|| మనుధర్మశాస్త్రమా, మహిళా హక్కులా? ||
దేశ స్వాతంత్య్రంతో పాటు మహిళలకు సమాన హక్కులు వచ్చాయి. ఇప్పుడెం తో అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఒకనాడు మహిళలు ఓటు హక్కు కోసం, ఆస్తిహక్కు కోసం, న్యాయస్థానాలలో తమ వాదనలను వినిపించే హక్కు కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు చేయవలసి వచ్చింది. మనదేశంలో ఈ హక్కులు మహిళ లకు మన రాజ్యాంగ రూపకర్తలు ఎంతో ముందు చూపుతో, విశాల దృక్పథంతో రాజ్యాంగంలో పొందుపరిచారు. మన రాజ్యాంగం దేశ పౌరులందరికీ స్వేచ్ఛను, సమానత్వాన్ని, న్యాయాన్ని పొందే హక్కునూ ఇచ్చింది. లింగ, వర్గ, మత, తదితర అంశాల కారణంగా వివక్ష ఉండదని హామీ ఇచ్చింది. ప్రాథమిక హక్కులు నిర్దేశించే అధికరణలు 14, 15, 16 21, 23 లోనూ, ఆదేశిక సూత్రాలను నిర్దేశించే 39, 42, 44 అధికరణల్లోనూ, ప్రాథమిక బాధ్యతలను నిర్దేశించే 51-ఎ లోనూ మహిళలకు సమాన హక్కులే కాదు ప్రత్యేక హక్కులు పొందుపరచబడ్డాయి. అయితే స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ల యినా మహిళలు ఇంకా తమ హక్కుల అమలు ఎక్కడా అని వెతుక్కోవలసిన పరిస్థితి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. కాని ఈ సార్వభౌమ దేశంలో మహిళల దీనస్థితి మనసున్న మనిషిని కదిలించక మానదు. భారత మహిళ అదృశ్యమవుతుంది. 'అ'గౌరవ హత్యలకు గురవుతుంది. గృహ హింసకు బలవుతుంది. విశృంఖల శృంగారానికి, అత్యాచారానికీ, హింసకూ ఆనవాలు అవుతుంది. రాసుకున్న రాజ్యాంగానికి, చూస్తున్న వాస్తవానికీ పోలికే లేదు.
దేశ కుటుంబ ఆరోగ్య సర్వే-3 విడుదల చేసిన గణాంకాలు మనల్ని విస్మయానికి గురిచేస్తాయి. ఈ సర్వేలో 1,25,000 మంది మహిళలతో ముఖాముఖి జరిపారు. వీరిలో 40 శాతం మంది తాము తమ భర్తల చేతిలో తన్నులు తింటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ముఖాముఖిలో పాల్గొన్న 75,000 మంది పురుషుల్లో 51 శాతం మంది అందులో తప్పేముందన్నారు. అంతేకాదు స్త్రీలలోనూ 54 శాతం మంది మగవాడు కొట్టి సరిచేయాలనే అభిప్రాయపడ్డారు. నిజానికి ఈ గణాంకాలు వాస్తవాలను ప్రతిబింబించడం లేదు. గృహహింస ఇంకా ఎక్కువ స్థాయిలోనే ఉందన్నది ఒక కఠోర వాస్తవం. రాజ్యాంగం కల్పించిన సమానత్వం ఇంత పెద్ద ఎత్తున ఎందుకు అమలు కావడం లేదు, భారత మహిళ ఇన్నేళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా రెండో శ్రేణి పౌరురాలిగానే ఎందుకుంటోంది అని లోతుగా ఆలోచిస్తే సమాధానం మన సంస్కృతి, సంప్రదాయాలలో స్పష్టంగా కనిపిస్తుంది. మన మతాలు ఈ సంస్కృతి, సంప్రదాయాలను, తతంగాలను విస్తృతంగా నిర్దేశిస్తున్నాయి. ఏ మతమైనా మిగిలిన విషయాలలో తేడాలున్నా స్త్రీ విషయానికి వచ్చేసరికి ఏకమవుతున్నాయి. మన దేశంలో కేవలం హిందువులు, ముస్లిములే దాదాపు 94 శాతం ఉన్నారు. ఈ రెండు మతాలూ మహిళలకు ఏం ఉపదేశిస్తున్నాయో చూద్దాం!
