Wednesday, 27 April 2016

|| సిద్ధాంతకర్తగా రాజ్యాంగ నిర్మాత ||

         విజ్ఞానం మనిషి యొక్క మూఢ నమ్మకాలని పారద్రోలుతుంది. విజ్ఞానం అతడి విధుల్ని సక్రమంగా నిర్వహించడానికి ఉద్యుక్తుణ్ణి చేస్తుందని’ అంబేడ్కర్‌ అన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ‘అంబేడ్కర్‌ని ఆదరించని కాంగ్రెస్‌’ శీర్షికన ఏప్రిల్‌ 19న ఒక వ్యాసం రాశారు. కాంగ్రె్‌సను గురించి ఆయన చెప్పిన మాటల్లో సత్యాలున్నాయి. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ రాజకీయంగా కాంగ్రె్‌సను గాంధీని ఎదిరించాడు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ ఇలా అన్నారు. ‘గాంధీయుగం భారతదేశంలో చీకటి యుగమని నాకనిపిస్తోంది. ఈ గాంధీ యుగంలో ప్రజలు భవిష్యత్‌ ఆశయాలవైపు కాక పాత చీకటి యుగం వైపు తిరోగమిస్తున్నారు.

ప్రజలకు తమ గురించిన ఆలోచన ఆగిపోయిన యుగమిది. ఆలోచన ఆగిపోవడంతో వారి జీవితాలను పరిశీలించుకోవడం కూడా ఆగిపోయింది. పరిశీలన ద్వారా నేర్చుకోవడం అనే ప్రక్రియ దెబ్బతిన్న ప్రజాస్వామ్యం చీకటి రహదారులు వైపు పయనిస్తుంది. చీకటి యుగపు తంత్రాలు, ఉన్మాదాల వైపు ప్రజాస్వామ్యం పయనించడం ఎంత బాధాకర విషయం!’ అటువంటి వ్యవస్థను సరిదిద్దాలంటే పూర్తి చికిత్స అందించాల్సి వుంది. అంబేడ్కర్‌ కాంగ్రె్‌సతో పాటు సిద్ధాంతపరంగా ఆర్‌.ఎ్‌స.ఎస్‌., విశ్వహిందూ పరిషత్‌, జనసం్‌ఘను ఎదిరించిన విషయం చారిత్రక సత్యం. వెంకయ్యనాయుడు ఆర్‌.ఎ్‌స.ఎస్‌. దాని అనుబంధ విద్యార్థి సంఘం నుంచి ఆవిర్భవించిన నాయకుడు.

ఆయన అంబేడ్కర్‌ను నిర్లక్ష్యం చేసిన రెండో పార్శ్వాన్ని వదిలేశారు. నిజానికి అంబేడ్కర్‌ ‘నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించను’ అని ప్రకటించిన హేతువాది. ఈ రోజున భారతదేశంలో అస్పృశ్యత, కులం ఇంకా స్థిరీకృతమై ఉండటానికి కారణం ఆర్‌.ఎ్‌స.ఎస్‌. భావజాలమే. అంబేడ్కర్‌ సిద్ధాంతాలు ఆయనకు అర్థం కాలేదు. ఈయనకే కాదు ఆర్‌.ఎ్‌స.ఎస్‌ నుంచి వచ్చిన వారెవరికీ అంబేడ్కర్‌ సిద్ధాంతాలు అర్థం కావు. అంబేడ్కర్‌ను అవతారం చేసి పూజించాలని పెద్ద ప్రయత్నం జరుగుతోంది. నిజానికి అంబేడ్కర్‌ నిరంతరం ఆర్‌.ఎ్‌స.ఎ్‌సపై పోరాడారు. ఆర్‌.ఎ్‌స.ఎస్‌. హింసాత్మక ధోరణిని అంబేడ్కర్‌ ఆ రోజే బయటపెట్టారు.

