|| మరో నిర్భయ ||
కేరళలో న్యాయశాస్త్రం చదువుకుంటున్న ఒక దళిత యువతిపై అత్యాచారం చేసి అత్యంత అమానుషంగా హతమార్చిన ఘటన గుండెలను పిండివేస్తున్నది. ఢిల్లీలో నాలుగేళ్ళ క్రితం కదులుతున్న బస్సులో నిర్భయపై ఎంతటి పాశవిక దాడి జరిగిందో అదే రీతిలో ఈ దారుణం జరగడంతో మాధ్యమాలు ఈ అభాగ్యురాలిని కేరళ నిర్భయగా ప్రస్తావిస్తున్నాయి. లైంగికదాడిలో ఆమెను చిత్రహింసలు పెట్టినది కాక, ముప్పైకు పైగా కత్తిపోట్లతో, మర్మావయవాలను ఛిద్రం చేసి పేగులను పెకిలించివేయడం వంటి ఘోరమైన దుశ్చర్యలతో దుండగులు ఆమెను హతమార్చారు. కేరళను కుదిపేస్తున్న ఈ ఘటన మరో పదిరోజుల్లో ఎన్నికలు జరగబోతున్న కారణంగా రాజకీయరంగు కూడా పులుముకుంది. సామాజిక మాధ్యమాలను హోరెత్తిస్తూ, దేశం యావత్తూ విస్తుపోయేట్టు చేసిన ఈ ఘటన ఇటీవలి కాలంలో మహిళ లపై పెరుగుతున్న అకృత్యాలకూ, విద్యాధికులైనప్పటికీ దళిత యువతులపై నిస్సంకోచంగా కొనసాగుతున్న దాడులకూ మరో రుజువు.
ఢిల్లీ నిర్భయలాగా ఈ కేరళ యువతి రాత్రివేళ అమాయకంగా బస్సులో ఎక్కి ప్రాణాలు పోగొట్టుకోలేదు. తనింట్లో తలుపులు వేసుకొని చదువుకుంటూండగా ఈ ఘాతుకానికి బలైపోయింది. కాలేజీకి వెళ్ళివచ్చి, తల్లితో కలసి అన్నం తినడానికి ఎదురుచూస్తున్న తరుణంలో ఈ అమానుషానికి ఎరగా మారిపోయింది. కులంతో ముడిపడిన దారిద్య్రం తన ప్రాణాలకు ముప్పుతెస్తుందన్న ఎరుక ఆమెకు లేకపోలేదు. ఎవరో ఒకరు ఇల్లు కూల్చినప్పుడు పాడైన తలుపు స్థానంలో దానిని అమర్చుకోవచ్చునని ఆమె ఎదురు చూస్తున్నది. ఒక కాలువపక్కన పోరంబోకు భూమిలో ఉన్న ఆ రేకుల గది తన కుమార్తెకు రక్షణ నివ్వదన్న భయంతోనే ఆమె తల్లి సొంతింటి కోసం అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతోంది. పొరుగునే ఉన్న ఒక దుర్మార్గుడు తన కుమార్తెను గతంలో వాహనంతో ఢీకొట్టగానే ప్రమాదాన్ని పసిగట్టి ఎక్కడినుంచో ఒక పెన కెమెరాను కూడా తన కుమార్తెకు తెచ్చిచ్చింది. తాను ఇంట్లో లేనప్పుడు ఎవరొచ్చినా తలుపులు తీయవద్దని పదేపదే హెచ్చరిస్తోంది. కానీ, పేరుకు మాత్రమే తలుపులనే ఆ అడ్డంకులను అప్పుడప్పుడు ఆవులే తోసుకొని లోపలకు రాగలిగినప్పుడు కామంతోనూ, ఉన్మాదంతోనూ ఊగిపోతున్న దుర్మార్గులను ఆవెలా అడ్డగలవు? తన కుమార్తెకు వాటిల్లే ముప్పుగురించీ, దానిని తెచ్చిపెట్టే ముగ్గురు వ్యక్తుల గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోనప్పుడు, ఆమెను తానే కాపాడుకోవాలనీ, కాపాడుకోగలననీ ఆ అమాయక తల్లి అనుకున్నది. చుట్టూ పలు ప్రకోపాలు, ఉన్మాదాలు ఆవరించివున్న ఈ సమాజంలో తనది కేవలం భ్రమేనని, రక్తపు మడుగులో ఛిద్రమై పడివున్న కుమార్తె తేల్చివేయడంతో సొమ్మసిల్లిపోయి, ఆసుపత్రిలో ఎంతకాలమైనా తేరుకోలేకపోతున్నది.
