|| స్విస్ ఛాలెంజ్‌పై స్టే ||
పాలకులు ధర్మకర్తలుగా వ్యవహరించాలి. భూముల కేటాయింపులు, కాంట్రాక్టర్ల ఎంపిక వంటివి రాజ్యాంగానికి లోబడి ఉండాలని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా 20 ఏళ్ల పాటు కొనసాగే ఈ ప్రాజెక్టుపై స్టే జారీ చేయడమే మా ముందున్న ఏకైకమార్గం.
- హైకోర్టు ధర్మాసనం
రాజధాని అమరావతి నిర్మాణంలో పారదర్శకతకు నిలువునా పాతరేసి లోపభూయిష్టమైన స్విస్‌ఛాలెంజ్ విధానం అమలుకు చంద్రబాబు సర్కారు ఉవ్విళ్లూరుతుండగా ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు దానికి తాత్కాలికంగా బ్రేక్ వేయడం ఆహ్వానించదగిన పరిణామం. రాజధానిని అడ్డుకోవాలన్న దురుద్దేశంతోనే స్విస్‌ఛాలెంజ్‌ను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిన వాదనలో వీసమెత్తు పస లేదని సోమవారంనాటి హైకోర్టు స్టేతో లోకానికి తెలిసొచ్చింది. అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఏం చేసినా చెల్లుబాటవుతుందని విర్రవీగుతున్న సర్కారుకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు చెంపపెట్టు. అయితే కింద పడ్డా పైచేయి నాదే అంటోంది సర్కారు. సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేపై రద్దు కోరుతూ పైకోర్టులో సవాల్ చేస్తామని సంకేతాలిస్తోంది. దీన్నిబట్టి తప్పులను సరిచేసుకొనే బదులు లొసుగులు వెతికి బయట పడేందుకే సర్కారు ఉబలాటపడుతున్నట్లు అర్థమవుతోంది. నాట్ బిఫోర్ వంటి చిట్కాలను వ్యూహాత్మకంగా ఉపయోగపెట్టుకొని వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న తరుణంలో అంతిమంగా ఏం జరుగుతుందో ముందస్తుగా ఊహించడం కష్టం. కాగా ప్రభుత్వం ఏరి కోరి ఎంచుకున్న స్విస్‌ఛాలెంజ్ లోపాలపుట్ట అని హైకోర్టు విచారణ సందర్భంగా ప్రాధమికంగా నిర్ధారణ అయింది. ఆ విషయాన్ని సర్కారు కూడా అంగీకరించింది. సింగపూర్ కన్సార్టియం సీల్డ్ కవర్‌లో ప్రతిపాదించిన రహస్యాలను బహిరంగపరుస్తామని తొలుత కోర్టుకు హామీ ఇచ్చింది. టెండర్ల సవరణ నోటిఫికేషన్‌కూ సరేనంది. తదుపరి మాట మార్చి తొలిదశలో అర్హత సాధించిన బిడ్డర్లకు మాత్రమే 'సింగపూర్' రహస్యాలను వెల్లడిస్తామని కోర్టు ధిక్కారానికి పాల్పడింది. పిటిషనర్ల అభ్యంతరాలకు తోడు ఇచ్చిన మాటను సర్కారు తప్పినందున కోర్టు ఆగ్రహం చెందింది. సవరణ నోటిఫికేషన్‌లో బిడ్లు దాఖలు చేసేందుకు ఈ నెల 13వ తేదీ గడువు కాగా దానికి సరిగ్గా ఒక్కరోజు ముందు స్విస్‌ఛాలెంజ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేయాలని కోర్టు స్టే విధించడం విశేషం. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతోపాటు పూర్తి స్థాయి విచారణ అక్టోబర్ 31న చేపడతామంది.
