యురీ దాడి తరువాత ఆరెస్సెస్, బిజెపిలు దుందుడుకువాదంతో పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయని పీపుల్స్ డెమొక్రసీ (పిడి) వ్యాఖ్యానించింది. 18 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న యురీ దాడి జరిగిన వెంటనే భారత్ దీనిపై ఎలా స్పందించాలన్న అంశం ముందుకొచ్చిందని,, ఈ ఏడాది జనవరిలో పఠాన్ కోట్‌లో వైమానిక స్థావరంపై దాడి జరిగినప్పుడు కూడా మోడీ ప్రభుత్వానికి ఇదేవిధమైన సమస్య ఎదురైందని పిడి తన తాజా సంపాదకీయంలో పేర్కొంది. పదవీ విరమణ చేసిన సైనికాధికారులు, తమకు తాము వ్యూహాత్మక నిపుణులమని చెప్పుకునేవారు టెలివిజన్ ఛానళ్ళ చర్చల్లో పాల్గొంటూ పాక్‌కు గట్టి గుణపాఠం నేర్పాలని డిమాండ్ చేశారు. యురీ దాడిపై స్పందించిన ఆరెస్సెస్, వాటి అనుబంధ సంస్థలు పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలంటూ నానా యాగీ చేస్తున్నాయి. రామ్ మాధవ్ వంటివారు పాకిస్తాన్ పీచమణచాలంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గత లోక్‌సభ ఎన్నికల్లో పాకిస్తాన్ పట్ల మన్మోహన్ సింగ్ మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నారంటూ తీవ్రంగా ధ్వజమెత్తిన విషయాన్ని పీడీ గుర్తు చేసింది. వీటన్నిటిని బట్టి చూసినప్పుడు ఈ తాజా కవ్వింపు చర్యపై మోడీ ప్రభుత్వం దుందుడుకు వైఖరి తీసుకునే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే సైనిక చర్యవల్ల ఎదురయ్యే పర్యవసానాలు, ఇబ్బందులు, పరిమితుల గురించి రాజకీయ నాయకత్వానికి కచ్చితమైన అంచనా వుండాలి అని పిడి సంపాదకీయం పేర్కొంది. రెండు అణు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తితే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా వుంటాయని పీడీ హెచ్చరించింది. వాస్తవాధీన రేఖ వెంబడి పరిమిత దాడులు చేస్తామని అంటున్నారు. పరిమిత దాడి అంటే సరిహద్దు గుండా క్షిపణి దాడులు, రాకెట్ దాడులని, 2014-15లో సరిహద్దుల్లో జరిగిన కాల్పులు, ఫిరంగుల దాడులో వాస్తవాధీన రేఖకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో పౌరులు చనిపోయిన విషయాన్ని పీడీ సంపాదకీయం గుర్తు చేసింది. ఒకసారి గనుక యుద్ధం మొదలైతే అది అక్కడితో ఆగదని, పెద్దయెత్తున ప్రజలు నిర్వాసితులవుతారని పీపుల్స్ డెమొక్రసీ వ్యాఖ్యానించింది. 2003 నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పుల విరమణ ఎన్నిసార్లు ఉల్లంఘనకు గురైనదీ, . సరిహద్దుల్లో స్థానికంగా తలెత్తిన ఘర్షణలు కాశ్మీర్‌లో చొరబాట్లు పెరగడానికి ఎలా కారణమైనదీ., దీనివల్ల కాశ్మీర్‌లో ఎన్ని సమస్యలు తలెత్తినదీ పీడి వివరించింది. పాకిస్తాన్ జిహాదీ ఉగ్రవాదులకు మద్దతివ్వకుండా నిలువరించేందుకు ఆ దేశంపై దౌత్య పరంగా పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని పీడీ సంపాదకీయం పేర్కొంది.
యురీలోని సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడిని అమెరికా, రష్యా ఖండించాయని, అమెరికా ఖండనలో పాకిస్తాన్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదన్నది. పాకిస్తాన్ నుంచే ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారన్న భారత్ వాదనను రష్యా అంగీకరించిందని తెలిపింది. రష్యా భారత్‌కు అత్యంత విశ్వసనీయమైన మిత్ర దేశమని దీని ద్వారా మరోసారి రుజువైందని పీడీ పేర్కొంది. రష్యా భారత్‌కు సహజ మిత్రురాలని, ఈ నెలాఖరున పాక్‌తో కలిసి తొలిసారిగా సంయుక్త సైనిక విన్యాసాల్లో అది పాల్గొనడానికి కారణం అమెరికాతో భారత్ వ్యూహాత్మకంగా దోస్తీ కట్టడమేనని అది తెలిపింది. వ్యూహాత్మక సంయమనాన్ని పాటిస్తూ వాస్తవాధీన రేఖ వద్ద చొరబాట్లను అరికట్టేందుకు భద్రతను మరింత పటిష్టం చేయడంపై దృష్టి పెట్టాలని పీడీ సూచించింది. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులు భారత్‌లోకి ఎలా చొరబడ్డారనే విషయమై జరిపిన విచారణలో తేలిందేమిటో ఇంతవరకు ప్రజలకు తెలియజేయలేదని పీడీ విమర్శించింది. యురీలో వద్ద వాస్తవాధీన రేఖను ఉగ్రవాదులు దాటి సైనిక శిబిరంలోకి ఎలా చొరబడ్డారనేదానిపై దర్యాప్తు జరపాల్సి ఉందని పేర్కొంది. జీహాది ఉగ్రవాదుల చొరబాట్ల వలన ఎదురువతున్న ప్రమాదాలను ఎదుర్కొంనేందుకు సమగ్ర చర్యలు తీసుకోవలసిన అవసరమున్నదని తెలిపింది.
కాశ్మీర్ ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో యురీ దాడి చోటుచేసుకుందన్న విషయం మరువరాదు. కాశ్మీర్‌లో నిరసనకారులపై ప్రభుత్వం విచక్షణారహితంగా పెల్లెట్లను వాడడం, అశాంతిని అణచివేసేందుకు పెద్దయెత్తున నిర్బంధాన్ని ప్రయోగించడం వంటి ఘటనలు అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను మసకబార్చుతున్నాయని పీడీ పేర్కొంది. అణచివేసే దిశలో అక్కడి ప్రభుత్వం వివక్షతను ప్రదర్శిస్తున్నది ప్రజాస్వామిక హక్కులు అణచివేత, ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించడాలను నివారించడంపై మోడి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోనిదే పాకిస్తాన్‌పై తెచ్చే దౌత్య పరమైన ఒత్తిడి అంతగా ఫలితానివ్వవని సంపాదకీయం తెలిపింది. ఇక ఎంతమాత్రం జాప్యం చేయకుండా అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు చేపట్టాలని పీడీ సూచించింది. కాశ్మీర్‌లో పెచ్చుమీరుతున్న అణచివేతకు యురీ ఘటన మరో సాకు కాకుండా చూడాలని అది సూచించింది.

No comments:
Post a Comment