ఆర్‌.ఎ్‌స.ఎస్‌. అనేక ప్రాంతాల్లో అస్పృశ్యులను అణచివేసింది. దేవాలయాల్లోకి రాకుండా నిరోధించింది. బి.ఆర్‌.అంబేడ్కర్‌ కలారామ్‌ దేవాలయాల్లోకి దళితులకు ప్రవేశం కల్పించాలన్నప్పుడు ఆర్‌.ఎ్‌స.ఎస్‌. ఆయుధాలతో అడ్డగించింది. ఇప్పటికీ కొన్ని లక్షల దేవాలయాల్లో దళితులకు ప్రవేశం లేదు. లక్షల గ్రామాల్లో రెండు గ్లాసులు హోటళ్ళలో వేలాడటానికి కారణం ఆర్‌.ఎ్‌స.ఎస్‌. హిందూవాదమే. ఈనాడు విశ్వవిద్యాలయాల్లో దళిత విద్యార్థుల మీద ఊచకోత నడుస్తున్నది. వీళ్ళు ముస్లిం ఉగ్రవాదానికి సంబంధించినవాళ్ళని, వీళ్ళు రావణుని వంటివాళ్ళు, నరకాసురుడు లాంటి వాళ్ళని, ఇటువంటి వాళ్ళను ఆత్మహత్య చేసుకున్నా, హత్యకు గురైనా అది వాళ్ళ తప్పే అని ప్రకటిస్తూ వచ్చారు.
అంబేడ్కర్‌ సెక్యులరిస్టుగా మానవ హక్కుల ఉద్యమం నిర్వహించారు. 1927 నుంచి అంబేడ్కర్‌ చరిత్రలో మలుపు వచ్చింది. అలాగే భారతదేశ చరిత్రలో కూడా మార్పు వచ్చింది. 1927లో జరిగిన మహద్‌ చెరువు పోరాట సందర్భంగా అంబేడ్కర్‌ మనుస్మృతిని దగ్ధం చేశాడు. ఇది భారతదేశంలోని విప్లవాత్మకమైన చర్య. అంతకాలం నమ్ముతూవచ్చిన కులాన్ని, అస్పృశ్యతను, దానికి మూలమైన మనుస్మృతిని తగులబెట్టడంతో ఒక్కసారిగా హిందూ సమాజం ఉలిక్కిపడి ఆయన వైపు చూసింది. అంతవరకూ ఉన్న నమ్మకాలపైన ఆ చర్య గొడ్డలి వేటు అయింది. అంతవరకు బ్రాహ్మణుల ఆధిక్యాన్ని నిర్ధారిస్తున్న మనుస్మృతి తగలబెట్టిన చర్య హిందూ రాజకీయ వ్యవస్థను కూడా కుదిపింది. ఆ రోజు నుండే అంబేడ్కర్‌ గాంధీకి కూడా వ్యతిరేకంగా నిలబడగలిగాడు.

మనుస్మృతిని తగులబెట్టిన సంఘటన సంచలనాత్మకమైంది. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ మనుస్మృతి దహనం తరువాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. ఇప్పటివరకు వచ్చిన సంస్కర్తలంతా అగ్రవర్ణాల కుటుంబ వ్యవస్థలో వచ్చిన తప్పును సరిదిద్దడానికి వచ్చిన వారేకానీ అసలు వర్ణ కుల వ్యవస్థే తప్పన్న వారు హిందూ సంస్కర్తలలో లేరని నిగ్గుదేల్చాడు. కుల వ్యవస్థ నుండి పుట్టిందే అస్పృశ్యత (వెలి విధానం). కులాలున్నంత కాలం అస్పృశ్య కులాలు (వెలివేయబడిన కులాలు) ఉంటూనే వుంటాయి. కుల వ్యవస్థ నిర్మూలన మాత్రమే అస్పృశ్యుడిని విముక్తి చేస్తుంది.
ఆ రోజులలో భారతదేశంలో అంబేడ్కర్‌తో వాదించగలిగిన వారు లేరు. గాంధీ ఉత్తర ప్రత్యుత్తరాలతో తలపడి ఓడిపోయాడు.

మానవులు మానవులకే జన్మిస్తారు. వర్ణాలకు, కులాలకు కాదని అంబేడ్కర్‌ నిగ్గుదేల్చాడు. మానవ పరిణామ శాస్త్ర అధ్యయనంతో ఆయన చెప్పిన మాటలు శూద్రులలో, అతిశూద్రలలో, సీ్త్రలలో కొత్త జ్ఞానానికి పునాది వేశాయి. 1930లో కలారాం దేవాలయం ప్రవేశ ఉద్యమం సందర్భంగా కూడా దేవాలయంలోకి దళితులకు వెళ్ళే హక్కు కోసం ఆయన పోరాడాడు. తరువాత ఆ దేవాలయాన్నే ఆయన నిరాకరించాడు. అంబేడ్కర్‌ వ్యక్తిత్వంలో ప్రధానమైన అంశం పోరాడే స్వభావం. ఆయన ఎక్కడా లొంగిపోలేదు. ఆయనది స్వతంత్య్రమైన వ్యక్తిత్వం. ఏ విషయాన్ని అయినా శాసీ్త్రయంగా ఆలోచిస్తాడు తప్ప ఏ భావానికి ఆధీనం కాడు. ఆయన ఇన్ని పోరాటాలలో కూడా చదువుతూ రాస్తూనే వచ్చాడు. ఆ రాత కూడా కీర్తి కోసమో, ప్రతిష్ఠ కోసమో రాసినది కాదు. పునర్నిర్మాణం కోసం రాసింది.

