Wednesday, 7 September 2016

|| వడ్డించే వాడు మనవాడైతే ||




                # కెజి బేసిన్‌ నుంచి 'జియో' దాకా... మోడీ అండతోనే అంబానీ దూకుడు #

ఇటీవల 'జియో' పేరుతో రిలయెన్స్‌ ఇండ స్ట్రీస్‌ లిమిటెడ్‌ అధినేత ముకేష్‌ అంబానీ ప్రారంభించిన 'ఉచి త' ఇంటర్నెట్‌, మొబైల్‌ఫోన్‌ సేవల గురించి భారీ ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి రిలయెన్స్‌ జారీ చేసిన వాణిజ్య ప్రకటనలో ప్రధాని నరేంద్రమోడీ ఫోటో ఉండడం వివాదాస్పదమైంది. అంతేకాదు, మోడీ, అంబానీలు ఆప్యాయ తతో ఆలింగనం చేసుకుంటున్న అనేక ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకప్పుడు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, నేడు దేశ ప్రధానిగా మోడీ అధికారం అండతోనే అంబానీ ఆస్తులు కొన్ని వందల రెట్లు పెరిగాయని ఇటీవలి పరిణా మాలన్నీ బలం చేకూరుస్తున్నాయి.
సరిగ్గా వారం రోజుల క్రితం వెలువడిన జస్టిస్‌ షా కమిషన్‌ నివేదికలో, కృష్ణా-గోదావరి బేసిన్‌లో ఓఎన్‌జీసీకి చెందిన బ్లాకుల్లోంచి గ్యాస్‌ అక్రమ తరలింపు ద్వారా రిలయెన్స్‌ 11 వేల కోట్ల రూపాయల భారీ అవినీతికి పాల్పడిందని నిర్ధారించారు. దీనికి గాను ఆ కంపెనీ నుంచి వడ్డీతో సహా నష్టపరిహారం వసూలు చేయాలని కమిషన్‌ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 
కానీ దీనిపై మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయింది. ఇంత పెద్ద కుంభకోణం బైటపడినందుకు అంబానీని ఉతికి పారేయాల్సి న మీడియా ఆ పని చేయకపోవడం గమనార్హం! పైగా ఉచిత 'జియో' సేవలకు గాను అంబానీని అందరూ ఆకాశానికె త్తేస్తున్నారు. ఈ అవినీతిపై అంబానీని ఎందుకు నిలదీయడం లేదు? మోడీ దన్ను ఉన్నందువల్లనే ఆయన వెలిగిపోతున్నారా? అంటూ సోషల్‌ మీడియాలో పలువురు నెటిజన్లు ధ్వజమెత్తారు. పెద్ద పెద్ద మీడియా సంస్థలన్నీ ముకేష్‌ అంబానీ భజన చేస్తున్నాయని వారు మండిపడ్డారు.

|| ఉచిత 'డేటా' మాటున భారీ లూటీ ||

              నిజానికి 'జియో' ద్వారా పరిమిత కాలవ్యవధి వరకు 'ఉచిత' సేవలను అందించడం వెనుక కొద్దికాలంలోనే మార్కెట్‌నంతా గుప్పిట్లోకి తెచ్చుకోవాలనే భారీ కుట్ర ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. స్వయంగా ప్రధాని అండ ఉండడం వల్లే మిగతా టెలికాం కంపెనీల అభ్యంతరాలను సైతం లెక్కచేయకుండా అంబానీ దూసుకుపోతున్నారని వారి అభిప్రాయం. కొద్ది నెలల పాటు ఉచిత సేవలను కల్పించడం ద్వారా కలిగే తాత్కాలిక నష్టాన్ని మార్కెట్‌ భారీ విస్తరణ ద్వారా పూడ్చుకోవడమే రిలయెన్స్‌ పకడ్బందీగా పన్నిన వ్యూహం. అంతేకాదు, ఇటీవల ప్రభుత్వం పెట్రోల్‌ ధర మూడు రూపాయలు, డీజిల్‌ ధర రెండు రూపాయలు పెంచడం వెనుక కూడా రిలయెన్స్‌ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని చెబుతున్నారు. పెట్రోలియం రంగంలో కూడా అగ్రతాంబూలం రిలయెన్స్‌దే అన్న విషయం తెలిసిందే. దేశంలో చాలా ప్రాంతాలు దాని ఆధీనంలోనే ఉన్నాయి. కాబట్టి జియో 'ఉచిత' ఆఫర్లపై రిలయన్స్‌కు రూ. 10 వేల కోట్ల నష్టం వస్తుందనుకున్నా అంతకు ఐదింతల లాభం పెరిగిన పెట్రో ధరలతో ఖాయంగా సమకూరుతుంది. 'డేటా అనేది తమకు కొత్త చమురు' అని అంబానీ ఇటీవల చేసిన వ్యాఖ్యల అంతరార్థం కూడా ఇదేనని విశ్లేషకుల అభిప్రాయం.

