|| విజయాల్లో సున్నా వైఫల్యాల్లో మిన్న ||
# హద్దుల్లేని అసహనం-ఇదీ మోడీ రెండేళ్ల పాలన #
కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లుపూర్తి చేసుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలకు అనేక వాగ్దానాలు చేసింది. ప్రజల్లో ఎన్నో ఆశలు రేకెత్తించింది. ఈ రెండేళ్ల్లలో మోడీ ప్రభుత్వం ఆ హామీలను ఏమేరకు అమలు చేసింది? ప్రభుత్వ పనితీరు ఏ విధంగా వుంది? విజయాలు, వైఫల్యాలు వంటి అంశాలు ప్రధానంగా చర్చనీయాంశమయ్యాయి. మోడీ ప్రభుత్వ రెండేళ్ల పనితీరు గురించి ఒక్కసారి పరిశీలించి చూస్తే నల్ల ధనం దగ్గర నుంచి మేకిన్ ఇండియా దాకా సమస్త రంగాల్లోనూ వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఈ రెండేళ్ళళక్ష దేశంలో కన్నా విదేశాల్లోనే ప్రధాని ఎక్కువగా పర్యటించారు. విదేశాంగ విధానాన్ని అమెరికా అనుకూల విధానంగా మార్చేశారన్న విమర్శలు వున్నాయి. మోడీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన జనధన్ యోజన, స్టార్టప్, స్టాండప్, స్వచ్ఛ భారత్ వంటివి ప్రచారార్భాట పథకాలుగానే మిగిలిపోయాయి.
# జనధన్ యోజన #
మోడీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన జన ధన్ యోజన బ్యాంకు ఖాతాలు తెరవడానికే పరిమితమైంది. సబ్సిడీ నేరుగా బ్యాంకు అకౌంట్‌లో జమ చేసేందుకు ఉద్దేశించిన ఈ పథకం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది. ఖాతాలైతే రికార్డు సంఖ్యలో తెరిచారు. కానీ, ఒక్క ఖాతాకు కూడా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం జమ చేసిన పాపాన పోలేదు.
# స్వచ్ఛభారత్ #
మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన స్వచ్ఛభారత్ కార్యక్రమం పత్రికల్లో ఫొటోలకు పనికొచ్చిందే తప్ప క్షేత్ర స్థాయిలో చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేకపోయింది. అందరికీ వ్యక్తిగత మరుగుదొడ్డు, చెత్తా చెదారం తొలగింపునకు తగిన నిధులను కేటాయించక పోవడం వల్ల స్వచ్ఛభారత్ అనేది ఒక ప్రహసనంగా మారింది.
# నల్ల ధనం ఊసే లేదు, మాల్యాకు సహకారం #
మాల్యా లాంటి రుణ ఎగవేత దారులకు, అమితాబ్ లాంటి పన్ను ఎగవేత దారులకు మోడీ ప్రభుత్వం బాహాటంగానే కొమ్ముకాసింది.తాము అధికారంలోకి వస్తే 75 లక్షల కోట్ల నల్దధనాన్ని వెనక్కి తెచ్చి దేశంలో ప్రతి ఖాతాలో 15 లక్షల చొప్పున జమ చేస్తానని చెప్పిన మోడీ అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. పైగా నల్లధనులకు రక్షణగా ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొచ్చింది. 2017 వరకు నల్లధనుల జోలికి వెళ్లేది లేదని తెగేసి చెప్పింది. పనామా పత్రాల్లో బయటపడ్డ అమితాబ్ బచన్‌కు రెండేళ్ల పాలన పూర్తి సందర్భంగా నిర్వహించే మెగా ఈవెంట్‌లో భాగస్వామిని చేసింది. బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణాలను ఎగ్గొట్టిన మాల్యా దేశం వీడి పారిపోవడానికి ప్రభుత్వం పరోక్షంగా సహకరించింది.
# భూ సేకరణపై ఆర్డినెన్సుల ప్రహసనం #
రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల భూ బిల్లును తీసుకొచ్చేందుకు మోడీ ప్రభుత్వం విఫలయత్నం చేసింది. ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా, రాజ్యసభలో తగినంత మెజార్టీ లేకున్నా దీనిపై మొండిగా ముందుకెళ్లింది. ఆర్డినెన్సుల మీద ఆర్డినెన్సులు జారీ చేసింది.
# పఠాన్‌కోట్ దాడి #
దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదని పదే పదే ప్రకటించిన మోడీ ప్రభుత్వం దేశ రాజధానికి చేరువలోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేస్తే దానిని ముందుగా పసిగట్టడంలోను, దాడిని తిప్పికొట్టడంలోనూ అసమర్థంగా వ్యవహరించి అభాసుపాలైంది. ఎవరైతే దాడి చేశారో వారినే పఠాన్ కోట్‌లో దర్యాప్తునకు ఆహ్వానించి విమర్శలపాలైంది.
# భారత్- పాక్ సంబంధాలు #
భారత్- పాక్ సంబంధాలు ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన మోడీ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల పునరుద్ధరణ ప్రక్రియపై నిలకడైన విధానం అనుసరించడంలో విఫలమైంది.
# హద్దుల్లేని అసహనం #
పన్సారే నుంచి కల్బుర్గి హత్యలు, దాద్రీ ఘటన, హెచ్‌సియు, జెఎన్‌యు వర్సిటీలపై దాడులు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో పెరిగిన అసహన ధోరణులకు ప్రతీకలు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత స్కాలర్ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ ఎలా పురిగొల్పినదీ లేఖల్లో బయటపడింది.వామపక్ష విద్యార్థి ఉద్యమాలకు కేంద్రమైన జెఎన్‌యుపై దాడి చేసి కన్నయ్యకుమర్, అనిర్బన్, ఉమర్ ఖలీద్‌లపై దేశ ద్రోహ నేరం మోపి కక్షసాధింపు చర్యలకు దిగింది. చివరికి విద్యార్థులు ఉద్యమించడంతో తోకముడిచింది. అంతకుముందు ఎఫ్‌టిఐఐ, మద్రాసు ఐఐటిలో అంబేద్కర్ పెరియార్ స్టడీసర్కిల్ పైన, అలీగఢ్ ముస్లిం వర్శిటీపైన ఆరెస్సెస్, బిజెపిలు ఒక పథకం ప్రకారం దాడి చేశాయి.

No comments:
Post a Comment