|| నేడే వియత్నాం విప్లవనేత హొచిమిన్ వర్థంతి ||
వియత్నాం కమ్యూనిస్టు ఉద్యమ పితామహుడు హోచిమిన్. ఫ్రెంచి, జపాన్ సామ్రాజ్యవాదుల దోపిడీకి వ్యతిరేకంగా వియత్నాం విముక్తి పోరాటానికి నేతృత్వం వహించి విజయకేతనం ఎగరేసిన మహోన్నత వ్యక్తి ఆయన. సామ్రాజ్యవాదుల కుట్రల ఫలితంగా రెండుగా చీలిన వియత్నాంలో ఉత్తర ప్రాంతాన్ని సోషలిజం దిశగా అడుగులు వేయించడమే కాక వియత్నాం పునరేకీకరణకు మార్గం చూపారు. అమెరికా సామ్రాజ్యవాదుల అత్యంత క్రూరమైన దురాక్రమణను సాహసోపేతంగా తిప్పికొట్టడానికి ప్రాతిపదికను నిర్మిం చారు. 'నిర్దిష్ట పరిస్థితులకు, నిర్దిష్టంగా మార్క్సిజాన్ని అన్వ యించుకోవడం' అనే లెనినిస్టు మూల సూత్రాన్ని అన్వ యించుకొని కచ్చితంగా అమలు పరచడం వల్లనే వీటన్నిం టినీ సాధించకలిగారు. ప్రపంచంలోనే అతి పెద్ద కమ్యూనిస్టు పార్టీలైన సోవియట్ కమ్యూనిస్టు పార్టీ, చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే ఆ రోజుల్లో ఇరు పార్టీలతోనూ స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ, ఇరువురి సహకారాన్నీ పొందగలిగిన వ్యక్తి హోచిమిన్. అదే సమ యంలో స్వంత వైఖరిని నిర్మొహమాటంగా వ్యక్తం చేయకలిగే వారు.
హోచిమిన్ (వియత్నాం భాషలో ''జ్ఞాని'') ప్రజల సుఖ సౌభాగ్యాల కోసం పోరాడిన యోధుడు. ఆయన అత్యంత ఘటనాభరితమైన జీవితాన్ని గడిపారు. పట్టుదల కలిగిన విప్లవకారుడూ, దృఢమైన మార్క్సిస్టు-లెనినిస్టు అయిన ఆయన, వియత్నాం విముక్తి పోరాట నాయకుడుగా, ఆగేయాసియాలో మొట్టమొదటి సోషలిస్టు రాజ్య నిర్మాతగా గణుతిగాంచారు. హోచిమిన్ అసలు పేరు ఎన్గుయెన్ తాత్ థాన్. ఆయన ఎన్ఘీ ఆన్ రాష్ట్రంలోని నామ్ దాన్ జిల్లాకు చెందిన కిమ్ లీన్ గ్రామంలో ఒక బడిపంతులు కుటుంబంలో 1890 మే 19న జన్మించారు. అనేక సంవత్సరాలపాటు సాగిన విప్లవ జీవితంలో ఆయన పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు తన పేరును అనేకసార్లు మార్చు కున్నారు. 1942లో ఆయన చివరకు పెట్టుకున్న పేరు ప్రపంచ కమ్యూనిస్టు. జాతీయ విముక్తి ఉద్యమాల చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఆయన యౌవనారంభంలోనే విప్లవ కార్యకలాపాల్లో నిమగమ య్యారు. ఫ్రెంచి వలస పాలకులకు వ్యతిరేకంగా పోరాడు తున్న స్థానిక దేశభక్తులైన ప్రజాతంత్రవాదులకు ఆయన తన 15వ ఏట వార్తాహరుడుగా పనిచేశారు. పాఠశాల చదువు పూర్తిచేసిన తరువాత ఆయన హుయెలోని జాతీయ కళాశా లలో చేరారు. అక్కడ చదువులో అద్భుత ప్రతిభను ప్రదర్శిం చారు. విప్లవోద్యమాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసేందుకూ, తన ప్రజల విముక్తికి మార్గాన్ని అన్వేషించేం దుకూ ఆయన విదేశాలకు వెళ్ళడానికి నిశ్చయించారు. 1911లో ఫ్రాన్స్‌కు వెళ్ళారు. ఒక సంవత్సరం పాటు ఆయన వేరు వేరు ఫ్రెంచి నౌకల్లో పనిచేస్తూ స్పెయిన్, పోర్చుగల్ లకు, అల్జీరియా మొదలైన ఆఫ్రికా దేశాలకూ వెళ్ళారు. ఈ యాత్రల సందర్భంలో లభించిన అనుభవాలను ఫ్రెంచి వలస విధాన వైఫల్యం అన్న గ్రంథ రచనకు వినియోగించు కున్నారు. జాతీయ విముక్తి యోధులు ఈ గ్రంథానికి ఎంతో విలువనిచ్చారు. ఆఫ్రికా నుంచి తిరిగివచ్చి, హోచిమిన్ లండన్ వెళ్ళారు. కఠినమైన పనులు చేస్తూ కూడా ఆయన పట్టుదలతో తన అధ్యయనం సాగించారు. తాను ఉన్న దేశాల్లోని విప్లవోద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. తన దేశ ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం పోరాటం సాగించారు.