రాజధాని నిర్మాణ అంశాన్ని ఆది నుంచీ చంద్రబాబు సర్కారు తన స్వంత వ్యవహారం మాదిరి రహస్యంగా ఉంచింది. రాజధాని స్థల ఎంపిక మొదలుకొని భూసమీకరణ వరకు అంతా గోప్యమూ, ఏకపక్షం. అందరినీ కలుపుకు పోవాలని, వారి అభిప్రాయాలను సేకరించాలని ఏనాడూ అనుకోలేదు. ప్రభుత్వ ఈ పోకడే ఏదో జరుగుతోందన్న అనుమానాలకు తావిచ్చింది. ఊహించనట్లుగానే భారీ కుంభకోణానికి భూమిక సిద్ధమైందని హైకోర్టు విచారణ తేటతెల్లం చేసింది. స్విస్‌ఛాలెంజ్‌లో పారదర్శకత లేదని 2009లోనే సుప్రీంకోర్టు పేర్కొంది. దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై అధ్యయనం చేసిన కేల్కర్ కమిటీ సైతం స్విస్‌ఛాలెంజ్‌ను ప్రోత్సహించవద్దని స్పష్టం చేసింది. వీటన్నింటినీ తోసిపారేసి తాననుకున్న సింగపూర్ ప్రైవేటు కంపెనీలకు రాజధానిని అప్పగించేందుకు స్విస్‌ఛాలెంజ్ తారకమంత్రాన్ని జపిస్తోంది. తమకుతాముగా స్విస్‌ఛాలెంజ్‌కు కంపెనీలు ముందుకొస్తే పూర్తి పారదర్శకతతో తీసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించగా అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ కంపెనీలతో ముందుగానే సమస్త చర్చలూ జరిపింది. మాస్టర్‌ప్లాన్‌లను ఆ దేశ కంపెనీలే రూపొందించాయి. ఏడాదిన్నర తర్జన భర్జనల నడుమ 'వాటా'లు తేలాక అప్పుడు ఛాలెంజ్ ఎలా అవుతుందో అర్థంకాదు. అది ముమ్మాటికీ దోపిడీకి ఉద్దేశించిన పరస్పర అవగాహనా ఒప్పందమే అవుతుంది.
సింగపూర్ కంపెనీల స్విస్‌ఛాలెంజ్ ప్రతిపాదనలు, అందుకు ప్రభుత్వం ఒప్పుకున్న నిబంధనలను గమనిస్తే క్విడ్‌ప్రోకో దోపిడీ సులభంగానే అర్థమవుతుంది. కేవలం రూ.306 కోట్లు పెట్టుబడిపెట్టి సీడ్‌కేపిటల్‌లో 1,691 ఎకరాలను సింగపూర్ కన్సార్టియం చదునుచేసి ప్లాట్లు వేసి అమ్ముతుంది. సచివాలయం, రాజ్‌భవన్ వంటి ప్రధాన నిర్మాణాల జోలికిపోదు. ఆ మాత్రానికే కన్సార్టియంకు 58 శాతం వాటా ఇస్తారట. మౌలిక సదుపాయాలతో సహా రూ.5,271 కోట్లు పెట్టుబడిపెట్టే సర్కారు వాటా 42 శాతమేనట. భూమి లీజు 33 నుంచి 99 సంవత్సరాల పెంపు, వివాదాలొస్తే లండన్ కోర్టులో పరిష్కారం చేసుకోవడం ఇవన్నీ సింగపూర్ కన్సార్టియానికి సర్కారు జీహుజూర్ అనేవే. రైతుల నుంచి సేకరించిన భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఒకానొక కుతంత్రానికి పక్కా ప్లాన్ ఇది. విచారణ సందర్భంలో హైకోర్టు లేవనెత్తిన సందేహాలను పరిశీలిస్తే సింగపూర్ కంపెనీల కోసమే టెండర్ నిబంధనలు రూపొందాయనీ తెలుస్తుంది. విదేశాల్లో నిర్మాణ అనుభవం ఉండాలన్న నిబంధన, సింగపూర్ కంపెనీల ఆదాయ రహస్యాల వెల్లడిలో విన్యాసాలు, బిడ్ల దాఖలుకు స్వల్ప గడువు ఇవన్నీ 'సింగపూర్' కోసమే. మనవాళ్లకిస్తే మురికివాడలు కడతారన్న సిఎం ఉవాచ కూడా అందుకే. హైకోర్టు స్టేతోనైనా సర్కారు 'సింగపూర్ మోజు'ను విడనాడాలి. పారదర్శకత పాటించాలి. ప్రజలపై పెను భారాలు మోపే ప్రైవేటు రాజధాని కాకుండా జన బాహుళ్యానికి ఆసరా కల్పించే ప్రజారాజధానిని నిర్మించాలి.

No comments:
Post a Comment