Friday, 19 August 2016

|| అగ్రవర్ణాధిక్యతకే పశువుకు పవిత్రత ||



                 ''దళితులపై జరుగుతున్న దాడులకు ముగింపు పలకాలి. కావాలంటే మీరు నన్ను చం పండి. దళితులను మాత్రం లక్ష్యంగా చేసుకోవద్దు'' అని హైదరాబాద్‌లో జరిగిన సభలో ప్రధాని మోడీ దళితులపై జరుగుతున్న దాడులపై కపటంగా (అంత కపటంగా మాట్లాడటం మరొకరికి సాధ్యం కాదు) వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోనూ, దేశం లోని ఇతర ప్రాంతాలలోనూ దళితులపై జరుగుతున్న దాడులకు ఖండన ప్రధాని ప్రకటనలో లేదు. ఆ తర్వాత చెప్పిన మాట లు దాడులు చేసేవారికి ప్రోత్సాహం అందించేలా ఉన్నాయి. మోడీ ఇంకా ఇలా కొనసాగించారు : ''తల్లి మనకు కొన్ని నెలలే పాలి స్తుంది. ఆవు జీవితాంతం ఇస్తుంది. చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడుతుంది.'' ఆ విధంగా మాట్లాడి ఆవును తల్లికన్నా ఉన్నత స్థానంలో పెట్టి, ఆవులను చంపుతున్నారనే పేరుతో మనుషులను చంపుతున్న వారికి నైతిక మద్దతు అందించారు. అందువల్లనే మోడీ ప్రకటన తర్వాత దళితు లపై దాడులు తగ్గకపోగా మరింత పెరిగాయి. యుపి, ఉత్త రాది రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ దాడులు జరి గాయి. చనిపోయిన ఆవు చర్మం ఒలిచినందుకు గుజ రాత్‌లో దళితులపై దాడి జరిగిన తర్వాత దళితులలో నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళన కార్యక్రమాలలో ముగ్గురు దళితులు మరణించారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవటంతో ఫ్రీడం మార్చ్‌ నిర్వహిస్తామని గుజరాత్‌లోని దళితులు ప్రకటించారు. ఫ్రీడం మార్చ్‌ ప్రారంభమయ్యే వరకూ నోరు మెదపని మోడీ సందేశం ఏమిటో గోరక్షకుల ముసుగులో ఉన్నవారికి తెలుసు. అందుకే మోడీ ప్రకటన తర్వాత దాడులు ఆగకపోగా మరింతగా పెరిగాయి. ఆవు పాలు మనుషులు తాగుతారు కాబట్టి ఆ సెంటిమెంటును ఉపయోగించుకోవటానికి మోడీ ప్రయ త్నించారు. మనుషులకు పాలిచ్చే జంతువులను తల్లికన్నా ఉన్నత స్థానంలో పెడితే గేదెలు, మేకలను కూడా అదే స్థానంలో పెట్టాలి. దేశంలో ఆవు పాలకన్నా గేదె పాలు తాగేవారే ఎక్కువ మంది ఉన్నారు. ఆ విధంగా చూస్తే ఆవుకన్నా గేదే ఎక్కువ మందికి తల్లవుతుంది. మేకలు కూడా లక్షల మందికి తల్లులవుతాయి. సంఫ్‌ు పరివార్‌, మోడీ వీటిని పట్టించుకోవటం లేదు. హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టాలన్న తమ లక్ష్యం ఆవు ద్వారానే సాధ్యమౌతుంది. కాబట్టి ఆవును తల్లిగా ప్రచారం చేస్తున్నారు. హిందువులు పామును నాగదేవతగా పూజిస్తుంటారు. చాలా దేవాలయాలలో నాగదేవత ప్రతిమలుంటాయి. కొన్ని