|| ముస్లిం మైనారిటిలపై కక్ష - నిర్దోషులకు శిక్ష ||
'వంద మంది నిందితులు తప్పించుకున్నా పరవాలేదు, ఒక్క నిర్దోషికీ శిక్ష పడకూడదు' అని మన న్యాయ వ్యవస్థ ఘోషిస్తుండగా ఉగ్రవాదులన్న నెపంతో వేల సంఖ్యలో అమాయక మైనార్టీ ముస్లిం యువకులు విచారణకు సైతం నోచుకోకుండా ఏళ్ల పర్యంతం జైళ్లలో మగ్గడం మనకు, మనం విశ్వసిస్తున్న న్యాయ వ్యవస్థకు అవమానం. దేశంలో ఏ మూలన ఏ చిన్న సంఘటన జరిగినా పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో సంబంధాలున్నాయని, సీమాంతర ఉగ్రవాద సంస్థలతో లింకులున్నాయని నెపం మోపి ముస్లిం యువకులను ప్రభుత్వాలు అక్రమంగా నిర్భందించడం అమానుషం. కేసు దర్యాప్తు చేపట్టకముందే నోటికొచ్చిన ముస్లిం టెర్రరిస్టు సంస్థల పేర్లు వల్లించి మీడియాకు లీకులిచ్చి ప్రచారం చేయడం దుర్మార్గం. హిందూ మతతత్వమే ఎజెండాగా పని చేస్తున్న బిజెపి ప్రభుత్వాలైతే గోరంతలు కొండతలు చేయడం అటుంచి, అసలు లవలేశ మాత్రమైనా నిజం లేకపోయినా ముస్లింలను ఒక పథకం ప్రకారం ఉగ్రవాదులుగా చిత్రీకరించి పబ్బం గడుపుకోవడం ఆందోళనకరం. కేవలం అనుమానం పేరుతో సంఘటనలతో సంబంధం లేని వారిని కఠిన చట్టాల కింద నిర్భందించి, ఆపైన తీరిగ్గా నాలుక్కరుచుకున్న ఉదంతాల్లో మహారాష్ట్ర మాలెగావ్ పేలుళ్ల కేసు తిరుగులేని ఉదాహరణ. 2006లో మాలెగావ్‌లోని ముస్లింల మసీదు సమీపంలో జరిగిన బాంబు పేలుళ్లకు 37 మంది చనిపోగా, వంద మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ పైశాచికానికి పాల్పడ్డవారిని మానవ మృగాలని సంబోధించడం సబబు. పేలుళ్లు దిగ్భ్రాంతికరం కాగా కేసు దర్యాప్తులో మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన హడావుడి జుగుప్సాకరం. అప్పటికప్పుడు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు స్థానికులైన తొమ్మిది మంది ముస్లిం యువకులను నిందితులుగా అనుమానిస్తూ టెర్రరిస్టు నిరోధక దళం (ఎటిఎస్) అదుపులోకి తీసుకుంది. అంతేనా మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టం (మోకా)ను బనాయించి కొన్ని సంవత్సరాలు బెయిల్ రాకుండా చేసింది. లష్కరే వంటి సంస్థలతో సంబంధాలున్నాయని ఏవేవో కథలను మీడియాలో ప్రచారం చేయించింది. ఎటిఎస్, సిబిఐ సదరు యువకులకు సంబంధం ఉందనడానికి ఎలాంటి ఆధారాలూ చూపలేకపోయాయని, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) ముంబయి ప్రత్యేక కోర్టుకు చెప్పడంతో ఎట్టకేలకు ఆ యువకులు నిర్దోషులుగా బయటపడ్డారు. విచారణ సమయంలోనే ఒకరు చనిపోగా మిగిలినవారు చేయని నేరానికి పదేళ్లపాటు ఎంతగా నరకం అనుభవించారో మాటల్లో చెప్పలేం.
