ఒక బూర్జువా-భూస్వామ్య సమాఖ్య రాజ్యంలో ఒక ప్రాంతీయ ప్రత్యామ్నాయ అభివృద్ధి వ్యూహాన్ని అమలు చేయటం సాధ్యమా? భారత దేశంలోని వామపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి ప్రయత్నాలలో కేరళది విజయ గాథ. సాధారణ పౌరులకు కనీస అవసరాలైన విద్య, ఆరోగ్య సంరక్షణ, గృహ వసతి, వృద్ధాప్యంలో సామాజిక భద్రత వంటి సౌకర్యాలను కేరళలోని వామపక్ష ప్రభుత్వం అందించగలుగు తున్నది. వీటన్నింటి ప్రభావంతో కేరళ ప్రజల జీవన ప్రమాణాలు బాగా పెరిగాయి.
కేరళలో మానవాభివృద్ధి సూచికలు జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ స్థాయిలో నమోదవు తున్నాయి. అత్యంత దుర్మార్గమైన కుల వివక్షను రూపు మాపటంలో కేరళలోని వామపక్ష ప్రభుత్వం సఫలీకృతమైంది. భూ సంస్కరణలను అమలు చేయటం జరిగింది. సమిష్టిగా బేరసారా లాడే కష్టజీవుల హక్కును ఆచరణలో అమలయ్యేలా వామపక్ష ప్రభుత్వం చేసింది. వీటన్నింటినీ ప్రస్తుతమున్న సమాఖ్య వ్యవస్థలో సాధించటం జరిగింది. కేరళకు చెందిన ఈ ప్రత్యేక లక్షణాల మూలాలు వ్యవస్థీకృత వామపక్షం ఆవిర్భవించక ముందు 19వ శతాబ్దం చివరిలో సంభవించిన సామాజిక సంస్కరణలలో ఉన్నాయి. అయితే ప్రజల ఆకాంక్షలను విస్తృతపరచి, వాటిని ముందుకు తీసుకుపోయేందుకు ఒక స్పష్టమైన ప్రత్యామ్నాయ అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించిన ఘనత వామపక్షానిదే.
కేరళలో మానవాభివృద్ధి సూచికలు జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ స్థాయిలో నమోదవు తున్నాయి. అత్యంత దుర్మార్గమైన కుల వివక్షను రూపు మాపటంలో కేరళలోని వామపక్ష ప్రభుత్వం సఫలీకృతమైంది. భూ సంస్కరణలను అమలు చేయటం జరిగింది. సమిష్టిగా బేరసారా లాడే కష్టజీవుల హక్కును ఆచరణలో అమలయ్యేలా వామపక్ష ప్రభుత్వం చేసింది. వీటన్నింటినీ ప్రస్తుతమున్న సమాఖ్య వ్యవస్థలో సాధించటం జరిగింది. కేరళకు చెందిన ఈ ప్రత్యేక లక్షణాల మూలాలు వ్యవస్థీకృత వామపక్షం ఆవిర్భవించక ముందు 19వ శతాబ్దం చివరిలో సంభవించిన సామాజిక సంస్కరణలలో ఉన్నాయి. అయితే ప్రజల ఆకాంక్షలను విస్తృతపరచి, వాటిని ముందుకు తీసుకుపోయేందుకు ఒక స్పష్టమైన ప్రత్యామ్నాయ అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించిన ఘనత వామపక్షానిదే.