కాస్తంత జాగా కొనుగోలుకోసం అష్టకష్టాలు పడిన ఆమెకు పదిలక్షలు పరిహారంగా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొస్తున్నది. చదువు పూర్తికాగానే ఉద్యోగం చేసి తల్లిని ఆదుకోవాలనుకున్నది ఈ కేరళ నిర్భయ. బస్సు చార్జీలు మిగల్చుకోవడానికి కాలినడకన కాలేజీకి వెళ్ళి వస్తూ, అర్థాకలితోనే కాలం నెట్టుకొస్తూ ఆ చదువుకాస్తా పూర్తిచేయాలనుకున్న ఆమె అర్థాయుష్కురాలిగానే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎన్నడో తమను విడిచిపోయి వివాహం చేసుకున్న ఆమె సోదరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తానంటున్నది. కేరళలో మరోపదిరోజుల్లో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాజకీయమంతా ఈ ఘటన చుట్టూ తిరుగుతున్నది. విమర్శలు, పరామర్శలు, వరాలు, నష్టపరిహారాలతో పార్టీలు పోటాపోటీ రాజకీయం నడుపుతున్నాయి. సూమోటో స్వీకరణలు, దర్యాప్తులు, నివేదికలకు లోటు లేకుండాపోతున్నది. ఈ దుశ్చర్యకు కారకులంటూ పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసి ప్రశ్నించడం ఆరంభించారు. ఆలస్యంగానైనా వెలుగులోకి వచ్చిన ఈ విషాదఘటన ఎన్నికలే లేకుంటే నిశ్శబ్దంగా అణిగిపోయేది. ఈ ఘటన కేరళను ఇంతగా కుదిపేసిన తరువాత కూడా సోమవారం రాత్రి బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న మరో దళిత విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరగడం వారి భద్రతలేని బతుకులను తెలియచెబుతున్నది. నడివీధిలో నలుగురూ చూస్తుండగానే, సీసీ కెమెరాల సాక్షిగా ఈడ్చుకుపోయి అత్యాచారాలకు తెగిస్తున్న రోజులు ఇప్పుడు దాపురించాయి. ఘోరం జరిగిన తరువాతే రంగంలోకి దిగమని నిర్భయ చట్టం పోలీసులకు నిర్దేశించడం లేదు. తమకు ముప్పు ఉన్నదని ఏ మహిళ భయపడినా వారికి భద్రతనివ్వమన్నది. వారు నిర్భయంగా జీవించగలిగే పరిస్థితులను కల్పించమన్నది. కానీ, పోలీసులు కేరళ నిర్భయ విషయంలో ఆది నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ఆమె భయాలను బేఖాతరు చేశారు, విజ్ఞప్తులను బుట్టదాఖలు చేశారు. చివరకు ఆమె మరణం తరువాత కూడా మూడు రోజులు మారుమాట్లాడలేదు. మహిళల విషయంలో, అందునా, దళితుల విషయంలో వ్యవస్థలు ఎలా పనిచేస్తాయనడానికి ఈ ఘటన ఒక నిదర్శనం. (ఆంధ్రజ్యోతి)
# కేరళలో మరో నిర్భయ.. 19 యేళ్ళ దళిత నర్సింగ్ విద్యార్థినిపై ఆటోలో గ్యాంగ్ రేప్ #
కేరళలో మరో నిర్భయ తరహా గ్యాంగ్ రేప్ జరిగింది. ఇటీవల ఎర్నాకుళం జిల్లాలో న్యాయ విద్యార్థినిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన ఆ రాష్ట్రంలో కలకలం సృష్టించిన విషయం తెల్సిందే. ఇది ఇంకా సద్దమణుగక ముందే మరో ఘాతుకం చోటుచేసుకుంది. ఒక దళిత నర్సింగ్ విద్యార్థినిపై ఆటోలోనే సామూహిక అత్యాచారం జరిగింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు మంగళవారం రాత్రి పోలీసులు తెలిపారు
బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని తనకు తెలిసిన ఆటోరిక్షాలో కాలేజీకి బయలుదేరింది. మార్గమధ్యంలో డ్రైవర్‌కు తెలిసిన మరో ఇద్దరు ఆటో ఎక్కారు. అనతరం వారు వర్కాలలోని అవంతి బ్రిడ్జి సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన విద్యార్థినికి ఫిట్స్ కూడా వచ్చాయి. సహాయం కోరుతూ ఆమె ఆక్రందన చేయడంతో కొందరు వ్యక్తులు అక్కడకు చేరుకుని ఆమెను తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

No comments:
Post a Comment