ఇంతకీ మాలెగావ్‌లో తేలిందేమిటి? ముస్లిం ఉగ్రవాదానికి ధీటుగా హిందూ ఉగ్రవాదాన్ని దేశంలో పెంపొందించాలని హిందూ మతతత్వ శక్తులు పేలుళ్లకు పాల్పడ్డాయని దర్యాప్తులో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. అప్పటి వరకు ఆ ఘాతుకాన్ని ముస్లిం ఉగ్రవాద సంస్థల ఖాతాలో వేసి పోలీసులు పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలిచ్చారు. అక్కడిదాకా ఎందుకు హైదరాబాద్ మక్కా మసీదులో 2007లో జరిగిన బాంబు పేలుళ్లప్పుడూ తొలుత పోలీసులు సిమి, హుజీ, లష్కరే అంటూ పాతబస్తీకి చెందిన వందలాది మంది ముస్లిం యువకులను పోలీస్స్టేషన్లలో బంధించి చిత్రవధ చేశారు. ముస్లిం ఉగ్రవాద సంస్థలే మక్కా పేలుళ్లకు పాల్పడ్డాయనే కధాంశంతో ఏకంగా తెలుగు సినీ నిర్మాతాలు చిత్రాలు నిర్మించి ప్రజలపై వదిలారు. కొన్నేళ్ల తర్వాత దర్యాప్తులో అది హిందూ ఉగ్రవాదుల పనిగా రుజువైంది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ప్రేలుడు దుర్ఘటనలో సైతం తొలుత ముస్లిం ఉగ్రవాద సంస్థల పేర్లు ప్రచారం చేయగా తరువాత అది హిందుత్వ ఉగ్రవాదుల పనిగా పోలీస్ విచారణలో తేలింది. ఉగ్రవాదమంటే ముస్లిం ఉగ్రవాదమని, వారికి ఇక్కడి ముస్లిం యువకులు సహకరిస్తున్నారనే తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వాలు, దర్యాప్తు సంస్థలు తలకెక్కించుకోవడం వలన అమాయకులు సమిధలవుతున్నారు.
అమాయక మైనార్టీ ముస్లిం యువకులు అకారణంగా జైళ్లలో మగ్గుతున్నారని ప్రతిపక్షాలో లేకపోతే ముస్లిం సంస్థలో చెప్పడం లేదు. సాక్షాత్తు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానమే పక్కా సాక్ష్యం. 2014 వరకు దేశంలో జైళ్లలో మగ్గుతున్న ముస్లిం యువకుల సంఖ్య 82 వేల మందికి పైమాటేనని వెల్లడించారు. వీరిలో 21 వేల మంది మాత్రమే వివిధ కేసుల్లో దోషులు కాగా 59 వేల మంది పైచిలుకు అండర్ ట్రైలర్లు. ఉగ్రవాదాన్ని ఎవ్వరూ సహించరు. సాక్ష్యాధారాలతో నేరం రుజువైనపక్షంలో నిందితులను చట్టప్రకారం శిక్షించొద్దనీ ఎవ్వరూ అనరు. అభ్యంతరమల్లా ఎలాంటి ఆధారం లేకపోయినా కేవలం అనుమానం పేరుతో టాడా, పోటా, మోకా, దేశ ద్రోహం వంటి కఠిన చట్టాలను ప్రయోగించి జైళ్లలో మైనారిటీలను అక్రమంగా నిర్బంధించడంపైనే. బెయిల్ సదుపాయం సైతం లేకుండా చేయని నేరానికి శిక్ష అనుభవించడం విషాదం. కేంద్రంలో బిజెపి వచ్చాక ఈ తరహా వ్యవహారాలు పెచ్చుమీరాయి. ఇలాంటి చర్యల వలన ఉగ్రవాదం అంతమొందదు సరికదా మరింత పెరగడానికి, బాధితుల్లో ప్రభుత్వాలు, సమాజం పట్ల వ్యతిరేక భావం ఏర్పడటానికి కారణమవుతాయి. ఉగ్రవాదులనైనా, నేరస్తులనైనా సమాజమే తయారు చేస్తుంది. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.

No comments:
Post a Comment