|| పోరాట వీరులకు మేడే ప్రణామాలు ||
-----------------------------------
వర్గాన్ని ఐక్యం చేయండి
వర్గ పోరాటాన్ని తీవ్రతరం చేయండి
-----------------------------------
పోరాటాలు, సంబరాల ఉత్పుకతను మే నెల తీసుకొస్తుంది. కార్మికుల విముక్తికోసం, దోపిడీ, అణచివేతలు లేని సమాజం కోసం జరిగే పోరాటాలకు ఇచ్చే కార్మిక అంతర్జాతీయ సంఘీభావ స్ఫూర్తితో మేడే ప్రతిధ్వనిస్తుంది. ప్రపంచ మంతటా వున్న కామ్రేడ్స్‌తో కలిసి ఈ సంబరాల్లో భారత కార్మికవర్గం పాల్గొంటుంది. దోపిడీ లేని సమాజం కోసం తనకు తాను అంకితమవుతుంది. ఈ విప్లవ సాంప్రదాయాలకు సీఐటీయు కట్టుబడి వుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో సామ్రాజ్యవాదులు చేస్తున్న అమానవీయ దాడులకు, ఆర్థిక దారిద్య్రానికీ, పెరుగుతున్న అసమానతలకు, దినదినాభివృద్ధి చెందుతున్న నిరుద్యోగానికీ, జీవనోపాధి మీద జరుగుతున్న అనేక దాడులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో నిమగమైన వారందరికీ మేడే సందర్భంగా ప్రణమిల్లుతున్నాయి.
2007-08లో వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం ఇంకా ప్రగాడమవుతున్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గతి తప్పుతున్నట్టుగా ఐఎంఎఫ్ పెర్కొంది. చాలా నెమ్మదిగా, బలహీనంగా అది కోలుకుంటున్నదని కూడా అది చెప్పింది. అత్యధిక రుణాలు, స్వల్ప పెట్టుబడులు, అధిక నిరుద్యోగాలతో 2007-09 దుష్ప్రభావం కొనసాగుతున్నట్టుగా ఐఎంఎఫ్ అంగీకరించింది. దీనర్థం సంక్షోభం కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో పెట్టుబడి మరిన్ని ఎదురుదాడులు చేస్తుందని కార్మికవర్గం గుర్తించాలి.
అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారీ దేశాల నినాదాలు ఆసక్తిని కల్గిస్తున్నాయి. నల్లజాతి ప్రజల జీవితాన్ని పట్టించుకోవాలనే బలమైన నినాదంతో బాటు నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, ఆర్థిక పున:పంపిణీ, కనీస వేతనాల అంశాలు అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి. గంటకు 15 డాలర్ల వేతనం ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంది. 2017లో గంటకు 10.30 డాలర్ల కనీస వేతనం నుండి 2022 వచ్చేటప్పటికీ 15 డాలర్లు ఇవ్వాలని కాలిఫోర్నియా రాష్ట్రంలో పాలకులకు, కార్మిక సంఘాలకు మధ్య ఒప్పందం కుదిరింది. ఇతర రాష్ట్రాలు కూడా కనీన వేతనాలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. అమెరికాలో లాభదాయకత రేటు అత్యున్నత స్థాయికి చేరుకుందని మార్చి నెల 'ఎకనమిస్ట్' సంచిక రిపోర్టు చేసింది. అత్యధిక లాభాలు ఉత్పాదకత పెంపుదలలో ప్రతిబింబించటానికి బదులుగా గుత్తాధికారం పెరుగుదలలో ప్రతిబింబిస్తున్నదని ఒక విశ్లేషణలో తేలింది. లాభాలు, గుత్తాధిపత్యాల గరిష్టీకరణే పెట్టుబడి యొక్క వాస్తవగుణమని దీన్ని బట్టి తేలుతుంది.
పెరుగుతున్న సామాజిక అణచివేత
మనల్ని వేధిస్తున్న మరో ముఖ్యమైన సమస్య సమాజిక అణచివేతలు. 70 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా సామాజిక న్యాయం, సమానత్వం వంటి ఉన్నత ఆశయాలు చేరుకోలేని కలలుగానే మిగిలిపోతున్నాయి. ఇటీవల జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే కాబట్టి ఇక్కడ పేర్కొవాల్సిన అవసరం లేదు. దళితులు, గిరిజనుల మానవ హక్కులు ఉల్లంఘించబడటమే గాకుండా వారి జీవితాలపై దాడులు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితి పట్ల కార్మిక వర్గం మౌనం వహించజాలదు.
మతోన్మాద ప్రమాదం
కార్మికులే గాకుండా ప్రభావితమైన అన్ని సెక్షన్ల ప్రజల ఐక్య ఉద్యమాల ఆవశ్యకత నేడు మరింత ఎక్కువగా ఉండగా, ఒక పద్ధతి ప్రకారం ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనే సంఘటిత ప్రయత్నం జరుగుతున్నది. మత విద్వేషాల్ని రెచ్చగొట్టంతోనే ఇది పరిమితం కావటం లేదు.
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల నుండి దృష్టి మరల్చటానికి దేశభక్తి, జాతీయ అంశాలు లేవనెత్తబడుతున్నాయి. వాస్తవ సమస్యల్ని కప్పిపెట్టి ప్రజలను తికమక పెట్టటానికి హిందూత్వ శక్తులు, ప్రభుత్వంలోని వారి ప్రతినిధుల దర్శకత్వంలో అనేక ముఠాలు సంయుక్తంగా ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇతర సంస్థల్లో జరిగిన సంఘటనలు వారి కార్యాచరణకు మచ్చుతునకలు. పాలకవర్గాల ప్రజావ్యతిరేక విధానాలపై కార్మికవర్గం ఐక్యంగా పోరాడాల్సిన తరుణంలో ఇవి ప్రజల్ని విభజించి ఏకాకుల్ని చేస్తాయి.
