|| ఏ అంబేర్‌ద్క? ||
ఏప్రిల్ 17వ తేదీనాటి ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక 'ఆర్గనైజర్' కవర్ పేజీపై బిఆర్ అంబేద్కర్ చిత్రాన్ని ప్రచురించారు. 'అంతి మంగా ఐక్యపరిచేవాడు' అని ఆయనను కీర్తించారు. ఆ సంచి కలో అంబేద్కర్ గురించి అనేక వ్యాసాలు న్నాయి. ఒక వ్యాసం 'జాతి నిర్మాణా న్ని పటిష్టపరిచేవాడు' అని పేర్కొంటే, మరో వ్యాసం ఆయన 'దృక్కోణం, క్రియా శీలతలు బ్రహ్మ సమాజాన్ని, ప్రార్థనా సమాజాన్ని, ఆర్య సమాజాన్ని పోలి ఉన్నాయి' అని వివరించింది. కార్మికుల హక్కుల కోసం పోరాడిన యోధుడని మూడవ వ్యాసం అంటే, ఆయనను 'కాలాతీతుడు' అనీ, ఆయన బ్రాహ్మణుల వ్యతిరేకి కాదనీ, 'బ్రాహ్మణ వ్యవస్థకు మాత్రమే ఆయన వ్యతిరేకి' అని నాలుగవ వ్యాసం అభివర్ణించింది. ఆ సంచికలోని అన్ని వ్యాసాలూ ఆయనను కీర్తించేవే. అయితే అంబేద్కర్ జీవిత కాలంలో ఆర్‌ఎస్‌ఎస్, ఆ సంస్థ ప్రచురించే పత్రిక ఆయన గురించీ, ఆయన రచనల గురించీ ఏమన్నాయి? దీనికి సమాధానం వెతకటం కోసం నేను 1949-50 సంవత్సరాల మధ్య కాలాన్ని ఎంచుకున్నాను. ఆ కాలంలో అంబేద్కర్ భారత న్యాయ శాఖా మంత్రిగా ఉన్నాడు. ఆయన భారత రాజ్యాంగానికి తుది మెరుగులు దిద్దుతున్నాడు. మహిళలకు మరిన్ని హక్కులను కల్పించటానికి హిందూ పర్సనల్ చట్టాలను సంస్కరించేందుకు ఆయన ప్రయత్నిస్తున్న కాలమది. ఆ ప్రయత్నాలను ఆర్‌ఎస్‌ఎస్ ఆమోదించలేదు. రాజ్యాంగ పరిషత్తు ఆమోదం కోసం అంబేద్కర్ సమర్పించిన రాజ్యాంగ తుది ముసాయిదాపై 1949 నవంబరు 30వ తేదీన 'ఆర్గనైజర్' పత్రిక ఒక సంపాదకీయం రాసింది. ఆ సంపాదకీయం ఇలా పేర్కొన్నది. 'భారత నూతన రాజ్యాంగంలో ఏమాత్రం భారతీయత లేకపోవటం చాలా ధారుణం. పురాతన భారతీయ రాజ్యాంగ సూత్రాలు, సంప్రదాయాలు, పరిభాష, పదబంధాలు దానిలో మచ్చుకైనా కానరావు'. 'పురాతన రాజ్య పాలనకు సంబంధించిన ప్రశస్తమైన విషయాలుగానీ, గ్రీకు నాగరికతలోని స్పార్టాకు చెందిన లైకుర్గస్ లేక పర్షియాకు చెందిన సొలోన్‌ల కంటే చాలా ముందుగా రాయబడిన మనుధర్మ శాస్త్ర నియమాలనుగానీ నూతన రాజ్యాంగంలో పేర్కొనలేదు. మనువు రాసిన సూత్రాలను భారతదేశంలోని హిందువులు నేటికీ అప్రయత్నపూర్వకంగా వినమ్రంగా అనుసరిస్తారు. అయినప్పటికీ మన రాజ్యాంగాన్ని రాసిన పండితులకు అవేమీ పట్టవు' అని ఆ ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక రాసింది.