అమెరికాలోని సామాజిక, రాజకీయ వ్యవస్థ గురించీ, ఆ దేశ ప్రజల జీవితాన్నీ, పోరాటాన్నీ గురించి తెలుసుకునేం దుకు ఆయన 1914 మధ్యలో ఆ దేశానికి వెళ్ళారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే రోజుల్లో పారిస్ తిరిగి వచ్చారు. రష్యాలోని అక్టోబరు మహా విప్లవానికి జేజేలర్పించిన, వలస దేశాల విముక్తికి మార్క్సిజం-లెనినిజమే మార్గమని గుర్తించిన మొట్టమొదటి వియత్నామీయులలో హోచిమిన్ ఒకరు. ఫ్రాన్స్‌లో ఉన్న రోజుల్లో ఆయన అక్కడ నివసిస్తున్న వియత్నాం ప్రజల మధ్య విప్లవ కృషిని చురుకుగా సాగిస్తూ ఉండేవారు. స్వదేశంతో శాశ్వత సంబంధాలు పెట్టుకుని, అక్కడకు పలు రకాల విప్లవ సాహిత్యాన్ని పంపుతూ ఉండేవారు. ఫ్రెంచి కామ్రేడ్స్ మద్దతుతో ఆయన 1921లో పారిస్‌లో ''వలస దేశాల ప్రజల యూనియన్'' అనే సంస్థనూ, లా పారియా(పీడితులు) అనే పత్రికనూ స్థాపించారు. ఆయనే పత్రికకు మేనేజరుగా, ప్రధాన సంపాదకునిగా, కోశాధికారిగా, పంపిణీదారుగా పనిచేశారు. ఈ పత్రిక వియ త్నాంలోనూ, ఫ్రాన్స్‌లో నివసిస్తున్న వియత్నాం కాందిశీకుల లోనూ బాగా ఆదరణ పొందింది. సోవియట్ యూనియన్ లోని జీవితం గురించీ, మార్క్సిస్టు, లెనినిస్టు బోధల గురించీ ఈ పత్రిక తన పాఠకులకు తెలియపరుస్తుండేది.
