ప్రభుత్వం నియమించే 14 మంది డైరెక్టర్లు (4+10), ఒక ప్రభుత్వాధికారి ఉంటారని అధికరణ 8(1) ప్రస్తావిస్తుంది. అధికరణ 24(1) ప్రకారం 2, 5, 10, 20, 50, 100, 500, 1000, 5000, 10000 రూపాయల విలువల గల నోట్లు మాత్రమే చలామణిలో ఉండాలి. సెంట్రల్‌ బోర్డ్‌ సిఫారసుతో 10000 రూపాయల లోపు విలువ గల నోట్లను కేంద్ర ప్రభుత్వం ముద్రించవచ్చు. రూపాయి నోటు ముద్రణ చట్టసవరణతోనే జరిగింది. ఈ అధికరణలో అనుమతించిన నోట్లలో రూ.2000 నోటు లేదు. సెంట్రల్‌ బోర్డ్‌ సలహా మేరకు అది సూచించిన డెనామినేషన్‌ బ్యాంక్‌ నోట్లను జారీ చేయవద్దని కాని, కొనసాగించవద్దని కాని (రద్దు చేయమని కాదు) కేంద్ర ప్రభుత్వం నిర్దేశించవచ్చని అధికరణ 24(2) చెపుతుంది. 500, 1000 నోట్ల రద్దుకు గాని, 2000 నోటు ముద్రణకు గాని సెంట్రల్‌ బోర్డ్‌ సిఫారసు చేసినట్లు లేదా అనుమతించినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తన 2016 నవంబర్‌ 8 నాటి ఎస్‌ఒ 3408(ఇ) ప్రకటనలో ఎక్కడా ప్రస్తా వించలేదు. అసలు ఈ సందర్భంలో సెంట్రల్‌ బోర్డ్‌ సమా వేశమే జరగలేదని ఆర్‌బిఐ కార్యాచరణ తెలుపుతున్నది. ఏ డెనామినేషన్‌ బ్యాంక్‌ నోట్లలోనైనా, ఏ సీరీస్‌నైనా సెంట్రల్‌ బోర్డ్‌ సిఫార్స్‌ మేరకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధ అమలును నిలుపుచేయవచ్చని అధికరణ 26(2) వివరిస్తున్నది. 1946 జనవరి 13కు ముందు జారీ చేసిన 500, 1000, 10000 డెనామినేషన్ల నోట్లు చట్టబద్ధ విలువ (లీగల్‌ టెండర్‌)ను కోల్పోతాయని, 1946లో సవరించిన అధికరణ 26(ఎ) ప్రకటించింది.

|| నోట్ల రద్దులో చట్ట నిర్లక్ష్యం ||

ప్రతి డెనామినేషన్‌లో అనేక సిరీస్‌ నోట్లు జారీ చేయబడతాయి. ఆ సిరీస్‌ నంబర్లు 5డిఆర్‌, 9బిక్యు, 6విఎస్‌, 9పిహెచ్‌ అని పలు సంఖ్యల్లో ఉంటాయి. సిరీస్‌ నంబర్‌ ప్రతి నోటు మీదా క్రింది భాగంలో ముద్రించబడి ఉంటుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ సెంట్రల్‌ బోర్డుకు ఒకటి లేదా కొన్ని సిరీస్‌ నోట్లను మాత్రమే రద్దు పరచమని సలహా ఇచ్చే హక్కుంది. ఈ విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ సెంట్రల్‌ బోర్డు, కేంద్ర ప్రభుత్వ అధికారాలు పరిమితమే. అలా కాక మొత్తం డెనామినేషన్‌ నోట్లను రద్దు చేయాలంటే పార్లమెంటు నిర్ణయం ద్వారా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం, 1934లోని 26వ అధికరణానికి సవరణ చేయాలి. ప్రభుత్వం 1946లో ఆ అధికరణాన్ని సవరించి 26(ఎ)ను చేర్చింది. 500, 1000, 10000 నోట్లను రద్దుపరిచింది. 1978లో కొన్ని డెనామినేషన్‌ నోట్లను మొత్తంగా రద్దు చేయవలసి వచ్చినప్పుడు అప్పటి ప్రధాని మొరార్జీ దేశారు అధికరణ 26ను సవరించడానికి బదులుగా ఏకంగా హై డెనామినేషన్‌ బ్యాంక్‌ నోట్‌ (డిమానెటైజేషన్‌) యాక్ట్‌, 1978 అన్న చట్టాన్నే చేశారు. ఇప్పటి 500, 1000 నోట్ల రద్దుకు కూడా పార్లమెంటు ఆమోదం, ఆర్‌బిఐ చట్టం అధికరణ 26 సవరణ అవసరం. కానీ ఇవి జరగలేదు. పైపెచ్చు సెంట్రల్‌ బోర్డ్‌ ఇవ్వవలసిన చట్టబద్ధ సలహాను ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రస్తుత ప్రహసనంలో అనేక విధాన లోపాలతో పాటు చట్టరాహిత్యం కూడా చోటుచేసుకుంది. జాతికి క్షమాపణ చెప్పి, నష్ట నివారణ చర్యలను చేపట్టడం తప్ప వీటిని సరిజేసే అవకాశం లేదు. పట్టణాల కంటే పల్లెల్లో నోట్ల రద్దు గోడు ఎక్కువగా ఉంది. అవినీతి ఆద్యులను, నల్ల సంపాదనా ఘనులను, ఉగ్రవాద సృష్టికర్తలను వదిలేసి, అనాదిగా కష్ట నష్టాలకు గురవుతున్న వాళ్ళను మరింత ఇబ్బందులపాలు చేయడం దేశభక్తి కాదు. నోట్ల రద్దుతో అమాయకులు అష్ట కష్టాలు పడుతున్నారన్నవారిని, నల్ల నగదు అంతరించ దన్నవారిని పాకిస్తాన్‌ మద్దతుదారులని నిందించడం న్యాయం కాదు. భారత రాజ్యాంగ అధికరణ 343(1) ప్రకారం అధికారిక కార్యక్రమాలలో భారతీయ అంకెల అంతర్జాతీయ రూపాలను వినియోగించాలి. 2000 నోటు మీద దేవనాగరి అంకెలను వాడి రాజ్యాంగాన్ని ధిక్కరించారు. అంతే కాదు హిందీ భాష స్థానంలో కూడా మరాఠీని వాడేంత నిర్లక్ష్యం వహించారు.

