Sunday, 1 May 2016

|| సమస్త దోపిడీ పీడనల నుండి ప్రపంచానికి విముక్తి ||

--------------------------------
అదే మేడే విప్లవదీక్షా స్ఫూర్తి!!
---------------------------------

        ''ఒకనాడోహో అనిపించుకు తిరిగిన ధనికవాదమిక వెగటై జిగటై'' అన్నాడు శ్రీశ్రీ 50ఏండ్ల క్రితమే. ప్రతీ చారిత్రక దశకూ ఒక అభివృద్ధికర కాలం, వికాసం వికటించి వినాశకరదశకు చేరే కాలం వుంటాయి. సుమారు రెండువేల సంవత్సరాలు కొనసాగిన భూస్వామ్య రాచరికయుగం తానే శాశ్వతమని ఎంత బిర్రబిగిసి విర్రవీగినా ఆధునికపెట్టుబడిదారీ విధానమూ, ప్రజాస్వామ్యం ముందు ఓటమికి గురికాక తప్పలేదు. భారతదేశంలో అయితే బ్రిటిషు సామ్రాజ్యవాదులకు లొంగి, వారి దయాదాక్షిణ్యాల ముందు రాజులూ నవాబులూ జవిూందార్లూ వంగి బతకక తప్పలేదు.
ఈలాంటి పెట్టుబడిదారీ సమాజంతప్ప దీనికి మరొక ప్రత్యామ్నాయమే లేదని చెప్పే మేధావులూ, విూడియా, పాలకవర్గాలూ మనదేశంలో చాలామందే వున్నారు. గడిచిన 70ఏండ్లుగా భారత ఆర్థికవ్యవస్థ విదేశీ సహాయము - అప్పు - తాకట్టు - అమ్మకం దశలుగా సాగుతూంటే, స్వాతంత్య్ర పోరాటస్ఫూర్తిని గాలికొదిలి, దేశాన్ని సామ్రాజ్యవాద ప్రపంచీకరణ మార్కెట్టు శక్తులకు దాసోహం అనిపించటమే 'దేశభక్తి'గా 'జాతీయత'గా పాలకవర్గాలూ, వారి నయవంచక అధికారముఠాలూ, ఆత్మవంచన పరవంచనలకు పాల్పడుతున్నాయి. ''ఒకనాడోహో అనిపించుకు తిరిగిన ధనికవాదమిక వెగటై జిగటై'' అన్నాడు శ్రీశ్రీ 50ఏండ్ల క్రితమే. ప్రతీ చారిత్రక దశకూ ఒక అభివృద్ధికర కాలం, వికాసం వికటించి వినాశకరదశకు చేరే కాలం వుంటాయి. సుమారు రెండువేల సంవత్సరాలు కొనసాగిన భూస్వామ్య రాచరికయుగం తానే శాశ్వతమని ఎంత బిర్రబిగిసి విర్రవీగినా ఆధునికపెట్టుబడిదారీ విధానమూ, ప్రజాస్వామ్యం ముందు ఓటమికి గురికాక తప్పలేదు. భారతదేశంలో అయితే బ్రిటిషు సామ్రాజ్యవాదులకు లొంగి, వారి దయాదాక్షిణ్యాల ముందు రాజులూ నవాబులూ జవిూందార్లూ వంగి బతకక తప్పలేదు.
