Sunday, 23 October 2016

|| సర్కారు వైద్యం - అమానుష దృశ్యం ||


  
ప్రభుత్వాసుపత్రిలో క్షయబారినపడి తనువు చాలించిన భార్య అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించాలని ఆ ఆదివాసి తలంచాడు. 60 కిలో మీటర్లు దూరంలో ఉన్న గ్రామానికి ఆ మృత దేహన్ని తరలించేందుకు ఆయన వద్ద డబ్బులేదు. ఆస్పత్రి వర్గాలను ఎంత బ్రతిమిలాడిన శవాన్ని తిరిగి స్వగ్రామం తీసుకెళ్లేందుకు పాడెగానీ, అంబులెన్స్‌గానీ ఏర్పాటు చేయలేదు. గత్యంతరం లేక దుప్పటి చుట్టి శవాన్ని భుజాన వేసుకుని భార్య అంతిమయాత్ర ప్రారంభించాడా భర్త. తల్లి మరణం తో ఉబికి వస్తున్న దుఃఖాన్ని, కన్నీళ్లను ఆపుకోలేక అలాగని రోడ్డుమీద మనసారా ఏడవటానికి కూడా నోచుకోని అతని పన్నెండేళ్ల కుమార్తెతో కలిసి 60కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామం బయల్దేరాడు ఆ గిరిజనుడు.

కెమెరా దృశ్యాన్ని బంది స్తుంది. ఆ దృశ్యం అందమైనది కావచ్చు. ఆకట్టుకొనేది అవ్వొ చ్చు. దుఖపరచేది కావచ్చు. కానీ గుండెలో తడి ఉన్న ప్రతి హృదయాన్ని కన్నీరు పెట్టించి కన్నీళ్లకే కన్నీరొచ్చే దృశ్యాలు మాత్రం అరుదుగానే ఉంటాయి. అవి ఆ సమాజపు స్థితిగతులను కూడా ప్రతిబింబి స్తాయి. అలాంటి మంచి చిత్రాలను తీయగలగడమే గొప్ప ఫోటోగ్రఫి. ఒక వాస్తవం తాలుకు చిత్రరూపం. గడిచిన ఆగస్టు నెలలో కొద్దిరోజుల వ్యవధిలో చానెళ్లలో వార్త పత్రికలలో కనబడిన వేర్వేరు దృశ్యాలు మానవత్వం గల ప్రతి ఒక్కరిని కదిలిం చాయి. ఈ దృశ్యాలు యావత్‌ ప్రపంచాన్ని కన్నీరు పెట్టించి కదిలించి వేశాయి. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని కంపించి వేశాయి. రచయిత అన్నవాడిని ప్రశ్నించాయి. తమ కష్టాల గురించి రాయమని తమ వ్యధను ప్రపంచానికి తెలియజేయమని. ఇంకేముంది కలం పట్టుకుంటే వణుకుతున్న చేతులు, ఉబికి వస్తున్న ఉద్వేగంతో రాస్తుంటే కన్నీటి కడలి అలలు, సుడులు మానవాళి బాధలు ఉప్పొంగే కెరటమైన అక్షరధార. ఈ దృశ్యాలు 70 సంవత్సరాలు స్వతంత్ర భారతంలో వైద్యం ప్రజలకు అందకుండా ప్రజారోగ్యం నీటిమూటగా కలగా ఎలా మిగిలిపోయిందో ప్రపంచానికి తెలియజేసిన దృశ్యాలు. 