ఆ సంపాదకీయంలో అంబేద్కర్ పేరును ఉటం కించలేదు. అయినప్పటికీ రాజ్యాంగాన్ని రూపొందించిన వారిలో అత్యంత కీలకమైన వ్యక్తిగా అంబేద్కర్ ఆర్‌ఎస్‌ఎస్ దాడికి కేంద్రకంగా మారాడు. హిందూ పర్సనల్ లాను సంస్కరించటానికి అంబేద్కర్ చేసిన ప్రతిపాదనలను సంఫ్‌ు తీవ్రంగా విమర్శించింది. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత ఎమ్‌ఎస్ గోల్వాల్కర్ 1949 ఆగస్టు నెలలో మాట్లాడుతూ అంబేద్కర్ ప్రతిపాదించిన సంస్కరణలలో 'భారతీయత అనేదే లేదు. ఈ దేశంలో వివాహం, విడాకులు వంటి విషయాలు అమెరికా, బ్రిటన్‌ల మాదిరిగా ఉండజాలవు. హిందూ సంస్కృతి, నియమాల ప్రకారం వివాహం అనేది ఒక సంస్కారం. ఎప్పుడంటే అప్పుడు మార్చటానికి ఇది ఒక 'ఒప్పందం' కాదు. దీన్ని మరణం కూడా మార్చలేదు' అని గోల్వాల్కర్ ప్రవచించాడు. తన వాదనను కొనసాగిస్తూ ఆయన ఇలా అన్నాడు. 'దేశంలోని కొన్ని ప్రాంతాలలో హిందూ సమాజంలోని కొన్ని కింది కులాలలో విడాకులు తీసుకోవటం ఆచారంగా ఉందనుకోండి. అయితే అలాంటి ఆచారాన్ని అందరూ అనుసరించదగిన ఆదర్శంగా భావించ లేము(ఆర్గనైజర్, సెప్టెంబర్ 6,1949). 1949 నవంబరు 2వ తేదీన ఆర్గనైజర్ ప్రచురించిన వ్యాసంలో హిందూ కోడ్ బిల్లు గురించి రాశారు. హిందూ కోడ్ బిల్లు 'హిందువుల విశ్వాసాలపై ప్రత్యక్ష దాడి'గా ఆ వ్యాసంలో అభివర్ణించారు. 'మహిళలకు విడాకుల హక్కును ఇవ్వటం హిందూ భావజాలానికి వ్యతిరేకం'. 'హిందూ కోడ్ బిల్లు' పేరుతో 1949 డిసెంబరు 7వ తేదీన ఆర్గనైజర్‌లో రాసిన సంపాదకీయం ఇలా పేర్కొంది. 'హిందూ కోడ్ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే అది అనైతిక విదేశీ నియమాల ఆధారంగా హిందూ మతాన్ని అవహేళన చేసేదిగా ఉన్నది. అది హిందూ కోడ్ బిల్లు కాదు. అది ఏదైనా కావచ్చుగాక హిందూ మాత్రం కాదు. హిందూ చట్టాలకు, హిందూ సంస్కృతికి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా చేసిన క్రూరమైన అజ్ఞానపూర్వక నింద అది'. ఆ తరువాత ఈ సంస్కరణలు ఎవరి కోసం చేయదలి చారనే విషయంపై సదరు సంపాదకీయం తన దృష్టిని సారించింది. 'కొందరు విధవలు, విధురులు, గొడ్రాళ్ళయిన స్త్రీలు, ముసలి పెళ్ళి కొడుకులు అందరూ కలిసి కొందరి చిత్త చాపల్యం కోసం మన పురాతన నియమాలను కుళ్ళ బొడుస్తున్నారు' అని ఆ సంపాదకీయం పేర్కొంది. ఆ తరువాత ఆ సంపాదకీయం హిందూ కోడ్ బిల్లును రూపొందించిన ఇద్దరిపై వ్యంగ్యంగా 'రుషి అంబేద్కర్, మహర్షి నెహ్రూ' అని వర్ణించింది. వారి సంస్కరణలు 'సమాజాన్ని చీలికలు, పీలికలుగా మారుస్తాయనీ, ప్రతి కుటుంబాన్నీ కళంకితంచేసి అవలక్షణాలకు ఆలవాల మయ్యేలా చేస్తాయనీ రాసింది. హిందూ కోడ్ బిల్లు కుటుం బాలను విడదీస్తుందనీ, వారసత్వ ఆస్తికి సంబంధించి అన్నను చెల్లెలికి వ్యతిరేకిని చేస్తుందనీ ఆర్గనైజర్ భావించింది. పురాతన హిందూ స్మృతికారుల, రుషుల వివేచనను సమర్థించే పేరుతో అన్ని రకాల పితృస్వామ్య భావజాలాన్ని ఆర్‌ఎస్‌ఎస్ బలపరిచింది. అంతకు ముందు కాలంలో మహిళలకు అందుబాటులోలేని భర్తను ఎంచుకునే హక్కు, క్రూరులైన భర్తలకు విడాకులిచ్చే హక్కు, ఆనువంశికంగా వచ్చే ఆస్తిలో వాటాను పొందే హక్కులను కల్పించే హిందూ కోడ్ బిల్లులోని అంశాలు ఆర్‌ఎస్‌ఎస్‌ను చికాకు పరిచాయి.
