|| స్త్రీల ఆలయ ప్రవేశం - సాంస్కృతిక కోణం ||
తృప్తిదేశారుభూమాత బ్రి గేడ్తో సహా శని సింగనాపూర్ ఆలయంలోకి ప్రవేశించడంతో తరతరాల నుంచి కొనసాగుతున్న కొన్ని అర్థం లేని సంప్రదాయాలు, మూఢనమ్మకాలకు చరమగీతం పాడినట్లయింది. అదే సమయం లో అంతర్జాలం, మీడియా దుమారం రేపు తున్నాయి. ''ఎందుకంత పంతం, కొన్ని ఆలయా లలో ప్రవేశం లభించకపోతే నష్టమేంటి? పిల వని పేరంటానికి వెళ్ళడమెందుకు'' అని చాలా మంది మహిళలే భూమాత బ్రిగేడ్ సభ్యులను అడుగుతున్నారు. స్త్రీల ప్రవేశాన్ని నిషేధించిన కొద్ది ఆలయాలలో ప్రవేశాన్ని కోరుతున్న మహి ళలు ప్రశ్నిస్తున్నది ఆ సంప్రదాయాన్ని మాత్రమే కాదు, సమాజంలో స్త్రీల పట్ల అనుసరిస్తున్న పక్షపాత ధోరణిని, అనాది నుంచి స్త్రీల పట్ల చూపిస్తున్న లింగ వివక్షతను కూడా. ఆది మానవుడి కాలం నుంచీ సమాజంలో స్త్రీ, పురుషుల పాత్రలను, వారి పనిని విభజించడం జరిగింది. ఆహార సముపార్జన, రక్షణ పురుషులు చూసుకోగా, సంతాన పాలన, కుటుంబ నిర్వహణ స్త్రీల వంతుకు వచ్చింది. అప్పట్లో వ్యవస్థ కొనసాగడానికి ఇవి మార్గదర్శకాలుగా ఉండేవి కాని నిబంధనలు మాత్రం కావు. వారి నైపుణ్యాన్ని బట్టి స్త్రీపురుషులు పాత్రలు మార్చుకోవడం పైన ఎటువంటి ఆంక్షలూ ఉండేవి కాదు. గుహ జీవనానికి స్వస్తి పలికి సహజీవనానికి, నాగరికతకు బీజం వేస్తున్న ఆది మానవుల్లో ఇటువంటి శ్రమవిభజన 30 వేల సంవత్సరాల క్రితం కనిపించేది. ఆ రాతియుగం నుంచి ఈ ఆధునిక కాలం వరకు మానవులు అనేక పరిణామ దశలను దాటుకుంటూ మెసపుటోమియా, హరప్పా వంటి అద్భుతమైన నాగరికతలను సృష్టించుకుంటూ ఈ రోజు ఈ స్థానంలో ఉన్నారు. మార్పు ప్రకృతి సహజమైనది. కానీ ప్రపంచంలో అత్యంత మంద గమనంగా వచ్చే మానవ ప్రకృతిలోని మార్పు, మనిషి నైజంలో మార్పు. అది రావడానికి కొన్ని తరాలు కాదు, కొన్ని యుగాలు పడుతుంది. కొద్ది పాటి మాతృస్వామ్య నాగరికతలు తప్ప, ప్రపంచంలో ఎక్కువగా పితృస్వామ్య వ్యవస్థ మనకు కనిపిస్తుంది. మన సౌకర్యం కోసం, శ్రమ విభజన కోసం ఏర్పరచుకున్న మార్గదర్శకాలు, కొన్ని యుగాల కాలంలో నిబంధనలు, ఆంక్షలుగా మార్పు చెందాయి. పురుషాధిక్య సమాజంలో స్త్రీల పట్ల అవలంబిస్తున్న పక్షపాత వైఖరిని సంస్కృతి, సంప్రదాయాల పేరుతో సమర్ధించుకోవడం మొదలు పెట్టారు. మహిళల పట్ల పక్షపాత ధోరణి, వివక్ష, దాని రూపం ప్రభావంలో భిన్న దేశాలలో వ్యత్యాసం కలిగి ఉన్నప్పటికీ, ప్రతి సమాజంలోనూ కన్పిస్తుంది.
