శని సింగనాపూర్, నాసిక్‌లోని త్రయంబకేశ్వర్, ముంబయి లోని హజీ అలీ దర్గాలలో మహిళల ప్రవేశంపై నిషేధానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన నారీ లోకం శబరిమలలో వివక్షపై ఎక్కుపెట్టిన పోరాటంకూడా కీలకదశకు చేరింది. వీరి పోరాటానికి కేరళలోని వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్డిఎఫ్) ప్రభుత్వం తన సంపూర్ణ మద్దతును పునరుద్ఘాటించడం ఎంతైనా అభినందనీయం.
దీనిపై ఇక సుప్రీం కోర్టు తీర్పు వెలువడడమే తరువాయి. దీనిపై సోమవారం వాద ప్రతివాదాలు విన్న సర్వోన్నత న్యాయస్థానం ఛాందసవాదుల అసంబద్ధ వాదనలను చీల్చి చెండాడింది. రాజ్యాంగం ఈ దేశ పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులను నొక్కి చెప్పిన తీరు ప్రశంసనీయం. శబరిమల విషయంలోనే కాదు, పైన పేర్కొన్న ఇతర ఆలయాలు, దర్గాల విషయంలోనూ న్యాయస్థానం గట్టిగా నిలబడింది. భారతదేశ లౌకిక విధానం తిరుగులేనిదని నిర్ద్వంద్వంగా చాటిచెప్పింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు మతం, సాంప్రదాయాలు, కట్టుబాట్ల పేరుతో మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా దిగజార్చే ధోరణిని ఇంకెంతమాత్రం సహించేది లేదని స్పష్టంగా తేల్చి చెప్పాయి. కేరళ ఎల్డిఎఫ్ ప్రభుత్వం కూడా మహిళల పోరాటానికి మద్దతుగా నిలవడంతో శబరి మల ఆలయ నిర్వాహక బోర్డు అయిన ట్రావెంకూర్ దేవస్థానం ఆత్మ రక్షణలోపడింది. శబరిమల ఆలయంలోకి 10-50 ఏళ్ల వయో గ్రూపు వారిని తప్ప మిగతా మహిళలను అనుమతిస్తున్నామని పసలేని వాదన చేసింది. ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధానికి హేతుబద్ధత ఏమిటని ప్రశ్నించేసరికి ట్రావెంకూర్ దేవస్థానం కంగుతిన్నది. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయమని, రుతుక్రమంలో వున్న మహిళలు శబరి మల ఆలయంలోకి ప్రవేశిస్తే అది మలినమవుతుందంటూ అసంబద్ధ వాదనలను ముందుకు తెచ్చింది. పంపానది నుంచి ఆలయం వరకు గల ప్రాంతంలో పారిశుధ్య పనులను మహిళలే చేస్తున్నారు. అప్పుడు లేని అభ్యంతరం ఆలయంలో ప్రవేశం విషయంలోనే ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తే ఆలయ నిర్వాహకులు నోరెళ్లబెట్టారు. రుతు క్రమం వల్లే మహిళలకు ఆలయ ప్రవేశాన్ని నిషేధించామని చెబుతున్న వాదన కూడా తర్కానికి నిలిచేది కాదు. అస్సాంలోని కామాక్య ఆలయం, కేరళలోని చెంగనూర్‌లో దేవి ఆలయాల్లో రుతుస్రావ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అక్కడ అది కరెక్టు అయినప్పుడు ఇక్కడ తప్పు ఎలా అవుతుందని నిలదీస్తే దానికి సనాతనవాదులనుంచి సరైన జవాబు లేదు. శబరిమల ఆలయంలో 1500 ఏళ్ల నుంచి మహిళలు ప్రవేశించడం లేదనడానికి మీ దగ్గర వున్న ఆధారాలేమిటి అని సుప్రీం ధర్మాసనం వేసిన ప్రశ్నకు బదులివ్వకుండా 1991లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆలయ నిర్వాహక బోర్డు ఉటంకించింది. ఇది తరతరాలుగా ఆచరిస్తూ వస్తున్న సంప్రదాయమని, రాజ్యాంగ పరమైన వివక్ష పరిధిలోకి ఇది రాదంటూ కేరళ హైకోర్టు ఆనాడు ఈ ఆంక్షలను సమర్థించింది. ఆ తీర్పు ఎంత లోపభూయిష్టమైనదో సుప్రీం కోర్టు ఎత్తిచూపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25, 26కు కేరళ కోర్టు పూర్తి విరుద్ధమని తేల్చి చెప్పింది. సనాతన ధర్మం పేరుతో తప్పుడు భాష్యాలు, సిద్ధాంతాలతో మహిళా హక్కులను హరించడం ఎంతమాత్రమూ సమర్థనీయం కాదని సర్వోన్నత న్యాయస్థానం నొక్కి చెప్పడం సనాతనవాదులకు చెంపపెట్టు. వయసు, లింగం, కులం ప్రాతిపదికన వివక్షను రాజ్యాంగం తిరిస్కరిస్తున్నదని సుప్రీం సరిగానే ఉద్ఘాటించింది. పౌరులకు రాజ్యాంగం కల్పించే హక్కులను హరించే అధికారం సనాతనవాదులకు లేదని ఢంకా బజాయించింది. హిందువులైనా, ముస్లింలైనా మరే మతం వారైనా సరే మహిళలను తక్కువ చేసి చూడడం, వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం పురుషాధిపత్య సమాజంలో ఒక ప్రధాన ధోరణిగా వున్నది. ఈ వివక్షకు వ్యతిరేకంగా మహిళాసంఘాలు, ప్రజాతంత్ర శక్తులు , అభ్యుదయవాదులు కలిసికట్టుగా ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరమెంతైనా వుంది. దీనిని కేవలం మహిళల హక్కులకు సంబంధించిన పోరాటంగానే చూడరాదు. మతం పేరిట, సంస్కృతి, ఆచారాల పేరిట దేశ లౌకిక విధానంపైన, ప్రజాతంత్ర హక్కులపైన దాడులు చేస్తున్న సనాతనవాదులకు వ్యతిరేకంగా సాగించే పోరాటంగా దీనిని చూడాలి.

No comments:
Post a Comment