పెట్టుబడిదారీ విధానం వ్యక్తిగత ఆస్తుల విషయంలో భూస్వామ్య విధానపు కొనసాగింపు లాగానే వుంటుంది కానీ, శ్రామికులు సృష్టించిన సంపదపై కొద్దిమందికే అది వ్యక్తిగతహక్కుగా రూపొందుతూ, రెక్కల కష్టం తప్ప వ్యక్తిగత ఆస్తులే లేని వారిగా తక్కిన సమాజాన్ని మారుస్తుంది. పెట్టుబడిదారీ విధానపు ఒక ముఖ్యలక్షణం అత్యధికులకు వ్యక్తిగత ఆస్తులను రద్దుచేయటం. ప్రస్తుత ప్రపంచపు పోకడను గమనించినా మనకు యిదే విషయం స్పష్టమవుతుంది. ప్రస్తుత ప్రపంచ జనాభా 740కోట్లు అనుకుంటే అందులో ఒక్కశాతం మంది(7కోట్ల 40లక్షలు) కున్న మొత్తం సంపద, తక్కిన 732 కోట్లమంది చేతుల్లో వున్న సంపదకంటె ఎక్కువ అని, వారి ప్రపంచబ్యాంకు నివేదికలే చెబుతున్నాయి. మరొక లెక్క ప్రకారం ప్రపంచంలో అత్యంత సంపన్నులైన కేవలం 62 మందికున్న సంపద, మొత్తం ప్రపంచ జనాభాలో సగం మంది (370 కోట్లు) కున్న సంపదతో సమానంగా వుంది. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ కాలపు గడిచిన ఐదేండ్లలో ప్రపంచపేదలు తమ మొత్తం ఆస్తిలో 40శాతం కోల్పోయినందువల్ల నిరుపేదలుగా దిగజారిపోయారు. ఇక భారతదేశంలో 2014లో రూ.6500కోట్లకు పైగా సంపదలున్నవారు 61మంది వుంటే 2015నాటికి, అంటే ఒక్క ఏడాదిలోనే అలాంటి వారు 100 మందికి పెరిగారు. వేలకోట్ల సంపద ఒకచోటికే పోగవతోందంటే, అనేక కోట్లమంది ప్రజలు సంపదను కోల్పోతూ, వ్యక్తిగత ఆస్తిలేని వారవుతున్నారనీ, రెక్కలుతప్ప బతుకు తెరువుకు మరేవిూ లేనివారు పెరిగిపోతూవుంటారనీ అర్థం. ఈ రెక్కల కష్టజీవులే కార్మికులుగా, వెట్టిచాకిరీ బానిసలుగా మన దేశంలాంటి చోట్ల వ్యవసాయకూలీలుగా కౌలురైతులుగా వలస బతుకుల జీవులుగా పెరిగిపోతూండటం మనం గమనించవచ్చు
పెట్టుబడిదారీ విధానం తన సంక్షోభాలకు పరిష్కారంగా రెండు ప్రపంచయుద్ధాలను మానవ సమాజంపై రుద్ది, తన మార్కెట్ల విస్తరణ స్వార్థానికి పేదమధ్యతరగతి కుటుంబాలకు చెందిన కోట్లాది సైనికులను బలితీసుకుంది. జీవన విధ్వంసానికి కారణమయింది. సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం అన్నాడు లెనిన్‌. యుద్ధం లేకుండా అది తన మనుగడ సాగించలేకపోవటం కూడా దాని సంక్షోభపు మరొక కోణాన్ని తెలిపే అంశం. మానవ వినాశనానికి తోడ్పడే ఆయుధాల ఉత్పత్తిపై నిషేధం విధిస్తే మొట్టమొదట కుప్పకూలిపోయే ఆర్థిక వ్యవస్థ అమెరికా దేశానిదే!!
పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద దోపిడీ, దురాక్రమణల విధానాలే శాశ్వతమని చెబుతూ సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు సైద్ధాంతిక సమర్థకులుగా నిలిచిన మేధావులు, పెరిగిపోతున్న సంపద కేంద్రీకరణకూ, తరిగిపోతున్న బడుగు బలహీనవర్గాల జీవనవికాసాలకూ ఏం సమాధానం చెబుతారు?
ప్రపంచశ్రామిక ప్రజల పోరాట విజయాలను, అవి స్థాపించుకున్న నూతన ప్రజాసామ్య, సోషలిస్టు వ్యవస్థలను విచ్ఛిన్నం చేయటం ద్వారా పెట్టుబడిదారీవ్యవస్థ తన వ్యవస్థలో జీవించే అశేష ప్రజానీకానికి సుఖశాంతులను యివ్వగలుగుతోందా?
