ఒకానొక స్వతంత్ర దేశంలో 'మేం ఇంకా బందీలుగానే వున్నాం. సామాజిక ఆర్థిక వివక్షకు, వేధింపులకు, దోపిడీకి గురవుతున్నాం. మాకు విముక్తి కావాలి. స్వాతంత్య్రం కావాలి' అంటూ నినదిస్తున్నారూ అంటే ఆ దేశం ఎంతగా వెనకబడి వుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు గుజరాత్లో అహ్మదాబాద్ నుంచి ఉనా వరకు జరుగుతున్న 'అజాదీ కూచ్' సరిగ్గా అలాంటిదే. మతం ముసుగులో, గోరక్షణ సాకుతో హిందూ మతోన్మాదులు తమ మీద చేస్తున్న అత్యంత హేయమైన దాడులను ప్రభుత్వాలు అడ్డుకోల ేకపోతున్నందుకు నిరసనగా దళితులు మొదలెట్టినదే ఈ పాదయాత్ర. గోసంరక్షణ వారికి ప్రధానమైతే...గౌరవప్రదమైన ఉపాధి వీరికి ప్రాణప్రదమై కూర్చుంది.
పాదయాత్ర
ఈనెల ఐద వ తేదీన అహ్మ దాబాద్లో దళితులు ప్రారంభించిన 'అజాదీ కూచ్' (ఫ్రీడమ్ మార్చ్) 15 వతేదీన ఉనాలో ముగుస్తుంది. అక్కడే వారు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. మొత్తం 355 కిలోమీటర్ల ప్రయాణమిది. 30 దళిత సంఘాలతో ఏర్పడిన 'ఉనా దళిత్ అత్యాచార్ లదాత్ సమితి' నేతృత్వంలో ఈ పాదయాత్ర సాగుతోంది. తాము రూపొందించిన డిమాండ్లను యాత్ర పొడవునా జరిగే దళిత సమావేశాల్లో వివరిస్తూ, వారిని చైతన్యవంతులను చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇకమీదట ఎలాంటి దురాగతాలను సహించబోమన్న సందేశాన్ని ప్రభుత్వానికి ఇవ్వడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యం. పైగా తరతరాలుగా చేస్తున్న అగౌరవప్రదమైన పనులను ఇక మీదట చేయబోమని ప్రపంచానికి చాటాలన్నది కూడా వారి ఉద్దేశ్యం. మొత్తంమీద 53 సంవత్సరాల కిందట స్వాతంత్య్రం కోసం, ఉపాధి కోసం నల్లజాతివారు చేసిన 'వాషింగ్టన్ మార్చ్'ను తలపిస్తోందీ పాదయాత్ర.
నేరాలు కొండంత...శిక్షలు గోరంత...
కేంద్రంలో బి.జె.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక (2014) దళితులపై హింస గతం కంటే (2010) 44 శాతం పెరిగిందని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. 2014లో 47,064 నేరాలు నమోదైతే వాటిలో 30 శాతం బి.జె.పి పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, చత్తీస్గఢ్లో జరిగినవే. అయితే ఇతర పార్టీలు ఏలుతున్న రాష్ట్రాలూ తక్కువేం కాదు. అన్నిచోట్లా దాడులకు తెగబడుతోంది మాత్రం హిందూత్వ శక్తులే. కాంగ్రెస్ పాలిత కర్నాటకలో బజరంగ్దళ్ కార్యకర్తలు దళితులను చితక బాదితే, నితీష్ కుమార్ బీహార్లో వారిపై మూత్రం పోశారు. గుజరాత్లో ఈ దాడులకు వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తుండగానే లక్నోలో గోరక్షకులు దళితులపై దాడికి దిగారు. ఈ ఘోరాలకు అంతే లేదు. నమోదైన నేరాలకు శిక్షల శాతానికి పొంతనే లేదు. 2014లో దళితుల మీద జరిగిన దురాగతాలకు సంబంధించి కేవలం 3.4 శాతం మందికి మాత్రమే శిక్ష పడింది. మిగతా నేరస్తులంతా దర్జాగా సంచరిస్తోంటే, బాధితులే బిక్కుబిక్కుమటూ బతకాల్సి వస్తోంది.
ఆత్మరక్షణకు ఆయుధాలు
ప్రభుత్వాలు దళితులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. మరీ ముఖ్యంగా గుజరాత్లో భద్రత కరవైంది. గ్రామాలలో పరిస్థితి చెప్పనలవి కాదు. కనక, ఆత్మరక్షణకు ఆయుధాల లైసెన్సులిమ్మని వారు కోరుతున్నారు. దీనినిబట్టే దాడులు ఎంత అమానవీయమైనవో, క్రూరమైనవో అర్ధం చేసుకోవచ్చు. ఉనా ఘటన చూసినా, తంగఢా పోలీసు కాల్పులు చూసినా, ఎటు నుంచి చూసినా తమకు రక్షణ లేద న్నది వారి అభిప్రాయం. ఉనాలో దళితులను చితగ్గొట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ దురాగతాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి శిక్ష విధించాలని వారు కోరుకుంటున్నారు. దళితుల కోసం జూడో, కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయాలన్నది వారి డిమాండ్.
ప్రత్నామ్నాయంతోనే విముక్తి
శతాబ్దాల తరబడి కంపుకొడుతున్న కళేబరాలను ఈడుస్తూనే వున్నారు. మురుగు కాల్వలను, మరుగుదొడ్లను చేతులతో శుభ్రం చేస్తూనే వున్నారు. సమాజం తమకి బలవంతంగా అంటగట్టిన నీచమైన ఈ పనులను వదిలించుకోవడం ఎంత కష్టమో వారికీ తెలుసు. తమ పట్ల కృతజ్ఞతాభావం కలిగించని పనుల నుండి విముక్తి పొందేందుకు ఓ ప్రయత్నం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధితోనే తమకు స్వాతంత్య్రం లభిస్తుందని వారు విశ్వసిస్తున్నారు. అందుకే ప్రత్నామ్నాయంగా తమకు గౌరవప్రదమైన ఉపాధిని చూపించాలని డిమాండు చేస్తున్నారు.