విదేశీ బానిసత్వాన్నుంచి, తన దేశ విముక్తి కోసం తహతహలాడే ఒక వియత్నాం దేశభక్తుడుగా రాజకీయ జీవితాన్ని ఆరంభించిన హోచిమిన్ క్రమేణా సోషలిజం వైపు, అజరామరమైన లెనినిస్టు బోధనల వైపు మొగ్గారు. ఆయన, ఆ తదుపరి రచించిన 'నన్ను లెనినిజానికి చేర్చిన మార్గం' అన్న కరపత్రంలో ఇలా చెప్పారు: ''మొట్టమొదట నాలో లెనిన్ పట్ల, మూడవ ఇంటర్నేషనల్ పట్ల విశ్వాసాన్ని పాదుగొల్పింది దేశభక్తి మాత్రమేగాని, కమ్యూనిజం కాదు. పోరాట క్రమంలో ఒక్కొక్క అడుగే ముందుకు సాగుతూ, ఆచరణపూర్వక కార్యకలాపాలలో పాల్గొంటూ మార్క్సిజం, లెనినిజాన్ని అధ్యయనం చేయడం ద్వారా క్రమేణా నేను ఒక యదార్థాన్ని తెలుసుకున్నాను. అదేమంటే పీడిత జాతులకూ, ప్రపంచమంతటా శ్రామిక ప్రజలకూ బానిసత్వం నుంచి విముక్తి ప్రసాదించగలది సోషలిజం, కమ్యూనిజం మాత్రమే'' హోచిమిన్ 1924 డిసెంబర్లో కాంటన్లో స్థిరపడి ఒక వియత్నాం విప్లవ సంస్థను నెలకొల్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 1923లో ఏర్పాటైన ''హృదయ సమైక్యత'' (తామ్ తామ్ క్సా) అనే సంస్థను ప్రాతిపదికగా చేసుకుని ఆయన 1925 జూన్‌లో ''వియత్నాం యువ విప్లవ కామ్రేడ్స్ అసోసియేషన్'' అనే సంస్థను స్థాపించారు. దేశంలో మార్క్సిస్టు-లెనినిస్టు సిద్ధాంతాన్ని ప్రచారం చేసేలాగా ఆయన ఈ సంస్థను నిర్వహించారు. 1927లో హోచిమిన్ విప్లవ పంథా అన్న చిన్న పుస్తకం రాశారు. వియత్నాం విప్లవోద్యమ ప్రధాన ధోరణులను ఈ రచన నిర్ధారణ గావించింది. ''వియత్నాం యువ విప్లవ కామ్రేడ్స్ అసోసి యేషన్'', ''నూతన వియత్నాం పార్టీ'' 1929లో మూడు స్వతంత్ర కమ్యూనిస్టు సంస్థలుగా చీలి, దేనికది విడిగా పనిచేయసాగాయి. ఈ పరిస్థితి దృష్ట్యా కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ కార్యనిర్వాహక వర్గం ఇండో-చైనా కమ్యూ నిస్టులకు పంపిన ఒక లేఖలో, ''శ్రామికవర్గ విప్లవ పార్టీ స్థాపన ఇండో-చైనా కమ్యూనిస్టులు నెరవేర్చవలసిన అన్నిటికన్నా అతి ముఖ్యమైన, అత్యవసరమైన కర్తవ్యం'' అని తెలియజేసింది. కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ కార్యవర్గ ఆదేశాన్ని అనుసరించి హోచిమిన్ హాంకాంగ్‌కు తిరిగివచ్చి పై మూడు కమ్యూనిస్టు సంస్థల ప్రతినిధుల విస్తృత సమావేశాన్ని ఏర్పాటుచేశారు. 1930 ఫిబ్రవరి 3న జరిగిన ఈ సమావేశంలో వియత్నాం కమ్యూనిస్టు పార్టీ స్థాపించ బడింది. కొద్దిమాసాల తరువాత దీనికి ఇండో-చైనా కమ్యూ నిస్టు పార్టీ అని పేరు పెట్టారు. ఆయన విదేశాల్లో గడిపిన దీర్ఘకాలంలో మార్క్సిజం-లెనినిజంను లోతుగా అధ్యయనం చేశారు. అంతర్జాతీయ విప్లవోద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నారు. విస్తార రాజకీయానుభవం గడించారు. వియత్నాం విప్లవ సిద్ధాంత, ఆచరణలకు ఈ అనుభవాన్ని ఆయన తరువాత అత్యంత ప్రతిభావంతంగా వర్తింప జేశారు. వియత్నాంకు తిరిగివెళ్ళాక ఆయన నిర్విరామ కార్యకలాపాల్లో మునిగిపోయారు. పార్టీ కార్యకర్తల కోసం అధ్యయన తరగతులు ఏర్పాటుచేశారు. ప్రజల్లో రాజకీయ ప్రచారం సాగించారు. దేశ విముక్తి కోసం కృషిచేసే సంస్థ లను స్థాపించారు. విప్లవ సైనిక దళాల నిర్మాణానికి అపార కృషి చేశారు. ''స్వతంత్ర వియత్నాం'' అనే పత్రికను ప్రచురించారు. ఉత్తర వియత్నాంలోని పాక్బోలో 1941లో జరిగిన ఇండో-చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ 8వ విస్తృత సమావేశాన్ని అజమాయిషీ చేశారు. సాయుధ తిరుగుబాటుకు చురుకుగా సన్నాహాలు చేయాలనీ, గెరిల్లా స్థావరాలను స్థాపించాలనీ ఈ సమావేశం నిర్ణయించింది. దేశ పరిస్థితిని లోతుగా వివేచన చేసి, ఈ సమావేశం ఒక విస్తృత కార్యక్రమాన్ని ఆమోదించింది. వియత్నాం విప్లవ పరిమాణంలో ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన ముందంజ. హోచిమిన్ చొరవ ఫలితంగా 1941 మేలో వియత్నాం స్వాతంత్య్ర సమితి(వియత్ మిన్ సంఘటన) ఏర్పాటయింది. 1944 ఆగస్టులో ఆయన తుయెన్ క్వాంగ్లో పార్టీ జాతీయ మహాసభను ఏర్పాటుచేశారు. ఈ మహాసభ సార్వత్రిక సాయుధ తిరుగుబాటు కోసం సన్నాహాలు చేయాలని తీర్మానించింది. వియత్ మిన్ సంఘటన రాజ కీయ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇదే ఆ తదుపరి పార్టీకీ, దేశ ప్రజలకూ ప్రధాన కార్యక్రమం అయింది. 1945, ఆగస్టు 15, 16లో జరిగిన పార్టీ మహాసభ వెనువెంటనే ప్రజా ప్రతినిధుల మహాసభ జరిగింది. హోచిమిన్ అధ్యక్షు లుగా జాతీయ విముక్తి కమిటీని ఈ మహాసభ ఎన్నుకుంది. దీనినే ఆ తరువాత వియత్నాం ప్రజాతంత్ర రిపబ్లిక్ తాత్కాలిక ప్రభుత్వంగా పునర్వ్యవస్థీకరించడం జరిగింది. 1945 ఆగస్టు విప్లవం విజయవంతమైంది. 1945 సెప్టెంబరు 2న హోచిమిన్ చారిత్రాత్మకమైన స్వాతంత్య్ర ప్రకటనను చేయ డంతో వియత్నాం ప్రజాతంత్ర రిపబ్లిక్ స్థాపన జరిగింది.
1946 జనవరిలో ఎన్నికైన జాతీయ శాసనసభ ప్రథమ సమావేశం హోచిమిన్ను ఏకగ్రీవంగా వియత్నాం ప్రజా తంత్ర రిపబ్లిక్కు అధ్యక్షుడుగానూ, ప్రధానిగానూ కూడా నియమించింది. 1955 వరకు ఆయన ప్రధాని పదవిని నిర్వహించారు. తమ వలస దేశాన్ని కోల్పోయినందుకు ఫ్రెంచి వలస పాలకులు సహించి ఊరుకోలేదు. వాళ్ళు 1945 సెప్టెంబరులో వియత్నాం ప్రజలపై యుద్ధం ఆరంభించారు. ప్రతిఘటనా యుద్ధాన్ని ప్రారంభించ వలసిందిగా 1946 డిసెంబరు 19న ప్రజలకు పిలు పిచ్చారు. ఆయన ఇలా ప్రకటించారు: ''దేశాన్ని పోగొట్టుకుని బానిసలమయ్యే కంటే సర్వస్వాన్నీ త్యాగం చేయడమే మేలని మనం తలుస్తాం.'' ఆ రోజుల్లో ఆయన జాతీయ ఐక్యతా పటిష్టతకు ప్రత్యేక ప్రాముఖ్యం ఇచ్చారు. 1951లో జరిగిన పార్టీ రెండవ మహాసభ ఇండో-చైనా కమ్యూనిస్టు పార్టీకి వియత్నాం వర్కింగ్ పీపుల్స్ పార్టీగా నామకరణం చేస్తూ తీర్మానించింది. ఈ మహాసభలో హోచిమిన్ పార్టీ అధ్యక్షు లుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఫ్రెంచి వలస పాలకు లకు వ్యతిరేకంగా హోచిమిన్ నాయకత్వాన జరిగిన వియత్నాం విముక్తి యుద్ధం, సుప్రసిద్ధమైన దీన్ బీన్ పూ విజయంతో సమాప్తమైంది. ఈ విజయం జెనీవా ఒప్పం దాలకు తోవతీసింది. యుద్ధ ఫలితంగా నాశనమైన జాతీ యార్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికై వియత్నాం ప్రజలను సమీకరించేందుకూ, శాంతియుత నిర్మాణానికి పరివర్తన సాధించేందుకూ హోచిమిన్ పరస్పరం సంబంధంగల రెండు వ్యూహాత్మక కర్తవ్యాలను ప్రతిపాదించారు. ఒకటి ఉత్తర వియత్నాంలో సోషలిస్టు సమాజ నిర్మాణం, రెండోది, దక్షిణ వియత్నాం విముక్తి కోసం, దేశాన్ని శాంతియుతంగా తిరిగి ఏకం చేసేందుకై పోరాడటం. శాంతియుత నిర్మాణ కాలం లోనూ, అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట కాలం లోనూ హోచిమిన్ దేశంలో విస్తృతంగా పర్యటించారు. అమెరికా సామ్రాజ్యవాదులను నిర్ణయాత్మకంగా తిప్పికొట్టా లని ఉద్బోధించారు.