పెట్టుబడిదారీ విధానానికి మొనగాడుగా వున్న అమెరికా దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు అత్యంత భయంకరంగా వున్నాయి. రోజుకి రెండు డాలర్ల కంటె తక్కువ ఆదాయం పొందే కుటుంబాలు గడిచిన 20 ఏండ్లలో మూడురెట్లు పెరిగిపోయాయి. నికృష్టమైన పేదరికంలో జీవించే వారు ప్రతి 6గురిలో ఒక్కరున్నారు. జనాభాలో సగం కంటె ఎక్కువమంది మహిళలు (51శాతం) ఒంటరి జీవితాలు గడుపుతున్నారు. ప్రతి ముగ్గురిలో ఒక్క బాలుని తల్లితండ్రులకు సరైన ఉపాధి, ఆర్యోగాలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 60శాతం మంది పిల్లలు దారిద్య్రంలో వుండి, సంరక్షణ కేంద్రాల్లో అనాధలుగా పెరుగుతున్నారు. ఇవన్నీ ప్రపంచబ్యాంకు అందించిన గణాంకాలే. ఇంకా 'యునిసెఫ్‌' నివేదిక ప్రకారం అమెరికా జనాభాలో 5 కోట్లమంది నికృష్ట పేదరికంలో జీవిస్తున్నారు. 30శాతం ప్రజలు అప్పుల్లో కూరుకుపోయారు. 2011లో 3 లక్షలమంది ఆకలితో చనిపోయారు. ప్రపంచదేశాల సమస్త వనరుల్ని మార్కెట్లనూ, చౌకశ్రమశక్తినీ కొల్లగొట్టుకు పోయే అమెరికా దేశం తన ప్రజలకు కూడా ఆర్థిక - సాంఘిక భద్రతగల జీవితాన్ని కల్పించలేకపోవటం, సామ్రాజ్యవాదయుగపు పెట్టుబడిదారీ వ్యవస్థల అనివార్య అభివృద్ధినిరోధక సంక్షుభిత పరిణామం.
ఈలాంటి పెట్టుబడిదారీ సమాజంతప్ప దీనికి మరొక ప్రత్యామ్నాయమే లేదని చెప్పే మేధావులూ, విూడియా, పాలకవర్గాలూ మనదేశంలో చాలామందే వున్నారు. గడిచిన 70ఏండ్లుగా భారత ఆర్థికవ్యవస్థ విదేశీ సహాయము - అప్పు - తాకట్టు - అమ్మకం దశలుగా సాగుతూంటే, స్వాతంత్య్ర పోరాటస్ఫూర్తిని గాలికొదిలి, దేశాన్ని సామ్రాజ్యవాద ప్రపంచీకరణ మార్కెట్టు శక్తులకు దాసోహం అనిపించటమే 'దేశభక్తి'గా 'జాతీయత'గా పాలకవర్గాలూ, వారి నయవంచక అధికారముఠాలూ, ఆత్మవంచన పరవంచనలకు పాల్పడుతున్నాయి. సామ్రాజ్యవాదంతో షరీకైపోయి, అత్యధికులు జీవించే వ్యవసాయరంగాన్ని సంక్షోభంపైన సంక్షోభానికి గురిచేస్తూన్న నేటి కేంద్ర-రాష్ట్ర పాలకుల విధానాలకు వ్యతిరేకంగా రచయితలూ మేధావులూ, కళాకారులు పీడిత ప్రజల పక్షాన నిలవాలి. అందుకు శ్రామికవర్గదీక్షాదినమైన 'మేడే' స్ఫూర్తిని గ్రహించాలి.
ప్రపంచ శ్రమజీవుల పోరాటదీక్షాదినమైన 130వ మేడే ఈసారి కొత్త ఆశలను చిగురింపజేసే శ్రామికపోరాటాలను చవిచూపిస్తూ వచ్చింది.
