రోహిత్ వేముల తల్లి రాధిక అక్రమంగా రిజర్వేషన్ సదుపాయాలు పొందేందుకే తనను తాను దళితురాలిగా 'చిత్రించుకున్నారు'... రోహిత్‌ను హాస్టల్ నుంచి బహిష్కరించాలని వర్సిటీ అధికారులు తీసుకున్న నిర్ణయం 'అత్యంత సహేతుకమైంది'... రోహిత్ ఆత్మహత్యకు అతని వ్యక్తిగత సమస్యలే కారణం తప్ప 'వివక్ష కాదు'.... కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలు 'తమ బాధ్యతల్ని నిర్వర్తించారే' తప్ప హెచ్‌సీయూ అధికారులపై ఎలాంటి ఒత్తిడీ చేయలేదు....
ఇవీ రోహిత్ ఆత్మహత్యపై మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన న్యాయవిచారణ కమిటీ నివేదికలోని కీలక నిర్ధారణలు! అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఎ.కె. రూపన్వాల్తో ఈ ఏకసభ్య కమిటీని రోహిత్ చనిపోయాక 11 రోజులకు, జనవరి 28న హెచ్ఆర్డీ ఏర్పాటు చేసింది. రూపన్వాల్ 41 పేజీల నివేదికను ఆగస్టులో సమర్పించారు. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. నిజానికి రోహిత్ కులాన్ని నిర్ధారించడం విచారణ కమిటీ పరిధిలో లేనే లేదు. రోహిత్ ఆత్మహత్యకు కారణాల్ని తెలుసుకోవడం, యూనివర్సిటీలో వివక్ష తీరుతెన్నులు ఎలా వున్నాయో అంచనా వేయడం, వాటి ఆధారంగా తగిన సిఫార్సులు చేయడం... ఇవే కమిటీకి అప్పగించిన కర్తవ్యాలు. అయినప్పటికీ 12 పేజీల తుది నిర్ధారణలలో 4 పేజీలలో రాధిక కులంపై సాగించిన పరిశోధన వివరాలే ఉన్నాయి. రాధికను కన్న తల్లిదండ్రుల పేర్లు తెలియనప్పుడు వారు 'మాల' కులానికి చెందిన వారే అయి వుంటారని విశ్వసించలేమని కమిటీ అభిప్రాయపడింది. అయితే ఈ విషయంలో గుంటూరు జిల్లా కలెక్టర్ విచారణ జరిపించి రోహిత్‌ది 'మాల' కులమేనని నిర్ధారించారు. దాని ఆధారంగా షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్ (ఎన్సీఎస్సీ) చైర్మన్ పి.ఎల్. పునియా రోహిత్ దళితుడే అని స్పష్టం చేస్తూ, రూపన్వాల్ నిర్ధారణ బూటకమని గత అగస్టులోనే ప్రకటించడం గమనార్హం.

|| నేతలకు క్లీన్ చిట్ ||
తన నివేదికలో జస్టిస్ రూపన్వాల్ కమిటీ కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలకు క్లీన్చిట్ ఇచ్చింది. వర్సిటీ అధికారులపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని పేర్కొనడం ద్వారా రోహిత్ మరణానికి అధికారులెవరూ బాధ్యులు కాదని నిర్ధారించింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్రోక్టోరియల్ బోర్డు నివేదిక ఆధారంగా రోహిత్ సహా ఐదుగురు విద్యార్థులను హాస్టల్ నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న చర్య పూర్తిగా సహేతుకమైందని కమిటీ సర్టిఫికేట్ ఇచ్చేసింది! దీనికీ, మంత్రి దత్తాత్రేయ హెచ్ఆర్డీకి రాసిన లేఖకూ ఎలాంటి సంబంధం లేదని రూపన్వాల్ కమిటీ నిర్ధారించింది. స్థానిక బీజేపీ ఎంఎల్సీ రామచంద్రరావు, క్యాబినెట్ మంత్రులు స్మృతి, దత్తాత్రేయలు తమ తమ విధులను నిర్వర్తించారని వారి ఒత్తిళ్లేవీ లేవని కమిటీ తేల్చింది.