విష్ణాలయాలలో విష్ణుమూర్తి శేషపాన్పుపై పవళించినట్లు ప్రతిమలుంటాయి. అనేక గ్రామాలలో పాము పుట్టలకు పూజచేస్తుంటారు. నాగులచవితి రోజు ప్రత్యేకంగా పూజలు చేయటం రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఉన్నది. ఇంత భక్తితో పూజలు చేసేవారు కూడా త్రాచుపాము తమ నివాసం సమీపంలో కనిపిస్తే దాన్ని చంపేవరకూ నిద్రపోరు. మనం పూజచేసే దేవత ఏమీచేయదని, తమకు రక్షణ కల్పిస్తుందని భావించరు. పాముకరిస్తే తమకు ప్రమాదం కాబట్టి దానికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కొందరు కుక్కను గౌరీదేవిగా భావించి పూజిస్తుంటారు. కొన్ని పండుగలప్పుడు దాని మొహానికి పసుపురాసి, మెడలో వేపమండలు కట్టి పూజచేస్తారు. కానీ కుక్కల సంఖ్య పెరిగి ప్రజలకు ఇబ్బందిగా మారినప్పుడు కుక్కలను పట్టేవారిని పిలిపించి, వాటిని నిర్మూలించటానికి ప్రయత్నిస్తారు. జంతువులనే కాక చెట్లను, ఇతర ప్రకృతిశక్తులను కూడా పూజించటం చూస్తుంటాం. వేపచెట్టును మహాలక్ష్మిగా భావించి పూజలు చేస్తారు. ఇంట్లో వేపచెట్టు ఉంటే శుభమని భావిస్తారు. రావిచెట్టుకు కూడా పూజలు చేస్తారు. రావిచెట్టు, వేపచెట్టు ఒకేచోట ఉంటే వాటి రెంటికీ పెళ్ళిచేయటం కూడా కొన్నిచోట్ల చేస్తుంటారు. జమ్మిచెట్టుకు పూజలు చేస్తారు. దేవుళ్ళకు చేసేపూజలలో జమ్మి ఆకులు ఉండేలా చూస్తారు. అయినా ఈ చెట్లు ఎక్క డైనా తమకు అటంకంగా ఉన్నట్లు లేదా వాటిని నిర్మూ లించటం వలన తమకు ప్రయోజనం కలుగుతుందని ప్రజ లు భావిస్తే వాటిని నరికివేయటానికి ఏ మాత్రం సందేహిం చరు. అగ్నిని దేవునిగా భావించి పూజలు చేస్తారు. ప్రజలు తమకు అవసరం అయినంత మేరకే నిప్పును ఉపయోగించు కొని, అవసరం తీరగానే ఆర్పివేస్తారు. గాలిని వాయుదేవుని గా పూజిస్తారు. కానీ తమకు ఎంతమేరకు గాలి అవసరమో అంతమేరకే గాలివచ్చేలా తమ ఇళ్ళను నిర్మించుకుంటారు. వర్షాన్ని వరుణదేవునిగా భావించినా తమ అవసరానికి మించి భారీ వర్షాలు కురవరాదని కోరుకుంటారు. సూర్య చంద్రులను దేవతలుగా భావించినా, ఎక్కువ ఎండలో ఉండ టం ఆరోగ్యానికి హానికరం కాబట్టి సూర్యుడు బాగా ప్రకాశిం చేటప్పుడు మండుటెండలో ఉండటానికి ఎవరూ సిద్ధపడరు. చంద్రుడు బాగా ప్రకాశించేటప్పుడు వెన్నెలలో ఉండటం ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి వెన్నెలలో ఉండాలని కోరు కుంటారు. అందువలన ప్రజలు దేవతలుగా భావిస్తున్నా తమకు ప్రకృతిశక్తులతో ఎంతవరకు ప్రయోజనం ఉంటుందో అంతవరకే వినియోగించుకుంటారు. తమకు ఉపయోగం ఉండదనుకున్నప్పుడు వాటిని నిర్మూలించటం ద్వారా ప్రయో జనం పొందటానికి ఏ మాత్రం సందేహించరు.