రాజకీయ అధికారమంటే ఆధిపత్యానికో, అవినీతికో అధర్మవర్తనకో, సంపదను పోగేసుకోవడానికో కాదు. అది మానవ సమాజ పునర్నిర్మాణానికి అని అంబేడ్కర్‌ ఉద్దేశం. అందుకే ధన సంపత్తికి కేంద్రంగా కాక ఆలోచనా కేంద్రంగా ఆయన రాజకీయ పార్టీని నడిపించాడు. 1946లో రాజ్యాంగ నిర్మాణంలోకి అడుగుపెట్టినపుడు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం కోసమే ఈ పనికి పూనుకున్నానని చెప్పాడు. భారతదేశంలో వ్యక్తిగత కక్షలు లేని రాజకీయ నాయకునిగా అంబేడ్కర్‌ నిలబడ్డాడు. గాంధీ, నెహ్రూ, పటేల్‌, రాజేంద్రప్రసాద్‌ లాంటి రాజకీయ నాయకుల్లో అనేక సందర్భాలలో వర్ణ, వర్గ, కుల ఆధిపత్య ద్వేష స్వభావాలు బయటపడ్డాయి. ఆ స్వభావాల వల్ల అనేక సందర్భాలలో దేశం కకావికలం కూడా అయింది. అంబేడ్కర్‌ లౌకికవాద వ్యక్తిత్వం ఇందుకు భిన్నమైనది.
డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ రచనలలో జ్ఞానం ఉంటుంది. ఆయనొక జ్ఞాన స్రవంతి. ఆయనొక విజ్ఞాన సర్వస్వం. ఆయనొక సందర్భంలో ‘‘మామూలు మనిషి చిన్న కాలువ వంటివాడు. మహాపురుషుడు నది లాంటివాడు’’ అని చెప్తూ తన జీవితం గురించి ఇలా చెప్పాడు. ‘‘నీవు చూస్తున్న నా జీవితం ఒంటరిది. నేను సంపూర్ణమైన ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను. 12 సంవ త్సరాల నుంచి సంసార జీవితానికి దూరంగా వున్నాను. కానీ నేను ఎప్పుడూ ఆనందానికి దూరం కాలేదు. నేను సంపూర్ణమైన, సుఖవంతమైన జీవితాన్ని గడిపాను.

నా జీవితం యొక్క రహస్యమేమంటే ఉత్తమ జీవితం గడపడమే’’. జ్ఞానాన్ని సందపాదించడం, క్రమశిక్షణలో ఉండటం, సమాజ హితం కోసం జీవితాన్ని ఫణంగా పెట్టడం. ఏ మనిషైతే పై మూడింటిని జీవన లక్ష్యాలుగా చేసుకొని జీవితాన్ని గడుపుతాడో అతను ఎప్పటికీ దు:ఖితుడు కాడు. జ్ఞానం అనేది సుఖ జీవన స్థానం. జ్ఞానం అధ్యయనంలో లభిస్తుంది. ఏకాంత జీవనంలో అది లభిస్తుంది. జ్ఞానం నిరంతరం విస్తృతం అవుతూ ఉంటుంది. జ్ఞానం నిప్పులాంటిది.

దాన్ని ముందుగా ఒకసారి మండించాలి. తర్వాత అది తనంతట తానే పెరుగుతూపోతుంది. పండితుల్లో కూడా జ్ఞాన సముపార్జన ఒకసారి మొదలైతే ఇక అది అనంతంగా సాగుతూపోతుందని అంబేడ్కర్‌ అన్నారు. బీజేపీ వారు అంబేడ్కర్‌ పుట్టిన స్థలాలన్నీ పుణ్యక్షేత్రంగా మార్చడం కంటే ఆయన తీసుకున్న బౌద్ధ దీక్ష కార్యక్రమాలు నిర్వహించవచ్చు కదా!