|| ప్రభుత్వ చట్ట వ్యతిరేక చర్యలు ||

నల్ల కుబేరులను భుజాలపై మోసేవారు నల్ల నగదు తెల్ల నగదులో ఉందని ఊహించడం ఆశ్చర్యం కాదు. నల్ల సంపాదనను అరికట్టే పద్దతి ఇది కాదని, ఆ పని చేయడానికి చిత్తశుద్ధి, రాజకీయ సంకల్పం అవసరమని, అవి తమకున్నాయో, లేదో పాలకులు పరీక్షించుకోవాలని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులంటున్నారు. చట్టాలలోని నిబంధనలను సమ్మతించటం, అనుగుణ్యంగా అనుసరించి అమలుచేయటంలోనే ప్రభుత్వ చర్యల, కార్యక్రమాల చట్టబద్ధత ఆధారపడి ఉంటుంది. చట్ట పాలన ప్రజాస్వామ్యానికి పునాది. ఈ నేపథ్యంలోనే ఏ ప్రభుత్వాన్నైనా అర్థం చేసుకోవాలి. ఇష్టంలేని రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను ఆచరించవలసి వచ్చినప్పుడు పాలకులు పైకి వీటికి కట్టుబడి ఉంటామని చెబుతారు. నోటితో పొగుడుతూ నొసటితో వెక్కిరించినట్లు ఆచరణలో ధిక్కరిస్తారు. ఈ ప్రక్రియలను ప్రశ్నించిన వారిని దేశద్రోహులని ముద్ర వేస్తారు. సంఘీయం చట్టాన్ని ధిక్కరించడం ఇది తొలిసారి కాదు. చివరిది కాబోదు కూడా.

|| నల్ల వెలుగు ||

ఏకరూప రంగు బట్టల భక్తులు ఎక్కువయ్యారు. ఒకరోజు మహిళా కళాశాల ముందర కాలేజీ వదిలే సమయంలో ఒక నల్ల బట్టల భక్తుడు అమ్మాయిలను చూస్తూ నిలుచున్నాడు. నయనానందం తర్వాత తన రెండు బుగ్గలను ఒకదాని తర్వాత ఒకదాన్ని వేళ్ళతో నొక్కుకొని (పశ్చాత్తాప సూచకంగా) వెళ్ళిపోయాడు. ఇదే ఆధ్యాత్మిక చింతన కలిగిన పాలకులకు తప్పు తెలిసింది. పశ్చాత్తాపం కలుగలేదు. మోడీయ నిఘంటువులో ఈ పదం లేదు. కోట్ల ప్రజల అనేక కోట్ల గంటల విలువైన ఉత్పత్తి సమయం క్యూలలో వృథా అవుతున్నది. వంద ప్రాణాలు బొందిని వదిలాయి. సగటు భారతీయుల బాధలు వర్ణనాతీతం. ప్రజల సమయం, ధనప్రాణాలు పాలకుల దృష్టిలో విలువలేనివి. తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేరితే చాలు.  - సంగిరెడ్డి హనుమంతరెడ్డి

|| మోదీకుట్రపూరిత వ్యూహంలో పార్లమెంటు ||



                   ప్రజా సమస్యలపై చర్చకు వేదిక పార్లమెంటు. ఉభయ సభల్లో అందుకు అనుగుణంగా కార్యనిర్వహణ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో ప్రతిపక్షాల ఆమోదం కార్యనిర్వహణాంశాలు అజెండాలో చేరుతాయి. ఆయా అంశాలను పార్లమెంటు ఉభయ సభల్లో అన్ని పక్షాల సభ్యులు చర్చించి, ఒక నిర్దేశం చేస్తారు. కానీ ఇటీవలి కాలంలో అధికార పార్టీ కుట్రపూరిత వ్యూహంతో పార్లమెంటు ఉభయ సభలూ అందుకు భిన్నంగా సాగుతున్నాయి.