పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలకు గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడే ఎందుకు ప్రభు త్వం ఇంతగా ప్రాధాన్యతని స్తోంది? కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయం గా ఖర్చు చేయడానికి ఎందుకు పూనుకొంది? పిండ ప్రదానాలు, పవిత్ర స్నానాలు ఆచరించడం ఇదే మొదటిసారి అయినట్లుగా ప్రభుత్వం వ్యవహరించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? కృష్ణాతీరంలో పన్నెండు రోజుల పాటు సాగే 'పవిత్ర' పుష్కరాలను అన్నీ తానై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు నిర్వహిస్తున్నట్లు? ఇలాంటివే అనేక అంశాలపై చర్చ జరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా అటు గోదా వరి తీరంలోనూ, ఇటు కృష్ణా పరీవాహక ప్రాంతంలోనూ పుష్కరాలు జరగడం సర్వసాధారణం. ఎవరి వీలునుబట్టి వారు పుష్కరాల సమయంలో స్నానాలు ఆచరించడం, పిండ ప్రదానాలు నిర్వహించడం చేస్తారు. ఫలానా చోటే నిర్వహించాలనే నియమం ఏమీ లేదు. అయితే ప్రభుత్వం చేసే హడావిడి వల్ల పుణ్యం వస్తుందా? గోదావరి తీరంలో జరిగిందేమిటి? అందరినీ కృష్ణాతీరానికి రమ్మని ఆహ్వానించే సర్కారు ఆ మేరకు వసతులు, ఏర్పాట్లు చేస్తుందా? కొన్ని గంటల్లోనే పుష్కరాలు ప్రారంభమయ్యే సమయం ఆసన్నం అయినా ఇంకా అరకొర వసతులు, అసౌకర్యాలే కన్పిస్తున్నా యి. పుష్కరాలకు రాష్ట్రవ్యాప్తంగా తరలిరావాలని ముఖ్య మంత్రి స్థాయిలోనే పిలుపునిస్తుంటే భక్తులు ఏమి చేస్తారు? ప్రజల నమ్మకాన్ని రాజకీయం కోసం వాడుకోవడం కాదా? ప్రభుత్వం ఇచ్చే పిలుపును నమ్మి వచ్చిన వారు సుఖంగా తిరిగి వెళ్లే పరిస్థితులు ఏమైనా కృష్ణాతీరంలో ఉన్నాయా? ఈరోజు వరకూ పనులన్నీ అరకొరగానే ఉన్నాయి. చాలా పుష్కర ఘాట్స్లోకి సరిపడా నీళ్లు కూడా లేదు. ఒక వైపు పోలీసుల హడావిడి, మరో వైపు రవాణాపై తీవ్రమైన ఆంక్షలు, ఇన్నింటి మధ్య పుష్కర స్నానం ఎలా చేయాలో అర్థం కాని అయోమయంలో భక్తులున్నారు.
ప్రభుత్వ పుష్కరాలు
ఎన్నో ఏళ్లుగా పుష్కరాలు జరుగుతున్నాయి. ప్రజలు స్నానాలు ఆచరిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వమే అధికారికంగా పుష్కరాలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాల్లో సుమారు 15 కోట్ల మంది ప్రజలు పుష్కర స్నానాలు ఆచరించే అవకాశం ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పుష్కరాలు జరుగుతున్నా, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నంత హడావిడి ఇతర రాష్ట్రాల్లో లేదు. ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల పది లక్షల మంది, తెలంగాణలో మూడున్నర కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. భారీ ఎత్తునే వీటి కోసం ఖర్చు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రాలోనే కేటాయింపులు కూడా అధికం. తెలంగాణలో రూ.825 కోట్లు కేటాయిస్తే, ఆంధ్రాలో మాత్రం మూడు వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వమే ఖర్చు చేస్తూ భక్తుల్ని ఆహ్వానిస్తుంటే రాకుండా ఎలా ఉంటారు?
