|| అంబేద్కర్ విప్లవ పార్శ్యాన్ని పరిరక్షించుకుందాం ||
దేశ వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతిని జరుపుకున్నారు. ఏప్రిల్ 14వ తేదీనాడు ఆ రోజున ఆయన జీవితాన్ని, ఆయన చేసిన కృషిని గుర్తుకు తెచ్చుకున్నారు. కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడిగా, దళితుల విమోచకుడిగా, సంఘ సంస్కర్తగా, భారత రాజ్యాంగ నిర్మాతగా, మహిళా హక్కుల పరిరక్షణ కోసం నడుం కట్టిన సంస్కర్తగా అంబేద్కర్ జీవితంలోని అమోఘమైన వివిధ పార్శాలను ఆ రోజున సృజించటం జరిగింది. అయితే మరోవైపు అంబేద్కర్ వారసత్వాన్ని ప్రశ్నిస్తూనే ఆయనను మతతత్వ శక్తులు స్వంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
అంబేద్కర్ విప్లవ ప్రజాస్వామిక దార్శనికతను, నిజమైన ప్రజాస్వామ్యానికి సామాజిక విమోచన ఆధారం కావాలనే ఆయన సందేశాన్ని ఈ సందర్భంలో పరిరక్షించుకోవలసిన అవసరం వున్నది. ఎందుకంటే అన్నింటికీ మించి ఆయన విగ్రహారాధనను ఈసడించుకున్నాడు. అసమానతలకు ఆలవాలమైన సామాజిక వ్యవస్థకు హృదయంలాంటి కుల వ్యవస్థను బద్దలుకొట్టాలని ఆయన పిలుపునిచ్చాడు. ఈ సందర్భంలో అంబేద్కర్‌ను కేవలం సంఘ సంస్కర్త పాత్రకు కుదిస్తే సరిపోదు. తన సమకాలికులవలే కుల వ్యవస్థను లేక హిందూమతాన్ని సంస్కరించే ప్రయత్నాన్ని ఆయన చేయలేదు. 1925లోనే 'మనుస్మృతి దహన దినం' అనే పేరుతో మనుస్మృతిని బహిరంగంగా అంబేద్కర్ దహనం చేశాడు. అంటరానితనానికి వ్యతిరేకంగా గాంధీజీ నడిపిన ప్రచారం అగ్రకులాల ప్రయోజనాలను కాపాడేదేననీ, వర్ణ వ్యవస్థను బలోపేతం చేసేదేననీ ఆయన భావించాడు. ముందు ముందు కుల, బ్రాహ్మణ వ్యవస్థలకు వ్యతిరేకంగా తాను చేయబోయే రాజీలేని పోరాటాలను కొనసాగించేందుకు కావలసిన బలాన్ని విప్లవ ప్రజాస్వామిక తత్వశాస్త్రం ఆయనకు ఇచ్చింది.
అంబేద్కర్‌లో వ్యక్తమయిన రాజకీయ, తాత్విక ధోరణులనుబట్టి ఆయనను ఉదారవాద ప్రజాస్వామికవాదిగా అభివర్ణించవచ్చు. అయితే ఆయనను కేవలం ఆ వెలుగులో చూడటం సరికాదు. కొందరు 'రాజ్యాంగబద్ద ప్రజాస్వామిక వాది' అని ఆయనను పొగుడుతుంటారు. ఆయన గురించి అలా పేర్కొనటం కూడా ఆయనకు అన్యాయం చేయటమే. అంబేద్కర్‌లోని విప్లవ తత్వం బూర్జువా ఉదారవాద సరిహద్దుల్ని కూల్చివేసింది. సామాజిక, ఆర్థిక సమానత్వం లేకుండా ఏర్పాటైన రాజ్యాంగబద్దమైన రాజకీయ ప్రజాస్వామ్యం సారహీనంగా వుంటుందని ఆయన హెచ్చరించాడు. ఆయన ఆర్థిక కార్యక్రమం సంప్రదాయ బూర్జువా నియమాలకంటే ఎంతో ముందున్నది. ఆర్థిక వ్యవస్థపై రాజ్య నియంత్రణ వుండాలనే ఆయన ప్రతిపాదనను 'స్వేచ్చ'కు భంగం కలిగిస్తుందనే భావంతో వ్యతిరేకించినప్పుడు ఆయన ఇలా సమాధానం ఇచ్చాడు. 'ఈ స్వేచ్ఛ ఎవరికి, ఎవరి కొరకు? ఈ స్వేచ్ఛ భూస్వాములు కౌలురేటు పెంచుకునేందుకు, పెట్టుబడిదారులు పని గంటలను పెంచేందుకు, వేతనాలను తగ్గించేందుకు స్వేచ్ఛగా మారుతుందనేది సుస్పష్టం'.
అంబేద్కర్ మహిళల హక్కులకై నికరంగా పోరాడాడు. స్వాతంత్య్రానంతరం ఏర్పడిన మొట్టమొదటి క్యాబినెట్లో న్యాయ శాఖా మంత్రి హోదాలో ఆయన హిందూ కోడ్ బిల్లుకు మార్గదర్శకత్వం వహించాడు. ఆ బిల్లు చట్టంగా మారితే వారసత్వ, ఆస్తిహక్కులు మహిళలకు అందుబాటులోకి వస్తాయి. అంబేద్కర్ రూపొందించిన హిందూ కోడ్ బిల్లుకు కాంగ్రెస్‌లోని సనాతన వాదులనుంచీ, హిందూత్వ శక్తులనుంచీ ప్రతిఘటన ఎదరవ్వటంతో అంబేద్కర్ ఆ విషయంపై రాజీపడకుండా రాజీనామా చేయటానికి నిర్ణయించుకున్నాడు.
బీజీపీ, సంఫ్ుపరివార్లు అంబేద్కర్‌ను ఎలాగైనా స్వంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన రచనలలోని విషయాలను సందర్భ రహితంగా మొరటుగా ఉటంకిస్తున్నారు. ఆయనను ఒక హిందూసంఘ సంస్కర్తగానూ,ఇస్లాం వ్యతిరేకిగానూ చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన హిందూమతాన్ని పరిత్యజించటం, బుద్దిజంలోకి మారటంవంటి విషయాలను కప్పిపుచ్చుతున్నారు. అంబేద్కర్‌ను ఒక దళిత దేవుడిగామార్చి హిందువుల దేవతాగణంలో భాగం చేయటమే సంఫ్‌ు పరివార్ లక్ష్యం.
ఇంతకంటే సత్యదూరమైన విషయం మరొకటి వుండజాలదు. హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ల భావజాలాన్ని అంబేద్కర్ పూర్తి స్థాయిలో వ్యతిరేకించాడు. ఆయన ఇలా రాశాడు. 'ఒకవేళ హిందూ రాజ్యం వాస్తవ రూపం దాలిస్తే దేశానికి పెనుప్రమాదం సంభవిస్తుందనటంలో సందేహం లేదు'. అంబేద్కర్ దృష్టిలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం నాగరిక సమాజానికి అత్యంత ప్రీతిపాత్రమైన నియమాలు. వర్ణాశ్రమ ధర్మం, హిందూ శాస్త్రాలు ఈ నియమాలకు పూర్తిగా వ్యతిరేకం. ముస్లింలకు, ఇతర మతసంబంధిత మైనారిటీలకూ వ్యతిరేకమయిన అఖండ హిందూ రాజ్యంలోకి దళితులను కలుపుకునే ప్రయత్నాన్ని అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించి వుండేవాడు.
స్వాతంత్య్ర పోరాటకాలంలో దేశ విమోచనకోసం అన్వేషిస్తున్న స్థితిలో అనేక ఆలోచనా స్రవంతులు, భావజాలాలు బయటకొచ్చాయి. దృక్పథంలోను, దృష్టికోణంలోను, భావజాలపరంగానూ కమ్యూనిస్టులకూ, అంబేద్కర్‌కూ తేడాలున్నాయి. అయితే అనేక విషయాలపై ఇరువురి మధ్య సామ్యం వున్నది. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను పరిపుష్టంచేసే ఆర్థిక, సామాజిక విమోచనల కోసం ఇరువురూ తీవ్రంగా కృషిచేశారు.
అంబేద్కర్‌ను విప్లవాత్మక దృష్టికోణం లేని ఒక ప్రతిమగా మార్చే ప్రయత్నాన్ని అడ్డుకోవటం అవసరం. అంబేద్కర్‌ను ఒక విగ్రహంగా నిలబెట్టి ఆయన వారసత్వాన్ని రిజర్వేషన్లు, కోటా రాజకీయాలకు కుదించటంద్వారా దళిత నాయకులలో చాలామంది పాలకవర్గ రాజకీయాలకు తోకలుగా మారారు. అంబేద్కర్ విశాల విమోచన విస్తృతి, విశ్వజనీనమైన ఆయన సందేశం దళిత, కుల వ్యతిరేక పోరాటాలను ఆవిర్భవింపజేయాలి. అలాంటి సామాజిక విమోచక వేదిక భారతదేశంలోని వర్గ పోరాటంలో అంతర్భాగంగా వుంటుంది. ఆవిధంగా భారతదేశంలోని కమ్యూనిస్టులకు అంబేద్కర్‌తో అవినాభావ సంబంధం వుంటుంది.
ప్రస్తుతం మతతత్వ, నయావుదారవాద పతాకాల నేతృత్వంలో చెలరేగిపోతున్న ప్రగతి నిరోధక శక్తులను నిలువరించటానికి వామపక్ష, అంబేద్కర్ ఉద్యమ స్రవంతులు ఏకమౌతున్నాయి. ఈ విస్తృత ఐక్యతను ముందుకు తీసికెళ్ళాలంటే అంబేద్కర్ నిజమైన ప్రాధాన్యతను, వారసత్వాన్నీ అవగాహన చేసుకోవాలి.
- ప్రకాష్ కారత్ (సిపిఐ(ఎం) పూర్వ ప్రధాన కార్యదర్శి)

No comments:
Post a Comment