|| తన ఆత్మహత్యకు రోహిత్ స్వయంగా బాధ్యుడు ||
రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డ రోజున తమ బహిష్కరణను సవాలు చేస్తూ విద్యార్థులు హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. కాబట్టి ఆ కారణంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండకపోవచ్చని రూపన్వాల్ కమిటీ పేర్కొంది. అట్లాగే రోహిత్ సూసైడ్ నోట్లో తాను ప్రాపంచిక వ్యవహారాలతో అసంతృప్తి చెందినట్టుగా ఉందని నివేదిక తెలిపింది. 'అతనిలో అసంతృప్తికి కారణాలేమిటో అతనికే బాగా తెలుసు... తన చుట్టూ జరుగుతున్న కార్యకలాపాల పట్ల సంతృప్తిగా లేడన్న సంగతి ఆ లేఖ ద్వారా తెలుస్తుంది. తన ఆత్మహత్యకు ఎవరూ కారణమని ఆయన పేర్కొనలేదు' అని నివేదికలో రాశారు.
|| మండిపడ్డ విద్యార్థి లోకం ||
రోహిత్ ఆత్మహత్యకు బాధ్యురాలైన హెచ్ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీ స్వయంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు కాబట్టి దాని నుంచి ఇందుకు భిన్నంగా మరేమీ ఆశించలేమనీ హెచ్‌సీయూ విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది. బీజేపీ ప్రభుత్వం తాము చెప్పాలనుకున్న విషయాలకు ఒక న్యాయమూర్తి ముద్ర కావాలనుకోవడం వల్లనే, కేవలం అందుకోసమే రూపన్వాల్ కమిటీని ఏర్పాటు చేసిందని కమిటీ తెలిపింది. దీనిని మాయావతి ఆనాడే పార్లమెంటులో తిరస్కరించారనీ కమిటీ గుర్తు చేసింది. హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన ఒక వ్యక్తి ఇంత ఘోరంగా వ్యవహరించడమేమిటని ఎన్సీఎస్సీ చైర్మన్ పునియా గతంలోనే అగ్రహం ప్రకటించారన్న విషయం కమిటీ తెలిపింది.
|| సిపిఎం ఆగ్రహం నివేదిక తిరస్కరించాలని పిలుపు ||
రూపన్వాల్ కమిటీ నివేదికను తిరస్కరించాలని సీపీఐ(ఎం) హెచ్ఆర్డీని డిమాండ్ చేసింది. రోహిత్ తల్లి తన, తన కుటుంబ సభ్యుల కుల గుర్తింపును తప్పుగా సృష్టించారం టూ నివేదిక చేసిన నిర్ధారణలు అత్యంత అభ్యంతరకరమైనవని పార్టీ పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. విషాదకరమైన రోహిత్ వేముల ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై నివేదికను ఇవ్వాలని కోరుతూ రూపన్వాల్ కమిటీని ఏర్పాటు చేయగా, అది తన చట్టబద్ధ పరిధినీ, పరిమితులనూ దాటి పోయిందని పార్టీ ఆరోపించింది. రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన పరిణామాల్లో మంత్రుల, వైస్ చాన్సలర్, తదితర అది óకారుల పాత్రేమీ లేదంటూ కమిటీ వారికి క్లీన్చిట్ ఇవ్వడం పట్ల పొలిట్‌బ్యూరో ఆగ్రహం వెలిబుచ్చింది. ఈ నివేదికను నిర్ద్వం ద్వంగా తిరస్కరించాలని అది హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖ ను డిమాండ్ చేసింది. అత్యాచారాల చట్టం కింద కేసులు నమోదైన వీసీని, మంత్రులనూ కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నా లన్నింటినీ అది తీవ్రంగా ఖండించింది. రాధిక వేములపై చేసిన ఆరోపణలు నేరపూరిత పరువునష్టంతో సమానమంటూ, అవి అత్యంత గర్హనీయమని ప్రకటనలో పేర్కొంది.

No comments:
Post a Comment