వాస్తవానికి ప్రభుత్వం చేసే ఆర్భాటానికి, వాస్తవానికి ఎలాంటి పొంతనా లేదు. కృష్ణాతీరంలో చాలా చోట్ల ఇంకా పనులు పూర్తికానేలేదు. పుష్కర స్నానాలు చేసే భక్తులు నానా అగచాట్లు పడకుండా తిరిగి వెళ్లలేరు. ప్రభుత్వం చేసే హడావిడి వల్ల ఎక్కువ మంది తరలి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయవాడ, పరిసర ప్రాంతాలకు ఎక్కువగా వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. కృష్ణాతీరంలో ఎక్కడైనా స్నానాలు చేయవచ్చు. కానీ ముఖ్యులందరూ విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే స్నానాలు చేస్తారు. అక్కడే అన్ని వసతులూ ఉంటాయనే భ్రమలు కల్పిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతానికి ఎక్కువగా తరలివచ్చే అవకాశం ఉంది. దీనివల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. భద్రత, రవాణా, ట్రాఫిక్జామ్లు వంటివన్నీ ఏర్పడతాయి. ఆయా స్నాన ఘట్టాల్లో పరిస్థితులు కూడా అనుకున్నంత సుఖంగా ఏమీ లేవు. విజయవాడలో అడుగడుగునా నిఘా పెట్టారు. ఆంక్షలు విధించారు. సంతోషంగా వచ్చి తిరిగి వెళ్లే పరిస్థితులు లేవనే చెప్పాలి.
రాజకీయ ప్రయోజనమే!
పుష్కర స్నానం అనేది ప్రజల విశ్వాసానికి సంబంధిం చిన అంశం. దీన్ని ప్రభుత్వం గుర్తించింది. ప్రముఖుల రాజకీయ సభలకు కూడా రానంత జనం ఛోటా మోటా స్వామీజీల ప్రవచనాలకు తరలివెళ్లే రోజులు దాపురించాయి. ఇంట్లో అమ్మానాన్నలను అనాధాశ్రమాలకు పంపే సుపుత్రులు సైతం కోట్లాది రూపాయలు హుండీలో వేసే రోజులు ఎప్పుడో వచ్చేశాయి. నగంగా నర్తించడం, కాళ్లతో తన్నించుకోవడం వంటివి కూడా భక్తిలో ఒక భాగంగా భావించే రోజులను ప్రభుత్వం పసిగట్టింది. అందుకే పుష్కరాలు అందివచ్చాయి. 12 రోజుల పాటు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా సాగిపోతుంది. రాష్ట్ర ప్రజలను భక్తిలో ముంచెత్తి ప్రభుత్వం మాత్రం ప్రశాంతంగా ఉండాలని భావిస్తోంది. ఎక్కడా ప్రజా సమస్యలపై ఎవరూ మాట్లాడరు. ఆందోళనలు ఉండవు. ప్రభుత్వంపై విమర్శలు ఉండవు. ఫలానాది కావాలని కోరేవారు ఉండరు. ఎవరైనా సాహసించి అలాంటివి కోరితే భక్తికి ముడివేసి నాస్తికునిగా ముద్రవేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎవరూ సాహసించరు. విజయవాడ నగరంలో మసీదులు, గుడులను కూల్చివేసిన ప్పుడు, నాయకుల విగ్రహాలను కూలగొట్టినప్పుడు కూడా ఏమాత్రం వెనకాడని ప్రభుత్వం ఇప్పుడు ప్రజల సెంటిమెంటును మాత్రం రాజకీయంగా వాడుకోవడానికి సిద్ధపడింది. మసీదును కూల్చడానికి ముస్లిం అధికారిని, హిందూ దేవాలలను కూల్చడానికి హిందూ అధికారులను వినియోగించిన ప్రభుత్వానికి 'పవిత్ర' పుష్కరాలపై ఏమా త్రం నమ్మకం, సెంటిమెంటు ఉన్నాయో అర్థం చేసుకోవాలి.
