|| మైనారిటీలు - ప్రజాస్వామ్యం ||
మైనారిటీలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉంటారు. వారు భాషాపరంగా కావచ్చు, రంగు పరంగా కావచ్చు, ప్రాంతీయపరంగా కావచ్చు, కులపరంగా కావచ్చు మతపరంగా కావచ్చు. ఒక గ్రామాన్ని తీసుకున్నా కూడా ఏదో ఒక విధమైన మైనారీటీలు ఉంటారు. అలా ఏదో విధంగా మైనారీటీలుగా ఉన్నవారిని మెజారిటీ మతస్తులు హింసించడం, హక్కుల్ని కాలరాయడం, మెజారిటీ వర్గం చెప్పినట్లుగానే మాట్లాడమని, తినమని, ప్రవర్తించమని చెప్పడం ఏ విధంగా చూసినా అమానుషం. ప్రతి వర్గానికీ తమతమ సంస్కృతి సంప్రదాయాలుంటాయి. అన్ని వర్గాల వారి సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూనే అన్ని రంగాలలో సమాన హక్కులు కల్పించడమే ప్రజాస్వామ్యం. అన్ని దేశాల్లో మతపరంగా మెజారిటీలు, మైనారిటీలు ఉన్నారు. కనుక సంస్కృతి, సంప్రదాయాలను స్వేచ్ఛగా నిర్వర్తించుకోగలిగిన పరిస్థితులు, సమాన అవకాశాలు కల్పించవలసిన బాధ్యత ఆయా ప్రభుత్వాల మీద ఉంది. మైనారిటీలుగా ఉన్నవారి మీద మెజారిటీ వర్గీయులు ఏ విధమైన ఒత్తిడినీ తీసుకొని రాకూడదు. అప్పుడే ఏ స్వామ్యమైనా ప్రశాంతంగా, సుభిక్షంగా, ఆనందంగా మనగలుగుతుంది.
ఇక భారతదేశంలో హిందువులు మెజారిటీలుగా, ముస్లిము, క్రిష్టియన్, సిక్కు, ఇతరులు మైనారిటీ మతస్తులుగా ఉన్నారు. ఏ దేశంలో అయినా మైనారిటీల హక్కులు కాపాడటానికి ప్రత్యేక చట్టాలున్నాయి. వాటిని ఆచరించగలిగే సమర్థ ప్రభుత్వాలున్నాయి. అయితే ఇక్కడ మైనారీటీలకు ప్రత్యేక చట్టాలంటూ పరిమిత స్థాయిలో ఉన్నా వాటిని ఆచరించగలిగే పరిస్థితులు, సమర్థ నాయకత్వం లేదు. భారతదేశానికి స్వాతంత్య్రం లభించినప్పటి నుంచీ మతకలహాల పేరిట కొన్ని వేల మంది ముస్లిములు, సిక్కులు, క్రిష్టియన్లు బలైపోయారు. ఎక్కడా వారికి న్యాయం జరిగిన సందర్భాలు చాలా తక్కువ. వారి ప్రయివేటు ఆస్తులు దోచుకోబడ్డాయి. వక్ఫ్ ఆస్తులు, మసీదు, దర్గా ఆస్తులు ఆక్రమించబడ్డాయి. అన్ని రంగాలలో ముస్లిములు అణగదొక్కబడుతున్నారు. అట్టడుగున ఉన్నారని సచార్ కమిషన్, మిశ్రా, తదితర కమిషన్లు నిష్పక్షపాతంగా చెప్పాయి. కాని వారి సూచనలను పరిగణించే స్థితి లేదు. ఇందుకు ముస్లిములకున్న నాయకత్వ లోపం, సంఘంలో కొరవడిన ఐక్యత, అంతర్జాతీయ స్థాయిలో లాంబీయింగ్ చేసుకోలేకపోవడం, తగ్గిన పోరాట పటిమ, అభద్రతా భావం ముఖ్యకారణాలు. ఇక్కడి నుంచి ముస్లిము దేశాలకు వలసవెళ్లిన హిందువులు ఆయా దేశాలలోని స్థానిక ముస్లింల కంటే భద్రతా భావంతో, ఆర్థిక బలంతో జీవిస్తుండగా ఇక్కడే పుట్టి పెరిగి, ఇక్కడే చస్తున్న ముస్లిములకు ఎక్కడా సమాన అవకాశాలు, సమాన భద్రత దొరకడం లేదు. ఇది చాలా శోచనీయం. అక్కడ మైనారిటీలకు పూర్తి రక్షణ, ఎవరైనా వారి మీద అరాచకాలు జరిపితే శిక్షించగలిగిన సమర్థ నాయకత్వం ఉంటాయి. ఉదాహరణకు