నాగరికతను నిలువెల్ల నింపుకున్న ఈ ఆధునిక సమాజంలో కట్టుకున్న భార్య అంతిమయాత్రను ఓ పేద గిరిజనుడు ఎంత దీనాతి దీన పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందో తెలుసుకుంటే గుండె కరిగి కన్నీటి ధారలు ప్రవాహం అవ్వాల్సిందే... తొలి ఉదంతం ప్రభుత్వాసుపత్రిలో క్షయబారి నపడి తనువు చాలించిన భార్య అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించాలని ఆ ఆదివాసి తలంచాడు. 60 కిలో మీటర్లు దూరంలో ఉన్న గ్రామానికి ఆ మృతదేహన్ని తరలించేందుకు ఆయన వద్ద డబ్బులేదు. ఆస్పత్రి వర్గాలను ఎంత బ్రతిమిలాడిన శవాన్ని తిరిగి స్వగ్రామం తీసుకెళ్లేందుకు పాడెగానీ, అంబులెన్స్‌ గానీ ఏర్పాటు చేయలేదు. గత్యంతరం లేక దుప్పటి చుట్టి శవాన్ని భుజాన వేసుకుని భార్య అంతిమయాత్ర ప్రారంభించాడా భర్త. తల్లి మరణంతో ఉబికి వస్తున్న దుఃఖాన్ని , కన్నీళ్లను ఆపుకోలేక అలాగని రోడ్డుమీద మనసారా ఏడవటానికి కూడా నోచుకోని అతని పన్నెండేళ్ల కూమార్తెతో కలిసి 60కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామం బయల్దేరాడు ఆ గిరిజనుడు. తండ్రి, కూతుళ్ల ఈ కన్నీటి అంతిమ యాత్రను 10 కిలోమీటర్ల తర్వాత స్థానికులు గుర్తించారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు. అలాగే పాత్రికేయులు కంటబడటంతో అది ప్రపంచానికి వెల్లడైంది. ఈ ఘటన దృశ్యం వివిధ ఛానెళ్లలో, వార్తా పత్రికలలో, సామాజిక మాధ్యమాలలో హల్‌చల్‌ చేయటంతో దేశ, విదేశాల్లోని పలువురి దృష్టిని ఆకర్షించింది. బహ్రెయిన్‌ దేశరాజు కుటుంబీకులను కూడా ఈ దృశ్యం కదిలించింది. చలించి పోయిన బహ్రెయిన్‌ ప్రధాని షేక్‌ ఖలీఫా బన్‌ సల్మాన్‌ ఆల్‌ ఖలీఫా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పంపా లని ఆ దేశ భారత రాయబారిని కోరారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ గిరిజనునికి భారీ ఆర్థిక సహాయం అందిచవచ్చు గానీ, మరెంతో మంది ఇలాంటి దీనుల స్థితిని మార్చలేడు కదా? మరి ఆపని ఈ దేశ ఏలికలు చేయాలి. మన ప్రధాని మోడీగారు మాత్రం కనీసం ఇంతవరకు పెదవి విప్పలేదు. 
రెండో ఉదంతం కూడా ఈ రాష్ట్రానికి సంబందిం చిందే బాలసోర్‌ దగ్గర సౌరో రైల్వేస్టేషన్‌ సమీపంలో ఒకగూడ్సు రైలు గుద్దటంతో 80 ఏళ్ల వితంతు మహిళ మరణించింది. అన్నేళ్ల జీవితానుభవంతో ఎన్నోచావులను, చివరి ప్రయణాలను చూసి ఉంటుంది. కానీ తన అంతిమ యాత్ర ఇంత అమానుషంగా ఉంటుందని ఆమె కలలో కూడా అనుకొని ఉండదు. రైలు పట్టాల మీద పడి ఉన్న ఆమె శవాన్ని పోస్టుమార్టం చేయటానికి ఆస్ప్రతికి చేర్చాలి. అయితే అధికారులు అంబులెన్స్‌ ఏర్పాటు చేయకపోవటంతో శవాన్ని నడుందగ్గర విరచి, గుడ్డలో చుట్టి వెదురు బొంగుకు కట్టి మోసుకెళ్తున్న దృశ్యం మనసు ను తొలిచివేస్తుంది. యుథా తథ స్థితిలో మృతదేహం తరలింపు సాధ్యం కాదు. గనుక అలా చేశానని ఆ పనికి పాల్పడ్డ వ్యక్తి సంజాయిషీ ఇచ్చాడు. తనకళ్లేదుట ఇలా జరగటం చూసి ఆ వృద్ధురాలి కొడుకు రోదిస్తుండడం కూడా ఆ దృశ్యంలో కనబడింది. 
