|| " ప్రపంచ కుబేరులారా ఏకంకండి" ||
ఈనెల మొదటి వారం క్రితం దాకా మొసాక్ ఫోన్సెకా అనే పేరు ఎప్పుడైనా విన్నారా? మీరు అసామాన్యులు అయివుంటే తప్ప ఈ సంస్థ పేరు వినే అవకాశం దాదాపు లేదు. ఇప్పుడది ప్రపంచ ప్రసిద్ధ సంస్థల్లో ఒకటైపోయింది. ఇదొక 'లా' సంస్థ. ఇంతకీ ఏ గొప్ప పనిచేసి హఠాత్తుగా ఇంత పేరు సంపా దించిందో తెలుసా? మీ దగ్గర ఓ బిలియన్ (వంద కోట్లు) డాలర్లు ఉండి, ఆ మొత్తాన్ని ఎలా దాచుకోవాలో మీకు తెలియ కపోతే ఈ సంస్థ ఆ డబ్బును మీ కోసం దాచి పెడుతుంది. బిలియన్ డాలర్లే దాని పరిమితి అనుకోకండి. ఎంత డబ్బైనా అది దాచిపెట్టగలదు. ఎందుకు దాయడం అంటారా? ప్రధా నంగా పన్నులు ఎగ్గొట్టడానికి. అక్రమంగా సంపాదించి ఉంటే దానికి లెక్క చెప్పడం కష్టం గనుక అప్పుడు కూడా దాన్ని దాచిపెట్టాల్సి వస్తుంది. ఆ సంస్థ అందిస్తున్న 'సేవ'ల్లో పక్షపాతం లేదు. ప్రపంచంలో కుబేరులు ఎక్కడున్నా వారికి అది వివక్ష లేకుండా 'సేవ' చేస్తుంది. ప్రపంచ కుబేరులారా ఏకంకండి! అన్నది దాని అప్రకటిత లక్ష్యం. అయితే పేరు గడించడం దాని ఉద్దేశం కాదు. రహస్యంగా కుబేరులకు సాయపడటమే దాని పని. నాలుగు దశాబ్దాలుగా ఆ సంస్థ నిరవధికంగా సేవ చేస్తోంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా 40 బ్రాంచీలున్నాయి. ఈ సంస్థ సహ వ్యవస్థాపకుడు రమోన్ ఫోన్సెకా మోరా స్వతహాగా జర్మన్. చిన్నప్పుడే తల్లిదండ్రులతో పాటు పనామా వెళ్లాడు. అక్కడే స్థిరపడ్డాదు. ఆయన తండ్రి జర్మనీలో నాజీ అధికారిగా పనిచేశాడు. ఆయన అన్న రెండవ ప్రపంచ యుద్ధానంతరం పశ్చిమ జర్మనీలో కమ్యూనిస్టుల గురించి సిఐఎకు ఉప్పందించాడు. రమోన్ ఫోన్సెకా మాత్రం మతగురువు అవ్వాలని కలలుగన్నాడట. కానీ ఇప్పుడు తన తండ్రి కంటే, అన్న కంటే గొప్ప ఘనకార్యం చేస్తున్నాడు. పన్నులు ఎట్లా ఎగ్గొట్టాలో ప్రపంచ కుబేరులకు నేర్పుతున్నాడు. మరో విశేషం. ఇతడు నవలాకారుడు. నాలుగు నవలలూ, కొన్ని కథలూ కాకరకాయలూ రాశాడు. ఇతని రచనలకు అవార్డులు కూడా వచ్చాయి. రావా మరి!
2016 ఏప్రిల్ 3న పనామా పత్రాల పేరుతో సుమారు కోటీ పదిహేను లక్షల రహస్య పత్రాలు ఒకేసారి బయటపడ్డాయి. ఆ పత్రాలన్నీ 2,14,000 కంపెనీలకు సంబంధించిన ఫైళ్లు. వీటన్నిటినీ మొసాక్ ఫోన్సెకా ఇంతకాలంగా కాపాడుతోందన్నమాట! ఇంతవరకూ వెల్లడైన అంతర్జాతీయ కుంభకోణాల్లో ఇదే అన్నింటికన్నా పెద్దది అంటున్నారు.