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 'గీతా ప్రెస్' అనే ముద్రణా సంస్థ ఉంది. ఆ సంస్థ పని మహిళలు ఎలా మెలగాలో పుంఖాను పుంఖాలుగా ప్రచురించడం, మహిళ లకు చేర్చడం. అందులో హనుమప్రసాద్ పొద్దారే రచించిన 'నారీశిక్ష', స్వామీ రాంసుఖ్‌దాస్ రాసిన 'ఇంట్లో ఎలా మసలు కోవాలి', జయదయాళ గో ఇంద్క రాసిన 'స్త్రీల కర్తవ్యాలు', 'స్త్రీల ధర్మాలు', కళ్యాణ్ అనే ప్రత్యేక సంచిక లాంటివి ఉన్నాయి. వీటన్నింటా మనుస్మృతి, శివపురాణం నుంచి ఉటంకింపులున్నాయి. కొన్ని ప్రశ్నలు, జవాబుల రూపం లోనూ ఉన్నాయి. ఉదహరణకు స్వామి రుక్‌దాస్ తన్నులు తింటున్న ఓ ఇల్లాలికి ఇచ్చే సలహా 'స్త్రీ పూర్వజన్మలో చేసుకున్న పాప ఫలితంగానే తన్నులు తింటుంది. ఈ తన్నులతో పాప పరిహారం జరిగిపోతుంది. తన్నులు తినేందుకు తమ కూతురిని పంపకపోతే ఆమె తల్లిదండ్రులు తమ కూతుర్ని తీసుకుని వెళ్లిపోవచ్చు. లేని పక్షంలో ఇల్లాలు ఓర్పుగా తన్నులు తిని తన పాప పరిహారాన్ని చెల్లించు కోవాల్సిందే. ఏనాడైనా ఆమె పాప పరిహారం పూర్తయి భర్త తన్నడం ఆపవచ్చు. ప్రేమించడం మొదలు పెట్టవచ్చు. అంతవరకు ఆమెకు ఓర్పే సర్వం.' ఈ స్వామిజీనే ఇంట్లో ఉండే పురుగు పుట్రను గూర్చి ఏమంటున్నారో చూడండి! 'ఇంట్లో ఉండే పురుగు, పుట్రా ఇంట్లోని కుటుంబ సభ్యులతో సమానం. అవి ఇంట్లో ప్రవేశించిన వెంటనే ఇంట్లో సభ్యులైపోయాయి. అందువల్ల కుటుంబ సభ్యులతో పాటు వాటినీ యాజమాని పోషించాలి. వాటికి హాని చేయకూడదు. చంపకూడదు.' అందుకే గోహత్య మహా పాపం అవుతుంది. భ్రూణహత్య, శిశుహత్య, 'గౌరవ' హత్యలు గౌరవ ప్రదమవుతున్నాయి. ఇక అత్యాచారాల గురించిన స్వామి వార్ల ఉవాచ: 'అత్యాచారానికి గురైన మహిళ నోరు మెదపకపోవడం ఉత్తమం. ఆమె భర్తకు ఈ విషయం తెలిసినా తెలియనట్టు ఉండడం శ్రేయస్కరం.' స్త్రీ పునర్వివాహం గురించి వీరి అభిప్రాయం చూడండి. 'ఒకసారి దానం చేసిన దాన్ని మహిళ తల్లిదండ్రులు మళ్లీ ఎలా దానం చేస్తారు? అందువల్ల పునర్వివాహం అత్యంత పాశవికం. అయితే మగవారి విషయం వేరు. వారు ఎన్నిసార్లయినా పునర్వివాహం చేసుకోవచ్చు. సంతతి కోసం చేసుకోవచ్చు. కోరికలు తీర్చుకునేందుకూ చేసుకోవచ్చు. ఎందుకంటే కోరికలు తీరని మగవారు పక్కదార్లు వెతుక్కుంటారు. అంతకంటే మరో పెళ్లి మెరుగు. వితంతువు పెళ్లైతే చేసుకోకూడదు కానీ కోరికలను అదుపు చేసుకోలేక పోతే ఎవరికయినా ఉంపుడుగత్తెగా ఉండవచ్చు.' ఎంతటి ఔదార్యం!!