ప్రసవవేదన మాటల్లో వర్ణించలేం. పురిటినొప్పులకు పడుతున్న కుమార్తెను ఆమె తండ్రి సైకిల్‌పైనే ఆసుపత్రికి తీసుకువెళ్లటమే కాదు, అక్కడ ప్రసవం జరిగిన తరువాత పసికందుతో పచ్చి బాలింతైన కుమార్తెను అదే సైకిల్‌పై ఇంటికి తీసుకురావడం దిగ్భ్రాంతి కర విషయం. ఇది మధ్యప్రదేశ్‌లోని చత్తాపూర్‌ జిల్లాలో షాపూర్‌ గ్రామానికి చెందిన గిరిజనుల దీనస్థితి. నానాభారు కుమార్తె పార్వతి (22 సంవత్సరాలు) గర్భవతి. పురిటి నొప్పులు రావటంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సిద్దమైన తండ్రి నానాబారు ప్రభుత్వం నిర్వహిస్తున్న ''జనని ఎక్స్‌ప్రెస్‌'' అంబులెన్స్‌కు పదేపదే ఫోన్లు చేశారు. అయితే వారు స్పందించలేదు. అంబులెన్స్‌ రాకపోవటంతో సైకిల్‌పై కుమార్తెను ఎక్కించుకొన్న నానాబారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి చేరుకొన్నాడు. అక్కడ పార్వతికి సుఖప్రసవమై పండంటి బాబుకు జన్మనిచ్చింది. అప్పటి వరకు పడ్డశ్రమ, మానసిక ఒత్తిడిని మరచిపోయి తాతైనం దుకు ఎంతగానో సంతోషించాడు నానాభారు. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. తిరిగి కుమార్తెకు పుట్టిన పసిబిడ్డను ఇంటికి తీసుకెళ్లేందుకు సిద్దమైన నానాభారు అంబులెన్స్‌ ఏర్పాటు చేయవలసిందిగా ఆసుపత్రి వర్గాలను కోరాడు. అయితేవారు పట్టించుకోకపోవటంతో తన సైకిల్‌పైనే పచ్చి బాలింతను, చిన్నారిపసిగుడ్డును తీసుకొని ఇల్లు చేరాడు. ఇదంతా మీడియా దృష్టికి రావటంతో బయట ప్రపంచానికి తెలిసింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన 12 ఏళ్లకొడుకుని భుజానవేసుకొని ఆసుపత్రుల చుట్టూ పరుగులు తీసిన తండ్రికి జీవితాంతం మరువలేనంత దు:ఖాన్ని మాత్రమే మిగిల్చింది మనవైద్య వ్యవస్థ. తండ్రి భుజాలమీదే కన్ను మూశాడు ఆ బాలుడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది ఈ విషాదం. కాన్పూర్‌కు చెందిన నిరుపేద మెకానిక్‌ సునీల్‌ కుమార్‌ (36) కుమారుడు అన్షు (12) 6 వ తరగతి చదువుతున్న విద్యార్థి. కొద్దిరోజుల క్రితం ఆ చిన్నారికి జ్వరం వచ్చింది. తల్లిదండ్రులు ఇంటికి దగ్గరలోనే స్థానిక చిన్నక్లినిక్‌లో చూపించారు. రెండురోజులు మందులు వాడినా తగ్గకపోవటంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లిన తండ్రికి ''సర్కారు దవాఖానా''లో వైద్యం ఎలా ఉటుందో అర్థమైంది. తీవ్ర జ్వరంతో సోయలేకుండా పడివున్న పిల్లవాడికి అత్యవసర వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు, అరగంట తరువాత తీరిగ్గావచ్చి బాలుడ్ని పిల్లల వార్డుకు తీసుకెళ్లాలని చెప్పి తప్పుకున్నారు. అక్కడికి 250 మీటర్ల దూరంలో ఉన్న