ఓటు బ్యాంకు
గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో తరుముకొస్తున్న ఎన్నికల నేపథ్యంలో దళిత ఓటుబ్యాంకు పట్ల నేతలకు ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తోంది. దళితులపై దాడులు జరగకుండా అడ్డుకోలేకపోతున్నారుగానీ...దాడులు జరిగినందుకు ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకొని చోటా మోటా నేతల వరకు పోటీపడి మరీ మొసలి కన్నీళ్లు కార్చేస్తున్నారు. నానా అబద్దాలూ ఆడేస్తూ నకిలీ గోరక్షకులూ పుట్టించేస్తున్నారు. అంతా ఓటుబ్యాంకు మహిమ! గణాంకాలు చూద్దాం. గుజరాత్లో కంటే తతిమ్మా రెండు రాష్ట్రాలలోనే దళితుల సంఖ్య ఎక్కువ. వీరు పంజాబ్లో 26 శాతం, ఉత్తరప్రదేశ్లో 21 శాతం, గుజరాత్లో 7 శాతంగా వున్నారు.

చారిత్రాత్మక ప్రతిజ్ఞ
తమ మీద సాగుతున్న అగ్రకులస్తుల దాడులకు నిరసనగా దళితులు చారిత్రాత్మక ప్రతిజ్ఞ పూనారు. గత నెల 31వ తేదీన 20 వేల మంది దళితులు, అంబేద్కర్ మీద ప్రమాణం చేసి మరీ జంతు కళేబరాలను తొలగించబోమని ప్రతిజ్ఞ చేశారు. వివక్షా పూరితమైన కుల వ్యవస్థలో తమకు కేటాయించిన అమానవీయ పనులను చేయబోమని గట్టిగా చెప్పారు. ఇది నిజంగా గుజరాత్ చరిత్రలో ఒక మైలు రాయిగా నిల్చిపోవడమే కాక... దేశవ్యాప్తంగా దళితులకు మార్గదర్శకమవుతుందనడంలో సందేహం లేదు.

బుద్ధం శరణం గచ్ఛామి ...
ఉనాలో జరిగిన చేదు ఘటనతో దళితులుమతం మార్చుకో వాలనుకుంటున్నారు. హిందూ మతస్తులందరూ సమానం కానప్పుడు, అందులో వుండడంలో అర్ధం లేదని అభిప్రాయ పడుతున్నారు. బనస్కాంత జిల్లాకు చెందిన వెయ్యి మంది బౌద్ధ మతం స్వీకరించేందుకు తమ సమ్మతి తెలియచేస్తూ ప్రభుత్వ అధికారులకు దరఖాస్తులు పెట్టుకున్నారు. గుజరాత్లో మత స్వేచ్ఛా హక్కు చట్టం (2008) ప్రకారం మత మార్పిడి కోరుకునేవారు జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోవాలి. వీరేనా! రోహిత్ వేముల తల్లి, సోదరుడు సైతం ఇలాంటి కారణాలవల్లే బౌద్ధం స్వీకరించడం చూశాం. ఇంకెందరు ఈ బాట పడతారో! కుల వివక్ష-వేధింపులు ఎన్నటికి ఆగుతాయో!

భూమి అదానీలు అంబానీలకేనా!
గుజరాత్ భూ పరిమితి చట్టం, అటవీ చట్టం ప్రకారం రాష్ట్రంలోని ఒక్కో దళిత కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇచ్చే సౌకర్యం వుంది. వాటి ఆధారంగా వెంటనే భూమిని పంచాలని దళితులు కోరుకుంటున్నారు. అదానీలు, అంబానీలు, ఎస్సార్లకు వేలాది ఎకరాలను కట్టబెట్టే ప్రభుత్వాలు దళితులకు భూమిని ఎందుకివ్వరన్న ఆవేదనాపూరితమైన వారి ప్రశ్నలకు పాలకులే సమాధానం చెప్పాలి.

ప్రధాన డిమాండ్లు
'అజాదీ కూచ్' ప్రభుత్వం ముందు వుంచిన డిమాండ్లలో ఆక్రోశాగ్రహాలు సమపాళ్లలో కనిపిస్తాయి. వాటిలో ప్రధానమైనవి...
- ఉనా దాడికి వ్యతిరేకంగా జులై 31వ తేదీన జరిగిన నిరసనోద్యమంలో పాల్గొన్న దళితులపై బనాయించిన 43 కేసులను త్వరితగతిన ఎత్తివేయాలి.
- పట్టణ ప్రాంతాలలో తమకు గృహ వసతి కల్పించాలి. ఎందుకంటే గ్రామాలలో నేటికీ సామాజిక వెలివేతకు, ఆర్థిక, లైంగిక దోపిడీకి గురికావాల్సి వస్తోంది.
- అత్యాచార నిరోధక చట్టం కింద ప్రత్యేక న్యాయస్థానాలను గుజరాత్లోని పాతిక జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలి.
- రాష్ట్రంలోని సఫాయి కర్మచారులకు ఆరవ వేతన సంఘం ప్రకారం వేతనాలను చెల్లించాలి.
- ప్రధాని ప్రచారం చేస్తున్న స్టార్టప్ ఇండియా కింద గౌరవ ప్రదమైన ఉపాధిని పొందే ఆర్థిక వెసులుబాటు కల్పించాలి

No comments:
Post a Comment