ఆర్‌ఎస్‌ఎస్ హిందూ కోడ్ బిల్లుపై పూర్తి స్థాయిలో దాడి చేయటం మొదలెట్టింది. బిల్లును అడ్డుకోవటానికి వందలాది ప్రదర్శనలను, ధర్నాలను, హర్తాళ్ళను నిర్వహించింది. సంతులు, సన్యాసులు ఉపన్యాసకులుగా అవతారం ఎత్తేలా చేసింది. వీరిలో ఒక ఉపన్యాసకుడు ఇలా చెప్పాడు. 'ఈ బిల్లును రూపొందించిన బిఎన్ రావు, ఈరోజు పార్లమెంటులో ఈ బిల్లుకు మార్గదర్శకత్వం వహించిన అంబేద్కర్- వీరిద్దరూ తాము హిందువులము కాదని ప్రకటించుకున్నారు. వీరు హిందూ మతచారాలను పాటించకుండా వివాహాలు చేసుకున్నారు. అలాంటి వ్యక్తులకు హిందూ ధర్మాన్ని 'సంస్కరించే' బాధ్యతను అప్పగించటం విషాదకరమే కాకుండా రాక్షసత్వం కూడా'(ఆర్గనైజర్, డిసెంబరు14, 1949). హిందూ కోడ్ బిల్లుకు వ్యతిరేకంగా నెలల తరబడి నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆర్గనైజర్ పత్రిక ఈ విషయం గురించి అనేక వ్యాసాలను ప్రచురించింది. 'నెహ్రూ, అంబేద్కర్‌లు కలలో కూడా ఊహించజాలని విషయాలెన్నో హిందూ ధర్మంలోనూ, న్యాయ సూత్రాలలోనూ ఉన్నాయి' అని ఒక వ్యాసంలో రాశారు. 1950 జనవరి 11వ తేదీ ఆర్గనైజర్ సంచికలో కెడిపి శాస్త్రి రాసిన ఒక సుదీర్ఘ లేఖను ప్రచురించారు. అదే కాలంలో 'ఫ్రీ ఇండియా' అనే పత్రికలో ప్రచురితమైన వ్యాసంలో అంబేద్కర్‌ను 'ఆధునిక భారత మనువు'గా అభివర్ణించటం జరిగింది. ఆ పత్రికలో అలా చేసిన వర్ణనపై వ్యాఖ్యానిస్తూ ఆ లేఖ ఈ విధంగా అభిప్రాయపడింది. 'ఒక మరుగుజ్జును మహాశిఖరంతో పోల్చటంగా దీనిని పేర్కొనవచ్చు. మహాజ్ఞాని, భగవత్ స్వరూపుడైన మనువుతో డాక్టర్ అంబేద్కర్‌ను పోల్చటం నిజంగా హాస్యాస్పదం. ఈ మధ్యకాలంలో హిందూమతానికి అంబేద్కర్ చేసిన నష్టం అందరికీ తెలిసిందే'. అంబేద్కర్ హిందూమతాన్ని త్యజించి బౌద్ధమతావలంబకుడుగా మారటం, 1947వ సంవత్సరానికి ముందు పాకిస్తాన్ అనుకూల బెంగాలీ దళితనాయకుడు జోగెన్ మండల్‌కు సహకరించటం వంటి విషయాలకు ఇది పరోక్ష సూచిక. 'అంబేద్కర్ ప్రస్తుతం గౌరవనీయుడైన భారతీయుడే కావచ్చు. అయితే ఏ పవిత్ర కాలంలోనైనా ''మనువు'' హోదాను ఆయన అందు కోజాలడు!' అని ఆ లేఖ పేర్కొన్నది.
వ్యక్తుల మాదిరిగా సంస్థలకు కూడా తమ దృక్పథాన్ని మార్చుకునే హక్కు ఉంటుంది. అయితే దృక్పథంలో అలాంటి మార్పు ఎందుకు జరిగిందో నిజాయితీగా వివరించాలి. వాస్తవం చెప్పాలంటే అంబేద్కర్ న్యాయ శాఖా మంత్రిగా ఉండి, రాజ్యాంగాన్ని రూపొందిస్తున్న కీలక తరుణంలో ఆర్‌ఎస్‌ఎస్ ఆయననూ, ఆయన భావాలనూ తూలనాడింది. 1949 నవంబరులో ప్రచురితమైన ఆర్గనైజర్ వ్యాసం సూచించినట్టుగా ఆర్‌ఎస్‌ఎస్‌కు కావలసింది 'విధేయత, అనుగుణ్యత'. హిందూ సంస్కృతికీ, సంప్రదాయాలకూ, విలువలకూ ఇవే ప్రతీకలని సంఫ్‌ు పరివార్ నిర్వచిస్తుంది. సమతావాది, పితృస్వామ్య ద్వేషి, ప్రగతికాముకుడైన అంబేద్కర్ వీటిని సహజంగానే ఎన్నటికీ అంగీకరించడు.
- రామచంద్ర గుహ

No comments:
Post a Comment