గ్రీస్ దేశంలోని అధోస్ పర్వతం మీదున్న దేవాలయం లోకి స్త్రీలను, ఆడ పశువులను అనుమతించరు. ఆ పర్వతం మీద అనేక అధ్యాత్మిక కేంద్రాలలో అధ్యాత్మిక పురోగతికి తత్పరులైన మతానువరులకు స్త్రీల సంచారం అడ్డు వస్తుందని వారి వాదన. ఆడ పశువుల సంచారం కూడానా? జపాన్‌లోని ఒమీన్ పర్వతం మీద 1300 సంవత్సరాల వరకూ స్త్రీలను అనుమతించలేదు. బౌద్ధ భిక్షువుల తపస్సుకు భంగం కలుగుతుందనేదే వాదన. మన శమరిమల గుడిలోకి మహిళలను అనుమతించక పోవడానికి చెప్పే ఒక కారణం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామీ బ్రహ్మచారి కావడం వల్ల స్త్రీలను అనుమతించరట. రాఘవులుగారు రాసిన ''భారత మాతకు ఇచ్చే గౌరవం ఇదేనా''లో ఆయన పేర్కొన్నట్లు దేవుడి మానాన్ని రక్షించే బాధ్యత భక్తులు పుచ్చుకున్నారా? లేక వారి వలే దేవుళ్ళు కూడా చపల చిత్తులు అని మానవులు భావిస్తున్నారా? స్త్రీలు చుట్టు ప్రక్కల్లో కనిపిస్తేనే లైంగిక వాంఛ కలిగే పురుషుల అధ్యాత్మిక పురోగతి ఏ పాటిదో మనం ఊహించగలం. స్త్రీలను విలాస వస్తువుగా చూసే రాతియుగ మానసిక ప్రవృత్తిని కప్పి పుచ్చుకోవడానికి పురుషులు ఆడుతున్న నాటకాలే ఈ మూఢనమ్మకాలు, సంప్రదాయాలు.
మారుతున్న కాలంతో స్త్రీలకు సమాన హక్కులు, గౌరవం యొక్క ఆవశ్వకతను గుర్తిస్తూ ప్రపంచంలోని అత్యధిక దేశాలు తమ చట్టాలను సవరించుకుంటున్నాయి. వారికి సమాన హక్కులు కల్పిస్తూ కొత్త చట్టాలు చేశాయి. భారత రాజ్యాంగం కూడా స్త్రీలకు సమాన హక్కులు కల్పిస్తూ మహిళలకు రాజ్యాంగంలో పెద్ద పీటవేసింది. 16వ అధికరణ ద్వారా అన్ని రంగాలలో స్త్రీపురుషులకు సమాన హక్కులు కల్పించింది. 18వ అధికరణ ద్వారా పురుషులతో సమానంగా మతపరమైన స్వాతంత్య్రాన్ని కల్పించింది. ఇవే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో 2009 ఐక్యరాజ్యసమితి డిక్లరేషన్ ద్వారా స్త్రీల పట్ల వివక్షను, అసహనాన్ని అన్ని రూపాల్లో నిర్మూలించాలని పునరుద్ఘాటించారు. కాని ఈ అంతర్జాతీయ నిబంధనలు జర్మనీ దేశంలోని కోలాన్ రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకల్లో స్త్రీలపై జరిగిన సామూహిక వేధింపులను నిదోధించ లేకపోయాయి. స్త్రీలను తమ గౌరవ చిహ్నంగా భావించి హిజాబ్‌లో కప్పి ఉంచే అరబ్ దేశ పురుషులు ''తహ్హరుష్ గామియా'' అనే అనాగరిక ఆచారంలో భాగంగా స్త్రీలపై సామూహిక అత్యాచారం చేసే తీరు చూస్తే ఐక్యరాజ్యసమితి కూడా సిగ్గుతో తలదించు కోవాల్సిందే.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. స్త్రీలకు సమాన హక్కులు కల్పించడానికి, స్త్రీలపై జరిగే హింసాత్మక చర్యలను అడ్డుకోవడానికి ఉద్దేశించబడిన చట్టాలు ఒక అన్యాయంగాని, నేరంగాని జరిగిన తర్వాత నేరస్తులను శిక్షించడానికి ఉపయోగపడుతున్నాయే తప్ప నేరం జరగకుండా నివారించలేక పోతున్నాయి. అదే నిజమైతే నిర్భయ చట్టం లాంటి కఠోరమైన చట్టాలు ఉన్నప్పటికీ ఒక్క ఆలోచన కూడా లేకుండా నిన్న గాక మొన్న కృష్ణాజిల్లాలో అమాయకురాలిపై అత్యాచారం చేసి చెట్టుకు ఉరితీసేవారు కాదు. మానవులు ప్రవర్తించాల్సిన తీరుకు, ప్రవర్తిస్తున్న తీరుకు మధ్యలో పెద్ద అగాథం ఉంది. శిక్షకు భయపడి చట్టాలను గౌరవించడం