బీజేపీ పంచాయతీలను బలోపేతం చేయడంలో కూడా కులాధిపత్య భావమే వుంది. భారతదేశ వ్యాప్తంగా అగ్రకులాలు పంచాయితీల మీద పెత్తనం చేస్తున్నాయి. పంచాయితీ అంటే అది కుల పంచాయితే. కోర్టుల వరకు వెళ్ళకుండా ఎన్నో పంచాయితీల్లో క్రింద కులాలకు వాళ్ళే శిక్షలు వేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులన్నీ అగ్రవర్ణాలు నివసించే ప్రాంతాలకే పరిమితం చేసి దళిత వాడలకు కరెంటు, నీరు, విద్యనందించడం లేదు. పంచాయితీల్లో రామమందిరం నిర్మించి హిందూవాదాన్ని గ్రామాల్లోకి తీసుకువెళుతున్నాయి. బీజేపీ దళిత వ్యతిరేక ఎజెండాను నిర్వహిస్తుంది. అంబేడ్కర్‌ ప్రధానమైన ఎజెండా కుల నిర్మూలన. వీరందరూ కులాన్ని స్థిరీకృతం చేసే పనిలో ఉన్నారు.

వెంకయ్యనాయుడు ఈ సందర్భంగావందమంది మేధావులను కొలంబియా విశ్వవిద్యాలయానికి బ్రిటన్‌లోని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌కు అధ్యయనానికి పంపుతానంటున్నారు. మరి భారతదేశంలోని దళిత రీసెర్చి స్కాలర్స్‌కు ఇస్తున్న రాజీవ్‌గాంధీ ఫెలోషి్‌పగానీ, మరి ఇతర స్కాలర్‌షి్‌పలన్నీ ఎందుకు ఆపారు? డాక్టరేట్‌ అయినవారికి పోస్టు డాక్టరేట్‌ చేసే సీట్లను కాంగ్రెస్‌ హయాంలో కంటే అతి తక్కువగా ఎందుకు తగ్గించారు. దళిత విద్యార్థులను ఎక్కువ బాధిస్తుంది, వేదిస్తుంది.

ఆర్‌.ఎ్‌స.ఎస్‌. బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న ప్రొఫెసర్లు, హెచ్‌.ఓ.డి.లనేది నిష్ఠుర సత్యం కాదా! అంబేడ్కర్‌ భారతజాతి ఆస్తి అన్నప్పుడు మీ కార్యక్రమాల్లో అస్పృశ్యతా నివారణ, కుల నిర్మూలనా ఎజెండా ఎక్కడుంది? అందుకోసం నిర్దిష్టమైన ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? అస్పృశ్యులను మీరు ఓటర్లుగా చూస్తున్నారు. అందుకే ఆకర్షణీయ పథకాలు పెడుతున్నారు. కానీ చిత్తశుద్ధితో, పశ్చాత్తాపంతో ఒక్క కార్యక్రమమైనా మీరు నిర్వహిస్తున్నారా! భారతీయులు ఈ రోజు రెండు విభిన్న సిద్ధాంతాలలో నియంత్రింపబడుతున్నారు.

రాజ్యాంగంలో రాసుకున్న ప్రమాణములో వారి రాజకీయ ఆదర్శం ఉంది. ఈ ప్రమాణం పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తుంది. అయితే వాళ్ళ సామాజిక ఆదర్శం వారి మతంలో కూరుకుపోయింది. ఈ ఆదర్శం స్వేచ్ఛ సమానత్వ సౌభ్రాతృత్వాలను తృణీకరిస్తుందని అంబేడ్కర్‌ అన్నారు. బీజేపీ వారు నమ్రతగా అంబేడ్కర్‌ సిద్ధాంతాలను వెలివేయాలని చూస్తున్నారు. అందువల్ల వారు మరింతగా అంబేడ్కర్‌ను వక్రీకరించినవారవుతారు. వారు మరో అవతారాన్ని తయారు చేసుకుంటున్నారు. పూజ వల్ల ఏ తత్వవేత్తకు న్యాయం జరగదు. ఆచరణే అన్ని మాటలకు గీటురాయి. అంబేడ్కర్‌ది చార్వాకుల హేతువాదం, సాంఖ్యుల కార్యకారణవాదం, బౌద్ధుల నీతివాదం అన్నీ కలిసిన కుల నిర్మూలనా సిద్ధాంతం, అవతారం కాదు. ఇప్పటికే 33 కోట్ల మంది దేవతలు హిందువులకు ఉన్నారు. ఇంకా అంబేడ్కర్‌ అవతారం ఎందుకు? ఆయన్ని సిద్ధాంతకర్తగానే చూడండి! భారతదేశానికి మేలు జరుగుతుంది. మాటలు చెప్పడంలో వెంకయ్యనాయుడు గారికి నైపుణ్యం ఉంది. కానీ ఆచరణ ఏమిటని? అంబేడ్కర్‌ చూపుడు వేలు ప్రశ్నిస్తుంది. - డాక్టర్‌ కత్తి పద్మారావు

No comments:

Post a Comment