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాల కారణంగా సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు ఉండే స్వయం ప్రతిపత్తి బలహీనపడింది. దానితో ఒక ప్రత్యామ్నాయ వ్యూహాన్ని ఆచరణలోకి తేవటం సంక్లిష్టంగా మారింది. అయినప్పటికీ కేరళలోని రాజకీయ శక్తులలో ప్రధానమైనదిగా ఉన్న వామపక్షం ప్రజల అవసరాలను తీర్చటానికి ప్రాధాన్యతనిస్తున్నది. అంతేకాక ఉత్పత్తి శక్తులు వేగంగా వృద్ధిచెందటానికి ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి వ్యూహాన్ని అనుసరిస్తున్నది. పునఃపంపిణీ చేసేందుకు వామపక్షం పనికి వస్తుందిగానీ దానికి అభివృద్ధి ఎజెండా అనేదే లేదని మితవాదులు చేసే వాదన అందరికీ తెలిసిందే. ప్రముఖ ఉదారవాద అర్థశాస్త్రవేత్త కెఎన్ రాజ్ ఒకసారి ఇఎంఎస్ నంబూద్రిపాద్‌తో హాస్యంగా 'మీ కమ్యూనిస్టులకు కేక్‌ను పంచటం తెలుసుగానీ దానిని తయారు చేయటం తెలియదు. నేడు కేరళకు కావలసింది ఉత్పత్తిని పెంచటం. అందుకు మీరు మార్గాన్ని సుగమం చేయాలి' అని అన్నారు. ఇలాంటి విమర్శలకు సమాధానం చెప్పటాని కన్నట్టు 1994లో ఇఎంఎస్ కేరళ అధ్యయనాల గురించి ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. ఆ తరువాత ఒక ప్రజా ప్రణాళికను రూపొందించి అమలుచేసేందుకు ప్రయత్నించారు. 2016లో జరిగిన కేరళ అధ్యయనాల అంతర్జాతీయ సదస్సులో నూతనంగా జరిగిన మేధోమథనం తరువాత ఒక స్పష్టమైన ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా రూపుదిద్దుకుంది. ఆ సదస్సులో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా 2016లో వామపక్ష ప్రజాతంత్ర కూటమి(ఎల్డిఎఫ్) ఎన్నికల ప్రణాళిక తయారయింది. ఈ ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా ఆధారంగా అనేక ప్రాజెక్టులను, స్కీములను 2016-17 బడ్జెట్లో ప్రవేశపెట్టటం జరిగింది. ఈ నూతన వ్యూహం ఆచరణలో రెండు కాళ్ళపై సమర్థవంతంగా పనిచేస్తున్నదని నేను భావిస్తున్నాను. సామాజిక భద్రతను, సంక్షేమ కార్యక్రమాలను, సంప్రదాయ జీవనాధార వృత్తుల సంరక్షణను, ప్రజారోగ్యాన్ని, విద్యను, మహిళా సమస్యలతోపాటు అణగారిన ప్రజానీకం కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఒక పాదం సమగ్రంగా నిర్వహిస్తున్నది. మహిళల సమస్యలను మినహాయిస్తే ఈ సామాజిక విషయాల పట్ల కేరళ అభివృద్ధి ఎల్లవేళలా తన దృష్టిని సారించింది. ఇంతకు ముందే పేర్కొన్నట్టు సామాజిక రంగంలో కేరళ అనూహ్యమైన విజయాలను సాధించింది. అయితే ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలలో అనేక నూతన, రెండవ తరం సమస్యలు ముందుకొచ్చాయి. అణగారిన ప్రజలు ఎదుర్కొంటున్న ఈ ప్రత్యేక సమస్యలను పరిష్కరించాలి. ఈ సమస్యలను విస్మరించటమంటే వామపక్షం తన సార్థక నామానికి నీళ్ళు వదలమే అవుతుంది.