చాలా అరుదుగా జరుగుతున్నది. జరగాల్సింది కూడా అది కాదు. చట్టాలు మన కోసం మనం ఏర్పరచుకున్న నిబంధనలు. చట్టాలను గౌరవించడానికి కారణం శిక్ష భయం కాకూడదు. గౌరవించడం సరైనదని నమ్మాలి. మహిళలకు సమాన హక్కులు కల్పించడం ఆవశ్యకమని, వారి పట్ల మాత్రమే కాదు ప్రతి వ్యక్తి పట్ల ప్రేమ, దయ కలిగి ఉండటం అవసరం. ఒక పని మంచిదా లేక చేయకూడనిదా అనేది ఒక వ్యక్తికి అతని సంస్కృతి నుంచి అలవడుతుంది. ఒక తరం నుంచి మరో తరాలనికి వారసత్వంగా అందిపుచ్చుకొనే కొన్ని నమ్మకాలు, సంప్రదాయాల కలయికనే సంస్కృతి అంటారు. ప్రకృతిలో ప్రతి విషయంలో మార్పు చోటు చేసుకున్నట్లే సంస్కృతి కూడా కాలం, ఇతర సంస్కృతుల ప్రభావం వల్ల మార్పుకు లోనవుతుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే సమాజంలో అన్ని రకాల మార్పుల కంటే అతి మందగమనంతో జరిగే మార్పు సాంస్కృతిక మార్పు. ఈ వ్యత్యాసమే సమాజంలో మనం చేయాల్సిన పనికి, నిజానికి చేస్తున్న పనికి మధ్య అగాథం సృష్టిస్తుంది. మానవ పరిణామ క్రమంలో శారీరక పరిణామం కంటే కూడా మానసిక పరిణామం చాలా నెమ్మదిగా జరుగుతుంది. మానసిక పరిణితి సాధించడానికి మనకు 30 వేల సంవత్సరాలు కూడా సరిపోలేదు. అందుకనే ఇది సరైన పని అని మనం నిర్ణయించుకుని దాన్ని అమలు చేయడానికి చట్టాలు చేసుకొన్నప్పటికీ వాటిని పాటించడానికి చాలా మందిని బలవంత పెట్టాల్సి వస్తున్నది. చాలా నెమ్మదిగా జరిగే ఈ సాంస్కృతిక పరిణామం వల్లే మనం సమాజంలో భిన్న వర్గాల మధ్య అభిప్రాయ భేదాలు చూస్తున్నాము. మనం చట్టం సహాయంతో శని సింగనాపూర్ గుడిలోకి స్త్రీలను తీసుకు వెళ్ళగలిగాము కానీ సంప్రదాయ భారతీయ కుటుంబాలలో తల్లులు మాత్రం తమ కుమార్తెలను రుతుక్రమ సమయంలో ఈ రోజుకూ ఇంటిలోని పూజ మందిరంలోనికి అనుమతిం చకపోవడానికి ఈ మందగమనంలో సాగే సాంస్కృతిక పరిణామమే కారణం. స్త్రీల ఆలయ ప్రవేశాన్ని 50 శాతం వరకూ స్త్రీలు హర్షించలేకపోవడానికి ఇదే కారణం.
ఈ తరుణంలో మన సమాజానికి అత్యంత అవసరమైనది సాంస్కృతిక విప్లపం. ప్రజల ఆలోచనా విధానాల్లో మార్పు. ఇది క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబంలో మొదలవ్వాలి. పిల్లలను పెంచే దశలో వారిలో సరైన నైతిక విలువలు ఇస్తూ స్త్రీ పురుషు లను సమానంగా గౌరవించేటట్లు, మానవాళి పట్ల ప్రేమ, జాలి కలిగుండేటట్లు పెంచాలి. ఈ మార్పు కుటంబంతో మొదలై సమాజానికి వ్యాప్తి చెందాలి. ఎటువంటి మార్పునైనా మానవ స్వభావం మొదట్లో ప్రతిఘటిస్తుంది. కానీ నెమ్మదిగా ఆ మార్పుకు అంగీకారానికి వస్తుంది. ఒకప్పుడు సతీసహ గమనాన్ని, బాల్య వివాహాలను నిషేధించినప్పుడు సమాజంలో అత్యధిక ప్రజలు దాన్ని సమర్థించలేదు. కానీ నేడు ఆ సంప్రదాయాలు ఎంత అనాగరికమో మనం తెలుసుకు న్నాము. మనకు ఏది సరైనదో నిర్ణయించుకొని, ఆ విధానాలను అందరూ అనుసరించేటట్లు మనం తీసుకున్న నిర్ణయాలే చట్టాలు. కానీ అవి ఎటువంటి ఒత్తిడి లేకుండా అందరూ స్వేచ్ఛ గా అనుసరించాలంటే సాంస్కృతిక విప్లవం రావాల్సిందే. ఇది ఒక్క రోజులో జరిగే పని కాదు. కానీ ఆలోచన అంటూ ఉంటే ఆచరణ మార్గం కనిపించకపోదు. - సంజీవని కుసుమ్ (వ్యాసకర్త లెక్చరర్)

No comments:
Post a Comment