బంగ్లాదేశ్లో ఒక హిందువును చంపినందుకు ఎనిమిది మంది ముస్లిములకు మరణశిక్ష వేసినట్లు ఈ మధ్యనే పేపర్లో వచ్చింది. మరి ఇక్కడి పరిస్థితులు ఎంత నిస్సహాయమో, నిరాశాజనకమో ఆలోచించుకోవాలి. మా మనుగడ కోసం పోరాడటంతోనే మా బతుకులు తెల్లారుతున్నాయి. హిందువుల్లో అత్యధికులు లౌకికవాదులు. వారు ఏమతస్థులనైనా తమతో కలుపుకుని, వీలైతే అన్యమత దేవుళ్లను కూడా తమ మత దేవుళ్లలో ఒకరిగా ఆరాధించగలిగే ఉదాత్తులు. అలా ఉండబట్టే భారతదేశంలోని పలు మైనారిటీ మతస్తుల ప్రార్థనా స్థలాలు ఈ మాత్రం మనుగడ సాగించగల్గుతున్నాయి. హిందువుల్లోని చాలా తక్కువ శాతం మంది ఎక్కువగా ఉన్న లౌకికవాదులను రెచ్చగొట్టి కొన్ని అరాచక సంస్థలు స్థాపించి ప్రతి చిన్న విషయానికీ మైనారిటీలపై దౌర్జాన్యానికి దిగుతున్నారు. అలా దౌర్జాన్యానికి ప్రేరేపిస్తున్న అతి తక్కువ మందిని ''మాకెందుకులే, వీళ్లతో మనమెందుకు పెట్టుకోవాలి'' అనే భావంతో లౌకికవాదులు నిలువరించలేకపోవడంతో అందరూ సమర్థిస్తున్నారని భావించి ఈ అరాచక శక్తులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. నాకు తెలిసి ఏ నిజమైన హిందువూ మసీదునుకానీ, చర్చీనిగానీ, అన్యమతస్తుల ప్రార్థనా స్థలాలనుగానీ పడగొట్టడం కాదు గదా కనీసం అవమానించడం కూడా చేయరు. అలాగే ఇస్లాం మతంలోనూ అంతే. అతి తక్కువ శాతం మంది మాత్రమే మనం ఇప్పుడు అంటున్న ఉగ్రవాదాన్ని అనుసరిస్తున్నారు. ఈ మతంలోని లౌకికవాదులకు వారిని నిలువరించే స్థాయి ధైర్యం ఉండవు. అయితే కొద్దిమంది చేసే ఉగ్రవాదాన్ని మొత్తం మతానికి అంటగడుతున్నారు. ఇతర మతాల్లో అలా జరగడం లేదు. ఇక ఈ మధ్య కాలంలో మరో కొత్త పోకడ వచ్చింది. మైనారిటీలు ఏది మాట్లాడాలో, ఏది తినాలో, ఎలా ఉండాలో నిర్థారించే స్థాయికి అరాచక శక్తులు వచ్చాయి. అలావారు చెప్పినట్లు ప్రవర్తించకపోతే దేశం వదిలి వెళ్లిపోవాలని అంటున్నారు.
మైనారిటీలకు తమ మీద జరుగుతున్న ఆరాచకాలకు సాక్ష్యాలను సేకరించి న్యాయస్థానాల్లో పోరాడే ఆర్థికబలం, సంఘబలం, ఇతరత్రా బలాలు లేవు. అధికారులు నిష్పక్షపాతంగా కేసులు రాసినా, ఈ అరాచక సంస్థలు ఏదో విధంగా ఒత్తిడి తెచ్చి న్యాయస్థానాల్లో కేసులు ఓడిపోయేట్లు చేస్తారు. ఎవరైనా సంఘ సేవకులు గట్టిగా ప్రయత్నిస్తే, వారి మీద రకరకాల ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. మైనారిటీల మీద జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలకు సంబంధించి అమెరికా విదేశాంగశాఖ ఈ మధ్యనే వివరంగా నివేదిక ఇచ్చింది. ఏ దేశంలో ఏ మతస్తులు మైనారిటీలుగా ఉన్నా వారి సంపూర్ణ భద్రతకు ఐక్యరాజ్యసమితిలో కూడా చర్చలు జరిపి తగిన చర్యలు తీసుకోవాలి.
- డాక్టర్ హబీబుర్రహ్మాన్ (వ్యాసకర్త రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్(ఎహెచ్)

No comments:
Post a Comment