పిల్లల వార్డుకు తీసుకెళ్లెటానికి కనీసం స్ట్రెచర్‌ ఇమ్మని బ్రతిమలాడిన వారు కనికరించలేదు. అంబులెన్స్‌ కూడా లేదు. అంతే బాలుడ్ని భుజాన వేసుకొని వార్డుకు పరుగులు తీశాడా తండ్రి. అదే సమయంలో ఆసుపత్రి ఆవరణలో ఉన్నపాత్రికేయుడు ఆ తండ్రి పరుగులు తీస్తున్నదృశ్యాన్ని వీడియో కెమెరాలో చిత్రీకరించాడు. అయినా కొడుకును కాపాడుకోలేక పోయాడు. ఆసుపత్రికి వెళ్లేసరికి పిల్లవాడు కన్నుమూశాడు. తమవద్దకు తీసుకొచ్చేసరికే పిల్లవాడు చనిపోయాడని వైద్యులు చెప్పారు. పిల్లల వార్డుకు తీసుకురావటానికి ముందు తన కూమారుడు బతికే ఉన్నాడని, పిల్లవాడ్ని భుజాన వేసుకొని నడుచుకుంటూ అక్కడికి రావటానికి 10 నిమిషాలు పట్టిందని....తన కుమారుడు చనిపోయాడని కన్నీరుమున్నీరయ్యాడు. ఆ తండ్రి.. కంటిపాపల్లో ఎటువంటి కదలికలు లేని ఆ బాలుడు తన నిర్జివమైన కన్నులతో ఈ వ్యవస్థవైపు చూస్తు... తన బాల్యాన్ని విజయవంతంగా నిద్రపుచ్చిన ఈ వ్యవస్థను ప్రశ్నిస్తున్నాడు. ఇంతకీ నా చావుకి బాద్యులెవరు? ఏడు దశాబ్దాల స్వాతంత్య్రపు ఫలాలు ఇవేనా? నిజంగా ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిందా? మా మాస్టారు న్నినటి ఆగస్టు 15 జెండాపండుగలో జాతీయ జెండాను ఎగురవేస్తూ మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చిందని చెప్పటం అబద్దమా? అని ప్రశ్నిస్తూ తన కంటి పాపలను శాశ్వతంగా మూసుకున్నాడా బాలుడు. నిజానికి ఇటువంటి సంఘటనలు దేశంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలు ఒడిశా, మధ్యప్రదేశ్‌ యుపిలకే పరిమితమైలేవు. కొంతకాలం క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఒకశిశువును ఎలుకలు కొరికి చంపేస్తే.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చీమలు కుట్టి మరో శిశువు కన్ను మూసింది. ఇవన్నీ చూసినప్పుడు, విన్నప్పుడు ఇంత అమానవీయమైన, అమానుషమైన సమాజంలో మనం జీవిస్తున్నామా? రేపు మనకి ఆ పరిస్థితి రాదనీ గ్యారంటీ ఏముంది? ఎవరిదైనా అత్యంత విలువైన ప్రాణమేకదా? ఈవిలువైన ప్రాణాలు దూదిపింజల్లా గాలిలో కలిసి పోవాల్సిందేనా? అని దిగ్భ్రాంతికి లోనవుతాం. సరిగ్గా ఆలోచిస్తే ఏడుదశాబ్దాల స్వాతంత్య్రం వల్ల ఒరిగిందేమిటన్న సందేహం కలుగుతుంది. పాలకులు ఊదరగొడుతున్న 'అభివృద్ధి' భూటకమని తేలిపోతుంది. అట్టడుగు నిరుపేద బడుగు జీవులకు అందని అభివృద్ధి వల్ల ప్రయోజనమే మిటన్న ప్రశ్నతలెత్తుతుంది. పాలకులు మాట్లాడుతున్న 'అభివృద్ధి' సంపన్నుల, కార్పొరేట్‌లకి అనిఅర్థమౌతుంది. ఇలాంటి ఉదంతాలు బట్టబయలైనప్పుడల్లా ఆవేదన చెందినట్లు, చర్యలు తీసుకుంటున్నట్లు కనబడటం మన ప్రభుత్వాలకు మాములే. 