లౌకిక రాజ్యంలో ఒక మతాన్ని ప్రోత్సహించవచ్చా? అన్ని మతాలనూ సమానంగా చూస్తామని చెప్పే నాయకులు ఒక్క పుష్కరాలను మాత్రమే అధికారికంగా నిర్వహిస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుచేయవచ్చా? అలా చేస్తే అన్ని మతాల విశ్వాసాలను, వారి ఉత్సవాలను కూడా గౌరవించి, అదే స్థాయిలో నిర్వహించాలి కదా? ఎందుకని చేయడం లేదు? నాస్తికులుగా ఉన్న కొంతమంది నేతలు ఇప్పుడు పూర్తిస్థాయి ఆస్తికులుగా మారడం వెనుక ఉన్నది రాజకీయ ప్రయోజనం కాదా? వారిలో పూర్తిస్థాయి భక్తిపారవశ్యం నిండిపోయిందా? అలా అయితే మసీదులను, గుడులను ఎందుకు రాత్రికి రాత్రే కూల్చివేస్తారు? ఇవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం చేసేవే తప్ప మరొకటి కాదు. ముహూర్తాలు, మేళతాళాలు, వేదపఠనాలు అన్నీ కూడా వారి వారి విశ్వాసాన్ని బట్టి అమలు చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వమే వాటిని పాటించాలని పనిగట్టుకొని ప్రచారం చేయడం లౌకిక రాజ్యంలో సబబు కాదు. కోట్లాది మంది జనాభా చిన్నా, పెద్దా అన్ని మతాల ఆచారాలు పాటించే జనం. మతం ఒక విశ్వాసం. దాన్ని ఎవరు, ఎలా, ఎందుకు పాటిస్తారనేది వ్యక్తిగతం. కానీ నాయకుడు ప్రజల మనిషి. ప్రభుత్వం ప్రజా సమూహంతో ఏర్పడిన వ్యవస్థ. అటు నాయకుడూ, ఇటు ప్రభుత్వమూ కూడా అన్ని వర్గాలు, మతాల ప్రజలకు జవాబుదారీగానే ఉండాలి. కానీ అవసరాన్ని బట్టి, ఓట్లు రాలే విధానాన్ని బేరీజువేసుకొని మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని వినియోగించుకోవడం ఏ విశ్వాసానికి నిదర్శనం?
ముందుచూపేదీ?
కోట్లాది మంది పుష్కర స్నానాలు ఆచరించే కృష్ణానదీ తీరంలో కనీస భద్రత లేదు. అనేక శాఖలు సమన్వయంతో నిర్వహించాలన్న యోచన కూడా లేకుండా పోయింది. పుష్కరాలంటే పాత విధానంలో జరిగిపోతాయనే భావన తోనే అధికారులున్నారు. అలా అనుకోబట్టే గోదావరి పుష్కరాల్లో పెనుదుర్ఘటన చోటుచేసుకొంది. దుర్ఘటన జరిగిన ప్రాంతంలో కనీసం మంచినీళ్లుగానీ, భద్రతా సిబ్బంది గానీ ఎవరూ లేరు. పిట్టల్లా భక్తులు రాలిపోయిన గంటలు గడిచినా వారిని పట్టించుకున్న నాథుడు లేడు. ఒక శాఖకూ, మరో శాఖకూ మధ్య ఏమాత్రం సమన్వయం లేకపోవడం వల్లనే ఇలాంటి విషాదాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు కృష్ణా పుష్కరాల్లో సైతం ఇలాంటి పరిస్థితులే కన్పిస్తున్నాయి. ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఆయా శాఖలు వ్యవహరిస్తున్నాయి. అదేమంటే అన్నీ ముఖ్యమంత్రే చూసుకుంటున్నప్పుడు ఇంకా మా అవసరం ఏముందనేది ఆయా శాఖల సమాధానంగా ఉంది. ముఖ్యమంత్రే పుష్కర ఘాట్లను సందర్శించి, ఆయనే లైట్లను పరిశీలిస్తే మిగతా శాఖలు ఎలా పనులు చేయగలుగుతాయి? వచ్చే జనాభాకు అనుగుణంగా ఏర్పాట్లు లేవు. పోలీసుల హడావిడి మాత్రం భయంగొలిపేలా ఉంది. ఆంక్షలు తీవ్రతరం చేశారు. పోలీసుల వలయంలో బెజవాడ నగరం ఉంది. కృష్ణాతీరం అంతటా భయంగొలిపేలా చేస్తున్నారు. 'పవిత్ర' స్నానాన్ని ఆచరించడం ఇప్పుడు ఖరీదుగా, కష్టంగా మారే వాతావరణాన్నే ప్రభుత్వం సృష్టించింది. అన్నీ సవ్యంగా జరిగితే రాజకీయంగా ప్రభుత్వానికి కొంత మేర లాభం వచ్చే అవకాశం ఉండొచ్చు. కానీ ఏమాత్రం భక్తులకు అసౌకర్యం కల్పించినా, ఆవేశపడేలా చేసినా తీవ్ర మూల్యాన్నే చెల్లించే ప్రమాదం కూడా పొంచి ఉంది.
- కంచల జయరాజ్
(వ్యాసకర్త 10టీవీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్, విజయవాడ)

We have discussedd on the same issue, you're are correct and your article contemplating obviously, what was done recently. Discussions have to be continued until a conclusion cited
ReplyDeleteThanks