అయితే ఒక పాదంపైనే మనం ఎంతో దూరం నడవలేం. కేరళలో ఉత్పాదక రంగ వృద్ధిని వేగవంతం చేయటం ద్వారా విద్యావంతులైన యువత ఆశించే మంచి ఉద్యోగాలను సృష్టించటం సాధ్యపడుతుంది. కేరళ ప్రత్యామ్నాయ అభివృద్ధి వ్యూహంలో ఇది రెండవ పాదంగా ఉంటుంది. కేరళలో ఇప్పటి వరకూ శ్రమ తీవ్రత అధికంగా ఉండే సంప్రదాయ పరిశ్రమల ఆధారంగాను లేక విద్యుచ్ఛక్తి ఎక్కువగా అవసరమయ్యే రసాయన పరిశ్రమల ఆధారంగాను జరిగిన పారిశ్రామిక అభివృద్ధి ఇక ఏ మాత్రం ముందుకు సాగలేదు. జ్ఞాన, సేవా, ప్రావీణ్యతల ఆధారంగా ఉన్న రంగాలలో పరిశ్రమలను తక్షణమే కేరళలో స్థాపించవలసి ఉంటుంది. నిజానికి తనకున్న వనరుల స్వభావానికి ఇలాంటి అభివృద్ధి కేరళకు పొసుగుతుంది. ఈ రంగాలలోకి ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించకుండా ఈ పరివర్తనను సాధించలేము. అందుకోసం శ్రామిక చట్టాలను, పర్యావరణ చట్టాలను, భూ వినియోగ చట్టాలను నీరుగార్చటానికి వామపక్ష ప్రభుత్వం అంగీకరించజాలదు. ప్రస్తుత బడ్జెట్ ఉన్న స్థితిలో పోటీపడి పన్ను రాయితీలను కూడా ఇవ్వటం కుదరదు. అయితే ప్రయివేటు పెట్టుబడులు కేరళకు ఎందుకు రావాలి? దానికి సమాధానంగా పారిశ్రామిక కార్యకలాపాలు సాగించేందుకు కావలసిన సౌకర్యాలను ప్రపంచ స్థాయిలో నిర్మించటానికి మేము ప్రయత్నిస్తున్నాము. అంతేకాకుండా విద్య, ఆరోగ్య సంరక్షణలకు సంబంధించిన సామాజిక వ్యవస్థాపనను పెద్ద ఎత్తున మెరుగుపరుస్తున్నాము. ఈ దృష్టితోనే 2016-17వ సంవత్సర బడ్జెట్లో పెట్టుబడులను సమగ్రంగా కేటాయించారు.
ప్రస్తుత సంవత్సరంలో మేము రూ.20 వేల కోట్ల పాకేజీని ప్రకటించాము. రాబోయే ఐదు సంవత్సరాలలో ఈ పెట్టుబడిని దాదాపు 1 లక్ష కోట్ల రూపాయలకు పెంచాలనేది మా ఆకాంక్ష. గల్ఫ్ దేశాలను ఆవహించిన సంక్షోభం, వాణిజ్య పంటల ధరల పతనం వంటి సమస్యల వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుబడుతున్న సూచనలు వెలువడుతున్న స్థితిలో పెట్టుబడిలో అటువంటి పెరుగుదల అత్యంత అవసరం. ఈ కారణాల చేత మాంద్య నిరోధక ప్యాకేజీగా రూ.20 వేల కోట్లను మేము ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించాము.
ఒకవైపు రాష్ట్రాన్ని ఆవహించిన ఆర్థిక సంక్షోభం, మరోవైపు అప్పు చెయ్యటాన్ని 3 శాతం మించనివ్వని ఎఫ్ఆర్బిఎమ్ చట్టం విధించిన పరిమితితో ప్రభుత్వ పెట్టుబడులను మనం ఎలా పెంచగలం? ప్రధాన ప్రాజెక్టులను నిర్మించేందుకు కావలసిన నిధుల సమీకరణకు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించే స్పెషల్ పర్పస్ వెహికల్స్‌ను వ్యవస్థీకరించి, మరింతగా విస్తృతపరచవలసి ఉంటుంది. ఇందుకోసం మేము కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డును ఏర్పాటు చేస్తున్నాము. అనేక పద్ధతుల ద్వారా ఈ సంస్థ మార్కెట్లో నిధులను సమీకరించి, పెట్టుబడులను సమకూరుస్తుంది. బడ్జెట్ నుంచి ఈ సంస్థకు ఆదాయ వనరులు సమకూరేందుకు కావలసిన చట్టపరమైన చర్యలను తీసుకోవటం జరిగింది. అదే సమయంలో సమకూరిన నిధుల నుంచి ప్రభుత్వం వ్యయంలోకి ఏ మాత్రం తరలించకుండా ఉండేందుకు కావలసిన జాగ్రత్తలు తీసుకున్నాం. ఇది నిజంగా ఒక వినూత్న ప్రయోగం. దీనితో కేరళ ఆర్థిక వ్యవస్థపై గుణాత్మకమైన ప్రభావం ఉంటుంది. - థామస్ ఐజాక్

No comments:
Post a Comment