6 కోట్లమంది కార్మికుల రూ.8500 కోట్ల భవిష్యనిధి నిల్వధనాన్ని షేర్‌మార్కెట్లో పెట్టి జూదమాడే నిర్ణయం చేసింది. కేంద్రప్రభుత్వపు ఈ చర్యలకు వ్యతిరేకంగా తమిళనాడులోని తిరుపూర్‌లో 70శాతం పైగా మహిళలు పనిచేస్తున్న 3 యూనిట్లలోని నాలుగు లక్షలమంది బట్టల తయారీ (నిట్‌వేర్‌) కార్మికులు ఈ నెల (ఏప్రియల్‌) 4వ తేదీన పెద్దపెట్టున సమ్మెలోకి దిగారు. తిరుపూరు ఎగుమతిదారుల సంఘం కూడా కేంద్రప్రభుత్వాన్ని ఈ విషయంలో హెచ్చరించింది. అయినా ఉలుకూపలుకూలేదు. ఆందోళన దేశవ్యాపితరూపం తీసుకుంటే రాజకీయంగా నష్టపోతామని భయపడిన మోడీ ప్రభుత్వం, వెంటనే తాము సంకల్పించిన పీఎఫ్‌ చట్టసవరణను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించక తప్పలేదు. కార్మికులు ఐక్యంగా పోరాడితే ప్రభుత్వాలు వెనకడుగు వేయకతప్పదని ఈ ఘటనలు రుజువుచేస్తున్నాయి.
'పరివర్తన' నాటకంలో ఆచార్య ఆత్రేయ రాసినట్టు
''ఎండిన గుండెలు మండే కడుపులు
ఏకమైతే ఎదురుతిరిగితే
లోకాలన్నీ ఊగిపోవా
శోకాలన్నీ ఆగిపోవా?''
తమ దోపిడీకోసం, ప్రపంచ వ్యాపితంగా విస్తరించుకున్న పెట్టుబడిదారీ విధానం గుత్తపెట్టుబడిదారీ విధానమై చిన్నపెట్టుబడిదారుల్ని కూడా హతం చేస్తోంది. శ్రమదోపిడీద్వారా కొల్లగొట్టిన సంపదల్ని పిడికెడుమంది కార్పొరేటుశక్తుల బడాపెట్టుబడిదార్ల పరంచేస్తోంది. అందుకు దోహదపడే ప్రభుత్వాధినేతలకు కమీషన్ల రూపంలో వాటా యిస్తుంది. నిరాకరిస్తే కూలదోస్తుంది. అవినీతికి బొడ్రాయిలా వుంటుంది. ప్రత్యేకించి వెనుకబడిన దేశాలను తమకు పోటీ రానివ్వకుండా తమ దళారీలతో కాపలా కాచుకుంటుంది. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ఒక పాలక ముఠాస్థానంలో మరొక పాలక ముఠాను అధికారంలోకి తెచ్చుకుంటుంది. తాను చిక్కుకున్న సంక్షోభభారాన్ని, సామ్రాజ్యవాద ప్రపంచీకరణలాంటి మూడవ ప్రపంచయుద్ధంలాగా, ప్రపంచంపై రుద్ది, నీచమైన పతన సాంస్కృతిక విలువలతో ఉక్కిరిబిక్కిరిచేస్తోంది. కుల, మత, ప్రాంత, భాషా విద్వేషాలతో ప్రజల్ని పక్కదారిపట్టిస్తూ తమ దోపిడీకి అడ్డూ, అదుపులేనట్టు ప్రవర్తిస్తోంది. దీన్ని అడ్డుకోవటానికి సమస్త శ్రామిక మధ్యతరగతి రైతుకూలీ వర్గాలకు, కార్మికవర్గమే నాయకత్వం వహించే శక్తిగా మున్ముందుకు రావాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ విప్లవ స్ఫూర్తిని కార్మికవర్గానికి భావజాలరూపంలో అందించాల్సిన చారిత్రక కర్తవ్యం రచయితలు మేధావులపై వుంది. శ్రామిక దీక్షాదినం మేడే సందర్భంగా ప్రపంచ మానవాళి సామ్రాజ్యవాద పెట్టుబడిదారీవిధానం నుండి, కాలంచెల్లిన భూస్వామ్య, నిచ్చెనమెట్ల కులవ్యవస్థలనుండి విముక్తి చెందాలని కార్మికవర్గంతో గొంతుకలిపి నినదిద్దాం.
 -దివికుమార్‌

No comments:

Post a Comment