మానవత్వం గురించి స్వామిగారేమంటున్నారో చూడండి. స్త్రీపురుష సమానత్వం సరికాదు. స్త్రీకి పురుషునితో సమానత్వం కోరుకునే హక్కేలేదు. సమానత్వం కోరుకోవడం తప్పేకాదు, తెలివితక్కువ తనం కూడా. తక్కువ హక్కులతోనూ, ఎక్కువ బాధ్యతలతోనూ తృప్తి చెందడమే స్త్రీకి విజ్ఞత. ఈయన సతీసహగమనాన్ని కీర్తించడమే కాదు పునరుద్ధరించాలని కూడా కోరుకుంటారు. భర్త మృత దేహం మీద భార్యను పెట్టి కాల్చడమే హిందూ సంప్రదాయానికి పునాదట. స్త్రీకి స్వాతంత్య్రం అర్హత లేదని హిందూ ధర్మశాస్త్రాల నుంచి లేక్కలేనన్ని ఉటంకింపులు ఇవ్వవచ్చు. మచ్చుకు మను ధర్మశాస్త్రంలోనే చూడండి. 'స్త్రీ స్వాతంత్య్రానికి అర్హురాలు కాదు', 'పగలు, రాత్రి మహిళలు తమపై ఆధారపడేటట్టు పురుషులు చూసుకోవాలి.' 'మహిళలు అందాన్ని గురించి పట్టించుకోరు. వయసు గురించి కూడా పట్టించుకోరు. పురుషుడయితే చాలు ఎంత అనాకారి అయినా', 'వారి కోరిక ద్వారా, అదుపు చేయగల వారి ప్రవర్తన ద్వారా, సహజంగానే హృదయం లేని వారి చర్యల ద్వారా స్త్రీలు పురుషుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉన్నా 'అ'విధేయులుగానే ఉంటారు. 'మనువు స్త్రీలకు పడక, అలంకారం, కోరికలు, అవిధేయత, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలను కేటాయించాడు. సమాజంలోనూ, కుటుంబంలోనూ జరిగే ప్రతి ఘటనలోనూ స్త్రీ ఈ విధంగా న్యూనతకు గురవుతున్నది. ప్రతి మాధ్యమం (ముఖ్యంగా సినిమా, టీివీ అడ్వర్‌టైజ్‌మెంట్)లో ఈ ఆలోచనలే ప్రతిబింబిస్తున్నాయి. ఇటువంటి ఆలోచనలను పగలు, రాత్రి ప్రచారం చేస్తున్న సమాజంలో స్త్రీ సమానత్వం పొందాలంటే ఎంతగా నిలబడాలి? పోరాడాలి? ఎదిరించాలి?
ముస్లిం సాహిత్యంలోనూ స్త్రీ పట్ల వివక్షకు కొదవలేదు. ఇస్లాం మత సాహిత్యం అమ్మే ప్రతి చోటా మహిళలను కించపరిచే సాహిత్యం కుప్పలు తెప్పలుగా అందుబాటులో ఉంటుంది. ముఫ్తీ అబ్‌దుర్ ఘనీ 'భర్తల, భార్యల హక్కులు'లో మహిళ మగవాడు ఎలాగైనా వాడుకో గలిగిన ఆస్తిగా చిత్రించాడు. ముస్లిం మహిళలకు వారి సలహా 'మిమ్మల్ని మీరు బానిసలుగానే భావించండి. మీ భర్తలను యజమానులనే అనుకోండి. మీరు చావుదెబ్బలు తింటున్నా ఓర్పు వహించండి' అని. 'స్వర్గాభరణాల'లోని కొన్ని ఉటంకింపులు: 'భర్త ఒక కొండలోని రాళ్లనన్నింటినీ వేరొక కొండపైకి, ఆ తర్వాత మరో కొండపైకి మార్చమంటే భార్య మార్చాల్సిందే.' 'భర్త పిలిస్తే భార్య వెంటనే అక్కడ వాలాలి. వంట చేస్తున్నా సరే!' 'భర్త కోరిన వెంటనే భార్య అతని కోరిక తీర్చాలి. లేకపోతే దేవతలు భార్యను శపిస్తారు.' 