వైద్యరంగం మీద మన ప్రభుత్వాల తీరు దారుణం. ప్రపంచంలోనే అతితక్కువ మొత్తాన్ని ప్రజారోగ్యం కోసం ఖర్చుచేస్తున్న దేశాల్లో భారతదేశం కూడా ఒక్కటి. దీని కారణంగా బడుగు వర్గాలపై ఆ భారం మోయలేనంతగా పడి వారి ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. మనదేశంలో ప్రజల ఆరోగ్యం కోసం ఖర్చుచేస్తున్న డబ్బులో ప్రభుత్వం చేస్తున్నది 15 శాతం మాత్రమే. 85 శాతం ప్రజలు తమ సొంత డబ్బుతోనే వైద్యం చేయించుకుంటున్నారు. (ఒక సర్వేప్రకారం) ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వైద్యం వలన వచ్చే ఆదాయంలో ఎక్కువభాగం వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. దీనివలన మధ్యతరగతి, పేద ప్రజలపై అప్పులభారం పెరిగి ఉన్న కొద్ది ఆస్తులు అమ్ముకొని దీవాళా తీస్తున్నారు. భారం మోయలేని వారు ఆకాల మృత్యువాతకు గురౌతున్నారు. ప్రపంచ వ్యాధుల భారంతో ఒక్క భారతదేశం వాటానే 21 శాతం గా ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 1991 నుంచి దేశంలో అమలు లో వున్న ఆర్థిక సంస్కరణలు ప్రపంచ బ్యాంకు విధానాల వలన వైద్యరంగంపై అనేక దుష్పరిణామాలకు దారితీసింది. ప్రజల ప్రాథమిక హక్కయిన ఆరోగ్యాన్ని ఓ అంగడి వస్తువుగా మార్చి మార్కెట్‌ శక్తుల చెప్పుచేతుల్లో ఉండేలా మార్చింది. కార్పొరేటు ఆసుపత్రులు పుట్టు కొచ్చాయి. శవాలమీద కూడా వ్యాపారం చేయటమే వీరి ధ్యేయంగా ఉంది. ప్రపంచీకరణ కారణంగా వైద్యరంగంపై చేసే వ్యయం వృథా ఖర్చుగా పాలకులు భావిస్తున్న కారణంగా మన జిడిపిలో అతి తక్కువగా కేవలం 1.3 శాతం నిధులు మాత్రమే ప్రజారోగ్యం కోసం ఖర్చు చేస్తున్నారు. అంతర్గత ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న అమెరికా తన జిడిపిలో 17. 9 శాతం ఖర్చుపెడుతోంది. మనకంటే బాగా వెనుకబడిన ఆఫ్ఘనిస్తాన్‌ 8.6 శాతం ఆరోగ్యంపై ఖర్చుచేస్తుంటే రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్న వెనుకబడిన శ్రీలంక, ప్రజారోగ్యంపై చేస్తున్న ఖర్చులో భారతదేశం సగం కూడా ఖర్చుచేయటం లేదు. శ్రీలంకలో ఒక్కోవ్యక్తి పైరు 5,500 కు పైగా ఖర్చుచేస్తుంటే భారత్‌లో 2,600 కేటాయిస్తున్నారు. దీన్ని బట్టి 125 కోట్ల భారతీయులు ఆరోగ్యంపై మన పాలకుల వైఖరి ఏ పాటిదో రుజువవుతోంది. ఇక్కడ ప్రత్యేకంగా సోషలిస్టు క్యూబా దేశ ప్రజారోగ్యవ్యవస్థ గురించి చెప్పుకోవాలి. ఈ దేశం ఈ విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా వుంది. ఈ దేశంలో విద్యా వైద్యం ఉపాధి లాంటి ప్రజల మౌలిక అవసరాల ప్రాథమికహక్కుగా అమలౌతున్నాయి. మనకంటే 12 సంవత్సరాల వెనుక విప్లవాన్ని విజయవంతంగా చేసుకొన్న క్యూబా వైద్యరంగంలో గణనీయమైన ప్రగతి సాధించింది. అక్కడ ప్రతి 150 మందికి ఒక వైద్యుడు ఉండే విధంగా అభివృద్ధి చెందింది. ఇది అభివృద్ధి చెందిన దేశాలకుకూడా ఈర్ష్య కలిగిస్తుంది. ఎందుకంటే యూరప్‌ దేశాలలో