|| హజీరాలో టోకరా ||

గుజరాత్‌లోని హజీరా ప్లాంట్‌లో తయారయ్యే ఒక రసాయన పదార్థాన్ని తప్పుగా వర్గీకరించడం ద్వారా రిలయెన్స్‌ రూ. 25 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడిందన్న మరో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. దీనిపై సెంట్రల్‌ ఎక్సైజ్‌ ఇంటలిజెన్స్‌ దర్యాప్తు ప్రారంభించింది. నాఫ్తా అనే రసాయనాన్ని ప్రాసెస్‌ చేయడం ద్వారా తయారయ్యే సాల్వెంట్‌ గ్రేడ్‌ మిక్స్‌డ్‌ జిలైన్‌ అనే మినరల్‌ ఆయిల్‌ను ఆర్గానిక్‌ కెమికల్‌గా పేర్కొనడం ద్వారా రిలయెన్స్‌ ఈ ఎగవేతకు పాల్పడినట్టు తెలిసింది. ఈ మినరల్‌ ఆయిల్‌ను పెయింట్‌ తయారీలో ముడిసరకుగా ఉపయోగిస్తారు. దీనిపై 14 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నును తగ్గించుకునేందుకు రిలయన్స్‌ దాన్ని మినరల్‌ ఆయిల్‌గా కాకుండా, ఆర్గానిక్‌ కెమికల్‌ అని పేర్కొంది. అలా దానిపై 12.5 శాతం మాత్రమే పన్ను చెల్లించింది. ఇలా మోసానికి పాల్పడడం ద్వారా ప్రభుత్వానికి రూ. 25 కోట్లు ఎగవేసినట్టు లెక్కలు వేశారు.

|| రిలయెన్స్‌పై టెలికాం వార్‌ ||

                    రిలయన్స్‌ ఉచిత జియో ఆఫర్లపై టెలికాంలు రగిలిపోతున్నాయి. జియో ఫ్రీ కాల్స్‌ కోసం ఇంటర్‌కనెక్ట్‌ పాయింట్లను అందించలేమంటూ అవి ప్రధానమంత్రి కార్యాలయానికి ఓ లేఖ రాశాయి. నెల రోజుల వ్యవధిలో ఇది రెండో లేఖ. అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ అభ్యర్థనల్ని ఆమోదించాల్సిన బాధ్యత తమపై ఏమీ లేదని అవి ఆ లేఖలో స్పష్టం చేశాయి. జియో వాయిస్‌ ట్రాఫిక్‌ను అడ్జస్ట్‌ చేయడానికి తమ వద్ద తగినంత నెట్‌వర్క్‌ గానీ, తగినన్ని ఆర్థిక వనరులు గానీ లేవని అవి రాశాయి. 'సాధారణంగా ఇన్‌కమింగ్‌-ఔట్‌గోయింగ్‌ ట్రాఫిక్‌ నిష్పత్తి 1:1గా ఉంటుంది. జియో బీటా పరీక్షల్లో ఇది 10:1కి చేరుతోంది. రిలయన్స్‌ ఆశిస్తున్నట్టుగా దాని వినియోగదారుల సంఖ్య 10 కోట్లకు చేరితే ఈ నిష్పత్తి 15:1కి చేరుతుంది' అని సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఓఏఐ) ఆ లేఖలో పేర్కొంది. 'జియో వినియోగదారుల ఇన్‌కమింగ్‌ వాయిస్‌ ట్రాఫిక్‌ను అన్‌లోడ్‌ చేయడానికి ప్రస్తుత ఆపరేటర్ల వెయిటెడ్‌ వాయిస్‌ రియలైజేషన్‌ వాయిస్‌ మినిట్‌కు 30-40 పైసల నుంచి 22-25 పైసలకు, అంతకన్నా తక్కువకు పడిపోతుంది' అని సీఓఏఐ ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రిన్సిపల్‌ కార్యదర్శి నృపేంద్ర మిశ్రాకు రాసిన లేఖలో పేర్కొంది.

No comments:

Post a Comment