ఇతర జంతువులు, ప్రకృతిశక్తులను విగియోగించుకున్న విధంగానే మానవులు ఆవులనూ వినియోగించుకున్నారు. ఆవులు పాలిచ్చినన్ని రోజులూ, సంతానాన్ని కనేశక్తి ఉన్నంత వరకూ వాటిని పోషించారు. ఆ శక్తి ఉడిగిపోయి వాటి వలన ప్రయోజనం లేదనుకున్నప్పుడు వాటిని ఆహారంగా వినియో గించుకున్నారు. ఈనాటికీ అలానే వినియోగించుకుంటు న్నారు. మిగతా జంతువులను అవసరం మేరకు వినియో గించుకోవటానికి లేని అభ్యంతరాన్ని హిందూ మతోన్మాదులు ఆవుల విషయంలో ముందుకు తెస్తున్నారు. ఆవు మాంసం తినటాన్ని వివాదాస్పదం చేయటం హిందూ మతోన్మాదులకు ఉపయోగపడుతుంది కాబట్టి వివాదాలను సృష్టిస్తున్నారు. ఆవుమాంసం కొందరు హిందువులు కూడా తినటంతో పాటు ప్రధానంగా ముస్లిములు తింటారు. కాబట్టి ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టటానికి వినియోగించుకుంటున్నారు. చనిపోయిన పశువుల చర్మం ఒలిచే పనిని దళితులు చేస్తారు. ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను ఐక్యం చేయటానికి, దళితులను అణచివేయటానికి రెండింటినీ ఉపయోగించు కుంటున్నారు. ముస్లింలుగాని, దళితులుగాని ఆవులను ఒకచోటు నుంచి మరోచోటుకు తరలిస్తుంటే గో రక్షకులుగా పేరు పెట్టుకున్న గూండా గుంపులు వారిని అడ్డగిస్తున్నారు. తరలిస్తున్నవారు హిందువులైతే ఆవులను చంపటానికి తీసుకెళుతున్నా వారిని వదిలూస్తున్నారు. కబేళాకు తరలు తున్న ఆవులను హిందువుల వద్ద నుంచి విడిపిస్తే వారికేమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి వదిలేస్తున్నారు. ఆవును ముస్లింలు చంపుతున్నారని ప్రచారం చేస్తే వారిపై ద్వేషాన్ని పెంచటానికి, హిందువులను ఐక్యం చేయటానికి ఉపయోగ పడుతుంది. కాబట్టి ఆవులను చంపి, మాంసం ఎగుమతి చేస్తున్న బిజెపి ఎమ్మెల్యే సంగీత్‌సోమ్‌పై వారికేమీ కోపం ఉం డదు. ఆయన వారి నాయకుడుగానే చలామణి అవుతున్నాడు.
తమపై సాగుతున్న వివక్షను అంతం చేయటానికి, తమ హక్కులను సాధించుకోవటానికి పోరాడుతున్న దళితులను అణచివేయటానికి వారిపై దాడులు చేస్తున్నారు. ముస్లింలు, దళితులపై దాడులకు ఆవు సాధనంగా వినియోగపడు తుందని ఆర్‌యస్‌యస్‌, బిజెపిలు భావిస్తున్నాయి. అందుకే ఆర్‌యస్‌యస్‌ అనుబంధ సంస్థలన్నీ ఈ దాడుల్లో భాగం పంచుకుంటున్నాయి. ప్రధాని, కేంద్రమంత్రులు దాడులను ప్రేరేపిస్తున్నారు. ప్రధాని మౌనంగా దాడులను బలపరుస్తూ, తానుగా తప్పనిసరిగా ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడిన ప్పుడు ఖండించకుండా మాటల గారడీతో దాడులను ప్రోత్స హించే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా దళితులు, ముస్లింలు, అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభు త్వం, ఆర్‌యస్‌యస్‌, బిజెపిలు వ్యవహరిస్తున్నాయి. గోరక్షకు లుగా వ్యవహరిస్తున్నవారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుం టున్నా ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం గుడ్లప్ప గించి చూస్తున్నాయి. వ్యక్తులు ఎవరైనా తప్పుచేస్తే చట్టప్రకా రం శిక్షించాలి తప్ప వ్యక్తులు, సంస్థలు ఎవరిష్టం వచ్చినట్లు వారు చేయరాదు. అలా చేయటం అరాచకానికి, గూండాయి జానికి దారితీస్తుంది. ప్రభుత్వం కావాలనే ఇటువంటి అరాచకశక్తు లను ప్రోత్సహిస్తున్నది. ఆర్‌యస్‌యస్‌, దాని అనుబంధ సంఘాలు బోధిస్తున్న హిందూత్వకు, హిందు మతానికి ఎటు వంటి సంబంధం లేదు. వారి ప్రబోధాలను అనుసరించటా నికి హిందూ సమాజం సిద్ధంగా లేదు. భారత దేశ రాజ్యాంగం ప్రకారం కూడా హిందూత్వను అమలు చేయటం సాధ్యం కాదు. కాబట్టి దౌర్జన్యంగా తమ విధానాలను సమాజంపై రుద్దటానికి మతోన్మాదులు ప్రయత్నిస్తున్నారు. చట్టాలతో నిమిత్తం లేకుండా వ్యవహరించేలా గూండా గుంపులను తయారు చేస్తున్నారు. సంఘ్  పరివార్‌ చేస్తున్న ఈ కుట్ర సమాజానికి పూడ్చలేనంత నష్టం కలిగిస్తుంది. అభ్యుదయ శక్తులన్నీ ఐక్యంగా కదిలితేనే ఈ నష్టాన్ని నివారించగలం.
- ఎ కోటిరెడ్డి

No comments:

Post a Comment