ప్రతీ 330 మందికి ఒక వైద్యుడు ఉండగా అమెరికాలో 417 మందికి ఒక వైద్యుడు ఉన్నాడు. పై పెచ్చు అంతర్జాతీయ సోదర దృక్పథంతో క్యూబా తోటిలాటిన్‌ అమెరికా దేశాలకు వైద్య బృందాలను పంపించింది. మొత్తం 40 వేల మంది క్యూబా వైద్యులు, సిబ్బంది ఇతర దేశాలలో పనిచేస్తున్నారు. క్యూబాలో వ్యాధి వచ్చిన తరువాత వైద్యం చేయటం కన్నా అసలు వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అమెరికా కుట్రల కారణంగా దశాబ్దాలుగా ఆర్థిక, వాణిజ్య, దిగ్భందానికి గురై బయట దేశాల నుండి ఎలాంటి సహాయము లేకుండానే ఈ అభివృద్ధికి క్యూబా సాధించింది. సోషలిస్టు వ్యవస్థ వలననే ఇది సాధ్యమైనది. అలాగే విప్లవ చైతన్యం అక్కడి ప్రజల్లో ఉండబట్టి ఇంతటి ప్రగతిని సాధించింది. ఈ దేశాలను చూసైనా భారతపాలకులు కళ్లు తెరవాలి. ఇకనైనా ఆరోగ్యం కోసం జిడిపిలో కనీసం 5 శాతం ఖర్చుచేయాలి. భారతదేశా నికి అత్యున్నత ప్రమాణాలలో కూడిన సమగ్ర ప్రాథమిక ఖర్చు ఆరోగ్యం సేవలు, ప్రజలకు అందుబాటులోకి రావాలి. దేశంలో ఇప్పటికీ పెద్దసంఖ్యలో ప్రజలు గ్రామీణ ప్రాంతా లలో (83.3 కోట్లు) 68 శాతం మంది నివసిస్తు న్నారు. కాబట్టి గ్రామీణ వైద్యరంగాన్ని తక్షణం ప్రాధాన్యత ఇవ్వాలి. అసలు వ్యాధులు రాకుండా ఉండే చర్యలు తీసుకోవాలి. అందుకు గానూ మంచి పౌష్టికాహారం, తాగటానికి మంచినీరు సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ కాలుష్య రహిత వాతావరణం కనీస వసతులు గల ఇల్లు, ఉపాధి అందరికీ విద్య, శాస్త్రీయ రోగనివారణ వ్యవస్థలు ఉండాలి. మందుల రంగం పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి. ముఖ్యంగా నాగరికతకు దూరంగా ఎలాంటి సదుపాయాలు లేని అడవి కొండ కోనల్లో జీవనం సాగిస్తున్న ఆదివాసులను రోగాల బారినుండి కాపాడాలి. ఏమైనా ఒక సమగ్ర ప్రజారోగ్య వ్యవస్థను నిర్మించి వైద్యం ప్రజలకి అందుబాటులోకి తీసుకరావటంలో భారత పాలకవర్గాలు పూర్తిగా విఫలమైన చరిత్ర మన కళ్లముందు కనబడుతుంది. కాబట్టి మానవాళి అభ్యున్నతికి క్యూబా చూపిన సోషలిస్టు సామాజిక వ్యవస్థను భారత ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలి. అటువంటి ప్రత్యామ్నాయ సోషలిస్టు వ్యవస్థను నిర్మించుకోవ టమే నేడు భారత ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం. అప్పుడు మాత్రమే ఈ దేశ ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించ బడతాయి. 



ప్రసవవేదన మాటల్లో వర్ణించలేం. పురిటినొప్పులు పడుతున్న కుమార్తెను ఆమె తండ్రి సైకిల్‌పైనే ఆసుపత్రికి తీసుకువెళ్లటమే కాదు, అక్కడ ప్రసవం జరిగిన తరువాత పసికందుతో పచ్చి బాలింతైన కుమార్తెను అదే సైకిల్‌పై ఇంటికి తీసుకురావడం దిగ్భ్రాంతికర విషయం. ఇది మధ్యప్రదేశ్‌లోని చత్తాపూర్‌ జిల్లాలో షాపూర్‌ గ్రామానికి చెందిన గిరిజనుల దీనస్థితి.    
- షేక్‌ కరిముల్లా,

No comments:

Post a Comment