|| ఆంధ్రా ఊటీ... అరకులోయ ||
ప్యాసింజర్ రైలులో ప్రయా ణమంటే కాస్త ఆలో చించా ల్సిందే. రైలుబండికి అడుగడుగునా బ్రేకులు పడతాయి. అలా మెల్లగా పాక్కుంటూ గమ్యస్థానాన్ని చేర్చేందుకు కాస్త ఎక్కువ సమయాన్నే తీసుకుంటుంది మరి. అయితే ఆ ప్రయాణం అరకు మార్గంలో అయితే మాత్రం మీ అనుమానాలను పక్కన పెట్టాల్సిందే! ఆకాశాన్నంటే కొండ కోనల నడుమ ఒంపులు తిరిగే ఆ ప్రయాణం వర్ణనాతీతం. అక్కడి గిరిజన సంస్క ృతి అరకు అందాల సిగలో ఓ కలికితురాయి. అలా ఆ ప్రకృతి ఒడిలో సమయం తెలియ కుండా సాగిపోయేదే ఈ వారం జర్నీ.
అరకు అందాలను ఆస్వాదించేందుకు రైలు మార్గం ఓ మంచి ఎంపిక. అందుకు విశాఖపట్నం నుంచి కిరండూల్ వెళ్ళే ఒకే ఒక్క రైలు అందుబాటులో ఉంది. ఉదయం ఏడు గంటలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కి హడావిడిగా చేరుకున్నాం. మరో ఐదు నిమిషాల్లో మా ట్రైన్ బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ముందుగానే రిజర్వేషన్ చేసుకోవడం వల్ల సీట్లకోసం వెతుకులాట తప్పింది. నాది విండో సీట్. దాంతో మావాళ్ళంతా 'వీడు ఎండకు బలైపోతాడు..' అంటూ సెటైర్స్ వేయడం మొదలుపెట్టారు. నిజమే, ఈ వేసవిలో విండోసీట్ అంటే ఎండకు ఎదురు నిలబడి సవాల్ విసరడమే. అయినా ఏం చేస్తాం. అయిష్టంగానే అక్కడ కూర్చున్నాను. ట్రైన్ బయలుదేరింది. మొదటి గంట ప్రయాణం చప్పగానే సాగింది. మావాళ్ళంతా నీరసపడిపోయారు. అక్కడి నుండి మొదలైంది అసలు మజా. దట్టమైన పచ్చని కొండలు రైలును ఇరువైపులా కప్పేస్తూ ఆహ్వానం పలికాయి. కుటుంబసమేతంగా వచ్చిన తోటి ప్రయాణీకుల ముఖాల్లో ఉత్సాహం కనిపించింది. మా మిత్రుల కేరింతలు మొదలయ్యాయి. అదే సమయంలో మావారంతా నా చుట్టూ గుంపుగా చేరారు. ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించడానికి విండోసీట్ అనువైందని వారితోపాటు నాకూ అర్థమైంది.
సొరంగాల ఆహ్వానం
ఒంపులు తిరుగుతూ సాగిపోతున్న మా ట్రైనుకు దారిపొడవునా సొరంగా మార్గాలు స్వాగతం పలికాయి. ఎత్తయిన కొండకోనలు వేసవితాపాన్ని పటాపంచలు చేశాయి. కాస్తంత భయం గొల్పేలా ఉన్నాగానీ మా రైలు ప్రయాణాన్ని ప్రతిక్షణం ఆస్వాదించాం. ఆ పయనం నిజంగా అద్భుతమనే చెప్పాలి. దారిపొడవునా నలభై వరకూ గుహలు తారసపడ్డాయి. వాటిలో కిలోమీటర్ పొడవు కలిగిన సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి. ఒక్కసారిగా చీకటి, వెనువెంటనే వెలుగు. ఇలా మా ప్రయాణమంతా చీకటి వెలుగుల సమ్మేళనంలా సాగింది. రైలు కోసం కొండల నడుమ రాతిబండలను చీల్చుకుంటూ వేసిన ఆ మార్గంలో ప్రయాణమంటే ఆ అనుభవం మాటల్లో చెప్పలేం. అలా బొర్రా గుహల వరకూ సాగింది మా ప్రయాణం.
బొర్రా గుహలు
ట్రైన్ బొర్రాగుహల స్టేషన్‌లో ఆగింది. మేమంతా అక్కడే దిగేశాం. బొర్రా గుహలు అనంతగిరి కొండలలో ఒక భాగం. ఇవి మన దేశంలోని అతిపెద్ద గుహలుగా పేరొందాయి. ఈ ప్రాంతం సముద్రమట్టానికి సుమారు 2,313 అడుగుల ఎత్తున ఉంది. స్టేషన్ నుండి గుహలకు పెద్ద దూరం ఉండదు. స్టేషన్ బయటకురాగానే టాక్సీ డ్రైవర్లు మా చుట్టుముట్టేశారు. ఘాట్ రోడ్డు కనుక కమాండర్ జీపు అయితే బాగుంటుందని మేం అభిప్రాయపడ్డాం. ఆ స్టాండ్ దగ్గర ఉన్న రాజు అనే డ్రైవర్‌తో మాట్లాడి, ఆ జీపు బుక్ చేసుకున్నాం. స్టేషన్ నుండి జీవులో జర్నీ భలేసాగింది. వరుసగా ఎదురయ్యే వంపులు భయం గొల్పేలా ఉన్నాయి. కాసేపటికి బొర్రాగుహలు చేరుకున్నాం. రూ.70 టిక్కెట్ తీసుకుని లోపలికి ప్రవేశించాం. గుహలోపల భాగమంతా ఫ్లడ్ లైట్ల వెలుగులలో ధగధగా మెరిసిపోతున్నాయి. ఇవి సున్నపురాయితో ఏర్పడ్డాయి. ప్రకృతి ఉలితో చెక్కిన అందాల శిల్పాలు సజీవంగా ఉన్నట్లు కనిపించాయి గుహలోపలి రాతిబండలు. గుహలో పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంది. అంతేకాదు కొండ పైభాగం నుండి చూస్తే గుహ లోపలిభాగం స్పష్టంగా కనిపిస్తుంది. 1807 సంవత్సరంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుండి విలియం కింగ్ జార్జ్ ఈ గుహలను కనిపెట్టారట. అప్పటి నుండి ఈ గుహలు ప్రధాన ఆకర్షణగా ప్రసిద్ధి కెక్కాయి. రోజూ ఉదయం పది నుండి సాయంత్రం 5.30 వరకూ సందర్శకులను అనుమతిస్తారు.