ప్రభుత్వ వ్యవహారాల్లో తలమునకలుగా ఉన్నా హోచి మిన్ పార్టీని సైద్ధాంతికం గానూ, నిర్మాణరీత్యానూ పటిష్టం చేసేందుకు, పార్టీ నాయకత్వ పాత్రను ఇనుమడింప జేసేందుకు శ్రద్ధ వహించారు. కార్మిక, కర్షక బాంధవ్యం ప్రాతిపదికపై జాతీయ సంఘటనకు పుష్టం చేసేందుకు ఆయన నిరంతరం కృషి చేశారు. జాతీయ విప్లవ కర్తవ్యాలను ప్రపంచ విప్లవ కర్తవ్యాలతో మేళవించవలసిన అవసరాన్ని ఆయన పదేపదే నొక్కిచెప్పారు. పార్టీ, ప్రజలూ సోషలిస్టు కుటుంబాన్ని క్రియాశీలంగా కాపాడాలనీ, మార్క్సిజం, లెనినిజం, శ్రామికవర్గ అంతర్జాతీయత ప్రాతిపదికపై అంతర్జాతీయ కమ్యూనిస్టు, కార్మికోద్యమాల ఐక్యత, సంఘీ భావాలను పటిష్టం గావించాలనీ, జాతీయ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం, శాంతి కోసం ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న పోరాటానికి అండదండలనివ్వాలనీ ఆయన పదే పదే నొక్కిచెప్పారు. ఉత్తర వియత్నాంకూ, ఇతర సోషలిస్టు దేశాలకూ మధ్య సోదర సంబంధాలు పెంపొందడానికి ఆయన ఎంతగానో దోహదం చేశారు. హోచిమిన్ దృఢమైన అంతర్జాతీయతా వాది. ''మార్క్సిజం-లెనినిజం, శ్రామికవర్గ అంతర్జాతీయతల ప్రాతిపదికపైన, హేతువాద దృష్టితో, చైతన్యంతో వ్యవహరిస్తూ, సోదర పార్టీల మధ్య సంఘీ భావాన్ని పునరుద్ధరించేందుకు ఫలప్రదమైన దోహదం చేసేందుకు తన శక్తినంతా ఒడ్డి పాటుపడాలి'' అని ఆయన మరణించే ముందు వియత్నాం వర్కింగ్ పీపుల్స్ పార్టీని ఆదేశించారు. హోచిమిన్ శక్తి, ఉక్కులాంటి దృఢ సంకల్పం, అజేయమైన సాహసం.... ఇవన్నీ ఉన్నప్పటికీ, ఆయన నిరాడంబరత, మానవత సోవియట్, వియత్నాం ప్రజల, ప్రపంచ కమ్యూనిస్టుల, ప్రగతిశీలుర ప్రగాఢ గౌరవాదరా లను చూరగొన్నాయి. హోచిమిన్ పేరు ప్రపంచమంతటా ప్రగతిశీలుర హృదయాల్లోనూ, మానవాళి ఉజ్వల భవిష్యత్తు కోసం, ఆయన దేనికోసమైతే జీవితాంతం పోరాడారో ఆ కమ్యూనిజం కోసం పాటుపడే సమస్త యోధుల హృదయా ల్లోనూ శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఆ మహోన్నత యోధుడు 1969 సెప్టెంబర్ 3న మృతిచెందారు. (ప్రజాశక్తి )

No comments:
Post a Comment