'భర్త రాత్రంతా చేతులు కట్టుకుని నిలబడమంటే నిలబడాలి. అలా నిలబడితేనే మరో జన్మకైనా ఫలితం లభిస్తుంది.' 'భర్త పగటిని రాత్రనమంటే అనాల్సిందే.' 'నరకం అంతా స్త్రీలతోనే నిండి ఉంది. భార్యపై భర్త కోపగించుకుంటే దేవుడామె ప్రార్థనలను వినడు. ఇక ఆమెకు స్వర్గంలో చోటుండదు.' ఈయన 'భార్యను కొట్టేహక్కు' అంటూ తన పుస్తకంలో ఏకంగా ఒక విభాగాన్నే కేటాయించాడు. భార్యను కొట్టే హక్కు భర్తకు ఉంది. మిస్‌వాక్ కొమ్మతో కొట్టవచ్చు అని రాశాడు. ఈ ఉటంకింపులు చూస్తే మతం ఏదయినా మహిళ పట్ల వారి భావన ఒకటే అని అనిపించకమానదు. ఒకరినొకరు విమర్శించుకున్నా మహిళ పట్ల వారి దృక్పథంతో మాత్రం పూర్తి ఐక్యత ఉంది. ఐపిసిగాని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌గానీ భారతదేశ చట్టాలు, హేతువాదుల రాతలపై ప్రయోగించబడుతున్నాయి. కానీ మహిళలను ఇంతగా కించపరిచే రాతలపై ఏ చర్యలూ ఉండడం లేదు. ఎన్నో సామాజిక సమస్యలపై జోక్యం చేసుకునే న్యాయమూర్తులు స్త్రీల విషయంలో చూసీచూడనట్లు ఉండి జోక్యం చేసుకోను ఉపేక్షిస్తున్నారు. ఇందులో అభ్యంతరకర విషయం వీరికి కనిపించడం లేదు. క్రమక్రమంగా విద్యావనస్థలోనూ ఇందుకనుగుణమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చట్టాలను అమలు చేయాల్సిన పోలీసు వ్యవస్థ ఈ భావజాలంలో కూరుకుపోయి ఉంది.
కానీ, ఆధునిక మహిళ ఆచరణలో సమానత్వం కోరుకుంటున్నది. రాజ్యాంగం కల్పించిన హక్కులను సాకారం చేసుకోవాలనుకుంటున్నది. మతాన్ని నమ్మినా మతతత్వవాదుల మౌఢ్యాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. భారతదేశం అంటే హిందూ దేశమని, హిందూ దేశమంటే హిందూ మతస్థుల దేశమని, హిందూ మతస్థులకు మూలం మనుస్మృతి అని, అందువల్ల ఈ దేశం మనుస్మృతి ఆధారంగా నడవాలని వాదించేవారు ఈనాడు అధికారంలో ఉన్నారు. తమ వాదనను ఆచరణలో పెట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. చరిత్రను, సంస్కృతిని, విద్యను, ప్రభుత్వ యంత్రాగాన్ని, న్యాయవ్యవస్థను, పోలీసులను ఇందుకు వినియోగించుకుంటున్నారు. సమాజంలో మహిళల పట్ల హింస పెరగడానికి ఈ వైరుధ్యం కూడా ఒక ముఖ్య కారణం. అంచేత కుటుంబం సహరించక, సమాజం పరిహసించి, న్యాయవ్యవస్థ ప్రేక్షక పాత్ర వహించి, పోలీసు యంత్రాంగం నిర్వీర్యమై, విద్యావ్యవస్థ అసమానతలు బోధిస్తూ మత మౌఢ్యంలో కూరుకుపోతే స్త్రీల తరపున పోరాడాల్సింది స్త్రీలు, స్త్రీలతో పాటు ప్రజాతంత్రం మీద, మానవత్వం మీద, స్వేచ్ఛా, సమానత్వం మీద గౌరవమున్న, నమ్మకమున్న పౌరసమాజం. అప్పటి వరకు స్త్రీల సమానత్వం అక్షరాలకు పరిమితం.
- కె ఉషారాణి