గిరిజన సంస్కృతికి చిరునామా
బొర్రా గుహల నుండి అరకు ముఫ్పై కిలోమీటర్ల వరకూ ఉంటుంది. ఈ మధ్య ప్రాంతమంతా పచ్చని తివాచీ పరచిన కాఫీతోటలు దర్శనమిచ్చాయి. అరకు వ్యాలీలో కాఫీ తోటలే కాకుండా ట్రైబల్ మ్యూజియం చూడాల్సిందే. గిరిజనుల సంస్కృతి ప్రతిబింబించేలా ఇందులోని కళాకృతులు పర్యాటకుల సందర్శనార్థం ఏర్పాటు చేశారు. జీవం ఉట్టిపడేలా ఉన్నాయి అక్కడి విగ్రహాలు. స్థానిక గిరిజన మహిళలు లయబద్ధంగా చేసే ధింసా నృత్యం అరకులో ఓ ప్రత్యేక ఆకర్షణ. గిరిజనుల జీవనశైలిని దగ్గరగా అధ్యయనం చేసేందుకు అరకు సరైన ప్రదేశం. స్థానికంగా రుచికరమైన భోజనం కోసం మంచి హోటళ్ళు అందుబాటులో ఉన్నాయి. అరకులోని పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ ఆహ్లాదకరమైన వాతావరణానికి చిరునామాగా చెప్పవచ్చు. ఇందులో వివిధ రకాల ఔషధ మొక్కలు పెంచుతారు. ఇక్కడికి దగ్గరలో ఉన్న చాపరాయిని చుట్టి వచ్చాం. మండు వేసవిలో బండలను దాటుకుంటూ వస్తోన్న అక్కడి నీళ్ళు భలే చల్లగా ఉన్నాయి. అరకు నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న జలపాతానికి ప్రయాణమయ్యాం. జలపాతానికి దగ్గరగా జీపు వెళ్ళేందుకు అవకాశం లేదని డ్రైవర్ చెప్పాడు. దాంతో కిలోమీటర్ పైనే నడవాల్సి వచ్చింది. అయితే, జలపాతాన్ని చూడగానే మా అలసట మాయమయింది. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, అరకు కాఫీ రుచులను మాత్రం మిస్సవ్వొద్దు. సువాసనలు వెదజల్లే అమోఘమైన కాఫీకి అరకు పెట్టిందిపేరు. అయితే గతంతో పోల్చుకుంటే అరకు అందాలు కాస్త మసకబారుతున్నాయి. వాతావరణ మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పర్యాటకశాఖ ఈ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాల్సి అవసరం ఎంతైనా ఉంది.
మరిన్ని మార్గాలు
అరకు హిల్‌స్టేషన్ చేరేందుకు రైలు లేదా రోడ్ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ రెండు రైల్వేస్టేషన్‌లు ఉంటాయి. ఒకటి అరకు, మరొకటి అరకు వ్యాలీ. ఈ రెండూ వైజాగ్‌కు కలపబడి ఉన్నాయి. ఈ స్టేషన్‌లు కొత్తవలస, కిరండూల్ రైలు లైన్‌పై ఉన్నాయి. ఇవి, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో భాగం. శిమిలిగూడ రైల్వేస్టేషన్ అత్యధిక బ్రాడ్ గేజ్‌గా పేరుపొందింది. ఇది సముద్ర మట్టానికి సుమారు 996 మీటర్ల ఎత్తులో ఉంది. రైలు ప్రయాణానికి టికెట్స్ ముందుగానే రిజర్వ్ చేసుకుంటే మంచిది. అరకు తిరుగు ప్రయాణం మాత్రం వెహికల్‌లో వెళితే బాగుంటుంది. ఈ ప్రయాణం ప్రమాదకరంగా అనిపించినా ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే సాహసం చెయ్యాలి మరి. అందుకు కొండపైన ప్రయివేటు టాక్సీలు, జీపులు అందుబాటులో ఉంటాయి. ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. టూరిజం శాఖ పర్యాటకులు విడిది చేసేందుకు రిసార్ట్స్ సదుపాయం కల్పించింది. వీటిని ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు పొందేందుకు ఎపి టూరిజం వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి. ఈ వేసవిలో అరకు ప్రయాణం చక్కని అనభవం.
...హ్యేపీ జర్నీ!! (ప్రజాశక్తి దినపత్రిక)