// "కుబేరులకు తీపి కబురు" //
మొసాక్ ఫోన్సెకాను మించిన సంస్థలు ఇంకా చాలా ఉన్నాయట. ఒక్క బ్రిటన్‌లోనే పదికి పైగా ఉన్నాయట! ప్రపంచ ప్రజానీకంలో సగం మంది దరిద్రంలో మగ్గుతు న్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు సంక్షేమ పథకాల్లో కోత పెడుతున్నారు. వర్ధమాన దేశాల్లో మాత్రమే కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇదే జరుగుతోంది. టాక్స్ జస్టిస్ నెట్వర్క్ అనే ఓ అంతర్జాతీయ సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పన్నులు కట్టకుండా దాచిన సొమ్ము సుమారు 30,00,000 కోట్ల డాలర్లు. దానిలో కేవలం 56,300 కోట్ల డాలర్లు ఖర్చు పెడితే ప్రతి పేద కుటుంబానికీ ఏడాదికి రెండు వేల డాలర్లు ఇవ్వవచ్చు అని ఆ సంస్థ అంచనా కట్టింది. కాబట్టి సంక్షేమ పథకాలకు డబ్బులేకపోవడం అన్నది పచ్చి అబద్ధం. బాగా బలిసినవాళ్ల దగ్గరి నుంచి చట్టపరంగా రావలసిన డబ్బులు వసూలు చేయగలిగితే చాలు. ఈ భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరికీ కనీసం కూడు, గూడు, గుడ్డ, చదువు, ఆరోగ్యం లాంటి వసతులను ఉచితంగా కల్పించవచ్చు. అంతకుమించిన వసతుల కోసం ప్రజలు న్యాయబద్ధంగానే కృషి చేసుకోవడానికి ఆ రకంగా నిజమైన అవకాశం ఇవ్వవచ్చు. కానీ ఇప్పుడున్న ప్రపంచ వ్యవస్థ ఇంత సున్నితంగా సమస్యను పరిష్కరిం చాలనుకొంటుందా? ఈ వ్యవస్థను కూలదోస్తే తప్ప మనిషికి విముక్తి లేదు అన్న మాట ముందుకు వచ్చేది అందుకే మరి! మొసాక్ ఫోన్సెకా ద్వారా డబ్బులు దాచుకొన్నవారిలో రకరకాలవాళ్లున్నారు. రకరకాల దేశాలున్నాయి. దాదాపు అన్ని ఖండాలవాళ్లూ ఉన్నారు. ఇందులో భారత ప్రదాని మోది ప్రియమిత్రుడు, సన్నిహితుడు అదానీ లాంటి భారత జాతిరత్నాలూ ఉన్నారు.
అవినీతిపరులని మనకు బాగా తెలిసిన వ్యక్తులు కొందరు మన కళ్లెదుటే అవినీతి వ్యతిరేక సభలు, సెమినార్లు వగైరా నిర్వహిస్తారు. ఉపన్యాసాలు దంచుతారు. నీతి కథలు చెబుతారు. దాన్ని చూసి మనం ఏడవలేక నవ్వుతుంటాం. కానీ అదే తరహా డ్రామాలు చాలా పై స్థాయిలో కూడా జరుగుతాయని పనామా పేపర్లు రుజువు చేశాయి. బ్రెజిల్లో 'అవినీతిపరురాలైన' దిల్మా రౌస్సెఫ్ రాజీనామా చెయ్యాల్సిందేనని ఎప్పటి నుంచో పట్టుపడుతున్న ఓ నాయకమ్మన్యుడు కూడా ఈ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయాడు. అలాగే ట్రాన్స్ఫరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ అంతర్జాతీయంగా కార్పొరేట్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడటానికే పుట్టానంటుంది. కాని చిలీలో దాని అధ్యక్షుడు కూడా ఈ దంధాలో దొరికిపోయాడు.
// మెలికలో మెలిక //
ప్రపంచ కుబేరుల ముఠాకు నాయకత్వం వహించే అమెరికా నుంచి ఒక్క పేరు కూడా ఈ కుంభకోణంలో లేకపోవడం ఆశ్చర్యకరం గదా! ఈ రహస్య సమాచారాన్ని ప్రపంచానికి వెల్లడించిన సంస్థలు రెండు. ఒకటి, సుడ్యెట్సే జైటుంగ్ అనే ఓ జర్మన్ పత్రిక. రెండు, ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ అనే సంస్థ. ఈ సంస్థలో పనిచేసే జర్నలిస్టులంతా 76 దేశాల్లో ఉన్నారు. అయితే ఇదంతా పైకి కనిపిస్తున్నంత సూటిగా లేదు. ఈ జర్నలిస్టు సంస్థను ఫోర్డ్, కెల్లాగ్, కార్నెజీ, రాక్ఫెల్లర్ ఫౌండేషన్లు పోషిస్తున్నాయి. జార్జి సోరస్ అనే అమెరికా కుబేరుడు ఏటా ఈ సంస్థకు పెద్ద ఎత్తున చందా ఇస్తాడు. ఈయనే హిల్లరీ క్లింటన్‌కు కూడా చాలా పెద్ద మొత్తం చందా ఇచ్చాడు. వీళ్లు కాక యుఎస్ఎయిడ్ కూడా దీనికి అండదండలు అందిస్తుంది. అంటే ఈ సంస్థకు సిఐఎ అండదండలు కూడా ఉన్నట్టే. అందుకే మనకు అందుతున్న సమాచారం బొట్టు బొట్టుగా మాత్రమే అందుతోంది. పైగా సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా గాక ఎడిట్ చేసి అందిస్తున్నారనే అనుమానాలున్నాయి. స్నోడెన్లాగానో, వికీలీక్స్లాగానో బడా బాబుల బండారాన్ని బయటపెట్టడమే లక్ష్యంగా ఈ రహస్యాల వెల్లడి సాగటంలేదనే సందేహా లున్నాయి.
- ఎ గాంధి (వ్యాసకర్త పీకాక్ క్లాసిక్స్ సంపాదకుడు)

No comments:
Post a Comment