సీఐటీయూ ప్రచారం
ప్రభుత్వ విధానాలకీ, విచ్ఛిన్నకర మతోన్మాద శక్తులకీ వ్యతిరేకంగా అన్ని స్థాయిలలో ప్రచారం సీఐటీయూ వ్యవస్థాపక దినమైన మే 30న మొదలైన జూన్ 30 వరకు నెల రోజులపాటు కొనసాగుతుంది. 2016 సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సమ్మె చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర జాతీయ ఫెడరేషన్ సంయుక్త వేదిక పిలుపునిచ్చింది. ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంక్, ఇన్సూరెన్సు ఉద్యోగులు, టెలికం, రక్షణ రంగాలలోని ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు పోరాటాల బాటలో వున్నారు. ఈ పోరాటాల విజయం, వాటి మధ్యఏర్పడే సమన్వయం సంయుక్త కార్మిక సంఘాల వేదిక యొక్క 12 కోర్కెలపై బలమైన ఐక్య ఉద్యమానికి దారి తీయాలి. ఇప్పటికి బిఎంఎస్ ఐక్య ఉద్యమానికి దూరంగా వుంది. ఐక్యతను బలోపేతం చేసి ఉమ్మడి పోరాటాన్ని తీవ్రతరం చేయటానికి పనిచేసే స్థలాల స్థాయిలో గట్టి ప్రయత్నం అవసరం. సీఐటీయూ తన స్వతంత్ర వేదిక నుండి సామాజిక అణచివేతలకి, మతోన్మాద విచ్ఛిన్న శక్తులకి వ్యతిరేకంగా పోరాటనికి సన్నద్దాం కావలి. కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి భవిష్యత్ పోరాటాలకు సిద్ధం చేయాలి. ఈ మేడే వ్యవస్థాపక దినోత్సవం మరో దేశ వ్యాప్త ప్రచారానికి నాంది కావాలి. నిర్ణయాత్మక పోరాటాల వైపు పురోగమించటానికి ఈ ప్రచారం తోడ్పడాలి. తద్వారా ప్రజావ్యతిరేక విధానాల్ని ఓడించాలి. శ్రామిక జనావళికి అనుకూలమైన ప్రత్యామ్నాయ విధానాలను ముందుకు తేవాలి.
కార్మికుల మీద దాడులు
మోడీ ప్రభుత్వం సంస్కరణల ఎజెండా అమలును తీవ్రం చేసింది. బీజేపీ, వారి మిత్రులు పరిపాలించే రాష్ట్రాలను అమలు చేయమని నిర్దేశించింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్గడ్, హర్యానా బీజేపీ ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం కార్మిక సంస్కరణలు అమలు చేశాయి. దీన్లో కార్మిక చట్టాలు సవరించటం ఒక్కటేగాకుండా తమ యూనియన్లు పెట్టుకునే ప్రయత్నం చేసే కార్మికులపై అణచివేతన, సమ్మెలు, ఊరేగింపులు, ధర్నాల నిషేధం, ట్రేడ్ యూనియన్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపటం కూడా ఉన్నాయి. మోడీ ప్రభుత్వ విధానాలు దేశంలోని శ్రమ జీవుల అసంతృప్తిని, కోపాన్ని సెప్టెంబర్ 2, 2015 దేశవ్యాప్త సమ్మె బహిర్గతం చేసింది. ప్రభుత్వం, కార్పొరేట్ కంపెనీలు భూములు లాక్కోటానికి వ్యతిరేకంగా రైతులు, వ్యవసాయ కార్మికుల ఐక్య ఉద్యమం, పోరాటం చేయాలనే వారి పట్టుదలను తెలియజేస్తుంది. మోడీ ప్రభుత్వ విధానాలు వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులతో సహా అనేక సెక్షన్లను పోరాటాల్లోకి నెట్టాయి. స్కాలర్‌షిప్‌ల తగ్గింపు, నిరాకరణ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆఫీసు ముట్టడికి, ఇతర రకాల భారీ సమీకరణలకు దారి తీశాయి.
భారత అనుభవం
సంక్షోభం నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ కూడా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం ఒక్కటే ఆశ పెట్టుకునేదిగా వుందని పాలకులు చెప్పుకుంటున్నప్పటికీ, వాస్తవాలు దానికి విరుద్ధంగా వున్నాయి. ప్రభుత్వం సమర్పించిన ఆర్థిక సర్వేలోనూ, బడ్జెట్లోనూ వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం జరిగింది. వ్యాపారాన్ని సులువుగా నిర్వహించుకునే, పేద ప్రజల పొదుపుతో సహా ప్రతిదాన్నీ మార్కెటీకరణ చేసే విధానాల్ని ప్రభుత్వం కొనసాగిస్తున్నది. మరిన్ని దాడులు జరుగనున్నాయని దీన్ని బట్టి విదితమవుతుంది. కార్మికులొక్కరే కాకుండా అన్ని వర్గాల శ్రమజీవులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తిదార్లు, చిన్న వ్యాపారస్తులతో బాటు చిన్న పరిశ్రమల యజమానులు కూడా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. విద్య, వైద్యం వ్యాపారీకరణ పేదల అగచాట్లను తీవ్రతరం చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆత్మహత్యలు పెరిగాయి. నిరుద్యోగం పెరుగుదల సామాజిక ఉద్రిక్తలు అధికం కావటానికి దారితీసింది. - ఏ.కె.పద్మనాభన్ (సి.ఐ.టి.యు అఖిల భారత అద్యక్షుడు)

No comments:
Post a Comment