*ఎన్‌డిటివిపై చర్య అప్రజాస్వామికం
*ముక్త కంఠంతో ఖండించిన ప్రతిపక్షాలు
*సిపిఎం పొలిట్‌బ్యూరో ఖండన
ఎన్‌డిటివి ఇండియా హిందీ ఛానెల్‌పై ఈ నెల 9న ఒక రోజు నిషేధం విధించాలన్న కేంద్రం నిర్ణయంపై వామపక్షాలు మండిపడ్డాయి. ఇది 'అప్రకటిత ఎమర్జన్సీ' అని వ్యాఖ్యానించాయి. ఇది ఆమోద యోగ్యం కాని చర్య అంటూ పేర్కొన్నాయి. తక్షణమే ఈ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా కోరాయి. రెండు రోజుల క్రితమే మీడియా అవార్డుల ఫంక్షన్‌లో 'ఎమర్జన్సీ ముప్పులపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారని, ఆ వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రిని నిర్బంధంలోకి తీసుకున్నారని ఆ తర్వాత ఎన్‌డిటివిపై వేటు వేశారని ఇది విచారకరమని వామపక్షాలు పేర్కొన్నాయి.
ఒక ర్యాంక్‌కు ఒక పెన్షన్ అంశంపై మాజీ సైనికోద్యోగి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రివాల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు వాటన్నింటికీ మించి ఎన్‌డిటివి ప్రసారాల స్వేచ్ఛపై దాడికి పాల్పడ్డారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. సిపిఐఎంఎల్-లిబరేషన్ కూడా ఇవే అభిప్రాయాలు వ్యక్తం చేసింది. కొద్ది వారాల క్రితం కాశ్మీర్ రీడర్‌పై నిషేధం, చత్తీస్‌ఘర్‌లోని బస్తర్ జిల్లాలో జర్నలిస్టులపై భద్రతా బలగాల దాడుల వంటి సంఘటనల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇవన్నీ కూడా అప్రకటిత ఎమర్జన్సీ చర్యలు కాకుండా మరేమిటని సిపిఐఎంఎల్-లిబరేషన్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రభాత్ కుమార్ ప్రశ్నించారు.
ఒక ర్యాంక్‌కు ఒక పెన్షన్ అంశంపై మాజీ సైనికోద్యోగి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రివాల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు వాటన్నింటికీ మించి ఎన్‌డిటివి ప్రసారాల స్వేచ్ఛపై దాడికి పాల్పడ్డారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. సిపిఐఎంఎల్-లిబరేషన్ కూడా ఇవే అభిప్రాయాలు వ్యక్తం చేసింది. కొద్ది వారాల క్రితం కాశ్మీర్ రీడర్‌పై నిషేధం, చత్తీస్‌ఘర్‌లోని బస్తర్ జిల్లాలో జర్నలిస్టులపై భద్రతా బలగాల దాడుల వంటి సంఘటనల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇవన్నీ కూడా అప్రకటిత ఎమర్జన్సీ చర్యలు కాకుండా మరేమిటని సిపిఐఎంఎల్-లిబరేషన్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రభాత్ కుమార్ ప్రశ్నించారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, జెడియు నేత శరద్ యాదవ్, డిఎంకె చీఫ్ ఎం.కరుణానిధి, బిఎస్‌పి అధినేత్రి మాయావతి, ఆర్‌జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌లు కేంద్రంపై విరుచుకుపడ్డారు. భావ ప్రకటనా స్వేచ్ఛను అవమానించడమేనని నిరసించారు. తక్షణమే ఈ చర్యను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భారత్ వంటి దేశంలో స్వేచ్ఛ, నిష్పాక్షిక మీడియా అవసరం ఎంతో వుందని నితీష్ కుమార్ పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం మీడియా గొంతు నులుముతోందని లక్నోలో మాయావతి విమర్శించారు. ఇటువంటి కార్యకలాపాలతో కేంద్రం గనుక ముందుకు సాగితే రెండవ ఎమర్జన్సీకి దారి తీస్తుందని కరుణానిధి హెచ్చరించారు. అత్యవసర పరిస్థితి, నిరంకుశత్వం వైపు దేశాన్ని మోడీ లాక్కెళుతున్నారని లాలూ ప్రసాద్ వ్యాఖ్యానించారు.
# మోడీ సర్కార్ నిరంకుశ ధోరణికి ఇది తార్కాణం : సిపిఎం పొలిట్‌బ్యూరో #
మోడీ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి ఈ చర్య నిదర్శనంగా చెప్పుకోవచ్చునని సిపిఎం పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది. మీడియా స్వేచ్ఛపై ఇది దారుణమైన దాడి అని, భావ ప్రకటనా స్వేచ్ఛను నులిమివేసే యత్నమని పొలిట్‌బ్యూరో విమర్శించింది. పెరుగుతున్న మోడీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణులకు ఈ చర్య తార్కాణమని పేర్కొంది. వెంటనే ఈ నిషేధాన్ని ఎత్తివేసి, ఇటువంటి నిరంకుశ చర్యలు భవిష్యత్తులో తీసుకోబోమంటూ హామీ ఇవ్వాలని పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.
# తక్షణం ఉపసంహరించుకోవాలి : వార్తాపత్రికల ఉద్యోగుల సమాఖ్య #
ప్రభుత్వ చర్యను ఖండిస్తూ తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అఖిల భారత వార్తాపత్రికల యజమానుల సమాఖ్య (ఎఐఎన్‌ఇఎఫ్) డిమాండ్ చేసింది. నిషేధాన్ని వ్యతిరేకిస్తూ సాగే ఉద్యమానికి తమ సంపూర్ణ సంఘీభావం వుంటుందని ఎఐఎన్‌ఇఎఫ్ అధ్యక్షుడు ఎస్‌డి.థాకూర్, ఉపాధ్యక్షుడు ఎస్.కె.పాండే, ప్రధాన కార్యదర్శి బాలగోపాలన్‌లు ఒక సంయుక్త ప్రకటనలో ప్రకటించారు.
# దేశ భద్రత కోసమే ఈ చర్య : ప్రభుత్వ సమర్ధన #
కాగా మరోవైపు దేశ భద్రత దృష్ట్యా ఈ చర్య సమర్ధనీయం అంటూ ప్రభుత్వం సమర్ధించుకోవాలని చూసింది. ఈ చర్యను రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛపై మోడీ సర్కార్ చాలా గౌరవం వుందంటూ చెప్పుకొచ్చారు. కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సమర్ధించారు. తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలపై కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలను ఎన్‌డిటివి ఉల్లంఘించిందని అన్నారు. వెంకయ్య నాయుడు స్పందిస్తూ ఈ సందర్భంగా గతంలో నిషేధం విధించిన చానెళ్ళ వివరాలను ప్రకటించారు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతిని వారం రోజుల పాటు నిషేధించామని, ఎఎక్స్‌ఎన్‌ను రెండు మాసాల పాటు, ఎఫ్‌టివిని రెండు నెలలు, ఎంటర్ 10ను ఒక రోజు, భారత్ మ్యాప్‌ను తప్పుగా చూపినందుకు అల్ జజీరా ఛానెల్‌ను ఐదు రోజుల పాటు నిషేధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

No comments:
Post a Comment